![Australian Open Qualifying Tournament - Sakshi](/styles/webp/s3/article_images/2019/01/9/Untitled-5.jpg.webp?itok=9AqUA494)
మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ రెండో రౌండ్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో అంకిత రైనా శుభారంభం చేయగా... కర్మన్‌కౌర్ థండి తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. సెర్గియో గిటెరెజ్ (స్పెయిన్)తో జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్ 6–3, 6–2తో గెలుపొందాడు.
70 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ ఐదు ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. అంకిత 6–2, 6–2తో మిర్టెల్లి జార్జెస్ (ఫ్రాన్స్)ను ఓడించింది. 62 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అంకిత తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. కర్మన్ కౌర్ 0–6, 5–7తో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా) చేతిలో ఓడిపోయింది. కర్మన్ ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 33 అనవసర తప్పిదాలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment