
అంతర్జాతీయస్థాయిలో కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న భారత టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో ప్రజ్నేశ్ మూడు స్థానాలు ఎగబాకి 94వ ర్యాంక్‌కు చేరాడు.
భారత్‌కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్ 137వ స్థానంలో... యూకీ బాంబ్రీ 171వ స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని 250వ ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల 293వ ర్యాంక్‌లో ఉంది.