ఓర్లాండో షూటర్ భార్యను రోజూ కొట్టేవాడు! | Orlando Shooter, Omar Mateen is a Wife Beater: Report | Sakshi
Sakshi News home page

ఓర్లాండో షూటర్ భార్యను రోజూ కొట్టేవాడు!

Published Mon, Jun 13 2016 8:39 AM | Last Updated on Fri, Jul 27 2018 2:28 PM

ఓర్లాండో షూటర్ భార్యను రోజూ కొట్టేవాడు! - Sakshi

ఓర్లాండో షూటర్ భార్యను రోజూ కొట్టేవాడు!

వాషింగ్టన్: ఓర్లాండోలోని గే నైట్ క్లబ్బులో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 50 మంది మృతికి కారణమైన ఒమర్ మతీన్ తనను రోజూ కొట్టేవాడని అతని మాజీ భార్య తెలిపింది. భద్రత కారణాల దృష్ట్యా తన వివరాలను వెల్లడించని ఆమె 'వాషింగ్టన్ పోస్ట్'తో మాట్లాడుతూ.. ఒమర్ మతీన్(29) తనను కారణం లేకుండానే చీటికిమాటికి కొట్టేవాడని, లాండ్రీ పని చేయలేదని కూడా కొట్టిన సందర్భాలున్నాయని తెలిపింది. అతడు బయటకు వెళ్లి ఇంటికిరాగానే కొట్టడం స్టార్ట్ చేసేవాడని వెల్లడించింది.   

2009లో ఆప్ఘనిస్తాన్ సంతతికి చెందిన మతీన్ను ఆమె న్యూయార్క్లో కలుసుకున్నట్లు తెలుస్తోంది. వివాహం అనంతరం కొంతకాలం ఫ్లోరిడాలో మతీన్తో కలిసున్న ఆమె.. అతని ప్రవర్తనతో విసుగుచెంది విడాకులు తీసుకున్నట్లు సమాచారం. కాగా 'గే' కల్చర్కు మతీన్ తీవ్ర వ్యతిరేకి అని.. ఇటీవల ఓ ప్రదేశంలో ఇద్దరు మగవారు ముద్దుపెట్టుకుంటుండగా చూసిన మతిన్ తీవ్ర ఆవేశానికి లోనయ్యాడని అతని తండ్రి వెల్లడించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement