ఒర్లాండోలో 'భువన విజయం' | Telugu Association of Greater Orlando celebrated Ugadi Sambaralu | Sakshi
Sakshi News home page

ఒర్లాండోలో 'భువన విజయం'

Published Thu, Apr 27 2017 2:13 PM | Last Updated on Tue, Sep 5 2017 9:50 AM

Telugu Association of Greater Orlando celebrated Ugadi Sambaralu

అలరించిన భువన విజయం
ఒర్లాండో:
తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ఒర్లాండో(టాగో) ఆధ్వర్యంలో సెంట్రల్‌ ఫ్లోరిడా ఆడిటోరియంలో జరిగిన ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి.  కౌంటీ ప్రాపర్టీ అప్‌రైజర్‌ రిక్‌ సింగ్‌ ఆరెంజ్‌ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'భువన విజయం' నాటిక అందరిని అలరించింది. ఆంధ్రభోజుడు శ్రీకృష్ణ దేవరాయలు తన ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజాలతో జరిపిన సంభాషణలను నాటికలో అద్భుతంగా ప్రదర్శించారు. శ్రీకృష్ణదేవరాయల పరాక్రమపాటవాన్ని, కవితాభినివేశాన్ని, దానగుణాలను కవులు పద్యరూపంలో ప్రస్తుతించారు.

తెలుగు భాషా గొప్పదనాన్ని నాటికలో వివరించారు.  రాయల కాలం నుంచి ఆధునిక యుగం వరకు జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలతో కొత్తదనంగా ఈ నాటికను రూపొందించారు. కిభాశ్రీ, సాయి ప్రభాకర్, కళ్యాణ్,  మూర్తి బొందాడ, మధు చెరకూరిలు నాటికని విజయ వంతంగా ప్రదర్శించడంలో తమ వంతు కృషి చేశారు. టాగో ప్రెసిడెంట్‌ రమేష్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement