
న్యూఢిల్లీ: భారత నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఈ ఏడాది తొలిసారి ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. చైనాలో జరుగుతున్న కున్‌మింగ్ ఓపెన్‌లో ఈ చెన్నై ఆటగాడు పురుషుల సింగిల్స్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
శనివారం జరిగిన సెమీఫైనల్లో రెండో సీడ్ ప్రజ్నేశ్ 7–6 (7/5), 6–7 (3/7), 6–4తో మూడో సీడ్ కామిల్ మజార్జక్ (పోలాండ్)పై విజయం సాధించాడు. 2 గంటల 48 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రపంచ 80వ ర్యాంకర్ ప్రజ్నేశ్ ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఈ ఏడాది మూడు ఏటీపీ చాలెంజర్ టోర్నీల్లో పాల్గొన్న ప్రజ్నేశ్ రెండింటిలో సెమీస్ చేరుకోగా... మరో టోర్నీలో రెండో రౌండ్‌లో ఓడిపోయాడు. నేడు జరిగే ఫైనల్లో 14వ సీడ్ జే క్లార్క్ (బ్రిటన్)తో ప్రజ్నేశ్ ఆడతాడు.
Comments
Please login to add a commentAdd a comment