
కొంతకాలంగా అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సర్క్యూట్ టోర్నమెంట్‌లలో నిలకడగా రాణిస్తోన్న భారత ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అధిరోహించాడు. ఆదివారం చైనాలో ముగిసిన కున్‌మింగ్ ఓపెన్ చాలెంజర్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన ప్రజ్నేశ్... సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి 75వ ర్యాంక్‌ను అందుకున్నాడు.
రామ్‌కుమార్ రామనాథన్ ఐదు స్థానాలు... ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని తొమ్మిది స్థానాలు పురోగతి సాధించి వరుసగా 151వ ర్యాంక్‌లో, 247వ ర్యాంక్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment