ప్రజ్నేశ్ గుణేశ్వరన్
మెల్‌బోర్న్: ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తుది మెట్టుపై తడబడ్డాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్ చివరి రౌండ్ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 6–7 (2/7), 2–6తో గుల్బిస్ (లాత్వియా) చేతిలో ఓడిపోయాడు. క్వాలిఫయింగ్ టోర్నీ చివరి రౌండ్‌లో ఓడినప్పటికీ... 122వ ర్యాంకర్ ప్రజ్నేశ్‌కు ‘లక్కీ లూజర్’గా మెయిన్ ‘డ్రా’లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మెయిన్ ‘డ్రా’ విడుదల కావడం... ఎంట్రీలు ఖరారు చేసిన ముగ్గురు ఆటగాళ్లు వైదొలగడంతో ఈ మూడు బెర్త్‌లను క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో ఓడిన అత్యుత్తమ ర్యాంక్ ఉన్న ఆటగాళ్లతో భర్తీ చేస్తారు. మూడు బెర్త్‌ల కోసం క్వాలిఫయింగ్ చివరి రౌండ్‌లో ఓడిన ఐదుగురు అత్యుత్తమ ర్యాంక్ ఆటగాళ్ల మధ్య ‘డ్రా’ నిర్వహించి ముగ్గురిని ఎంపిక చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment