
ఫ్లోరిడా: మయామి ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 84వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 6–7 (3/7), 4–6తో ప్రపంచ 61వ ర్యాంకర్ జౌమి మునార్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు.
గంటా 38 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ నాలుగు ఏస్‌లు సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన ప్రజ్నేశ్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. తొలి రౌండ్‌లోనే ఓడిన ప్రజ్నేశ్‌కు 16,425 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 లక్షల 35 వేలు)తోపాటు 10 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment