career-best Rank
-
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్
అంతర్జాతీయస్థాయిలో కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న భారత టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తన కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. సోమవారం విడుదల చేసిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో ప్రజ్నేశ్ మూడు స్థానాలు ఎగబాకి 94వ ర్యాంక్‌కు చేరాడు. భారత్‌కు చెందిన రామ్‌కుమార్ రామనాథన్ 137వ స్థానంలో... యూకీ బాంబ్రీ 171వ స్థానంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని 250వ ర్యాంక్‌లో నిలిచాడు. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల 293వ ర్యాంక్‌లో ఉంది. -
సాహో సింధు!
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు మరో ఘనత సాధించింది. తన కెరీర్ లో బెస్ట్ ర్యాంకును సొంతం చేసుకుంది. ప్రపంచ బ్మాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్) తాజాగా ప్రకటించిన మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్ లో 2వ స్థానానికి ఎగసింది. స్వదేశంలో ఇటీవల జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో సింధు విజేతగా నిలిచింది. ఒలింపిక్ చాంపియన్ కరోలినా మారిన్ ను వరుస సెట్లలో ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో సింధుకు 24,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 లక్షల 79 వేలు)తోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ సిరీస్ కు ముందు ఐదో ర్యాంకులో ఉన్న సింధు తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో రెండో స్థానానికి ఎగబాకింది. మారిన్ మూడో ర్యాంకులో కొనసాగుతోంది. చైనీస్ తైపీ ప్లేయర్ తాయ్ జుయింగ్ టాప్ ర్యాంకులో ఉంది. మరో భారత స్టార్ సైనా నెహ్వాల్ 9వ ర్యాంకు దక్కించుకుంది. -
కెరీర్ బెస్ట్ ర్యాంక్‌లో కోహ్లి
దుబాయ్: న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి... టెస్టుల్లో కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన తాజా జాబితాలో 9వ ర్యాంక్‌లో నిలిచాడు. ఈ ఢిల్లీ ప్లేయర్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 214 పరుగులు చేశాడు. చతేశ్వర్ పుజారా 7వ ర్యాంక్‌కు పడిపోయాడు. అజింక్యా రహానే 46వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ 8 స్థానాలు ఎగబాకి 12వ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. వాట్లింగ్ 45వ ర్యాంక్‌కు ఎగబాకాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ రెండు స్థానాలు దిగజారి 10వ ర్యాంక్‌తో సరిపెట్టుకోగా... హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 12వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.