ప్రిక్వార్టర్స్‌లో ప్రజ్నేశ్‌  | Prajnesh Stuns World No.67 Millman in Los Cabos Open | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో ప్రజ్నేశ్‌ 

Jul 31 2019 10:30 AM | Updated on Jul 31 2019 10:30 AM

Prajnesh Stuns World No.67 Millman in Los Cabos Open - Sakshi

ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌

న్యూఢిల్లీ: మెక్సికో ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 90వ ర్యాంకర్‌ ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ శుభారంభం చేశాడు. మెక్సికోలోని లాస్‌ కబోస్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ప్రజ్నేశ్‌ 6–4, 1–6, 6–2తో ప్రపంచ 67వ ర్యాంకర్‌ జాన్‌ మిల్‌మన్‌ (ఆస్ట్రేలియా)పై సంచలన విజయం సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. గంటా 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్‌ ఆరు ఏస్‌లు సంధించి, రెండు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన ప్రజ్నేశ్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో జీవన్‌ నెడుంజెళియన్‌–పురవ్‌ రాజా (భారత్‌) ద్వయం 3–6, 3–6తో లుకాస్‌ పుయి–గ్రెగోరి బరెరే (ఫ్రాన్స్‌) జంట చేతిలో ఓడిపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement