అంటాల్యా (టర్కీ): అంటాల్యా ఓపెన్ ఏటీపీ గ్రాస్‌కోర్ట్ టోర్నమెంట్లో భారత టెన్నిస్ ఆటగాడు రామ్‌కుమార్ రామనాథన్ పోరాటం ముగిసింది. గురువారం రెండు గంటల 43 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 7–6 (7/0), 3–6, 6–7 (6/8)తో మార్కోస్ బాగ్దాటిస్ చేతిలో ఓడిపోయాడు.
తొలి సెట్ టైబ్రేకర్‌లో 7/0తో సునాయాస విజయం సాధించిన రామ్, రెండో సెట్‌లో తేలిపోయాడు. నిర్ణాయక మూడో సెట్‌లో టైబ్రేక్‌లో చివరిదాకా పోరాడినా 6/8తో ఓటమి చవిచూశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 11 డబుల్‌ఫాల్ట్‌లు చేసిన రామ్ 10 ఏస్‌లు సంధించాడు.
క్వార్టర్స్‌లో రామ్‌కుమార్ ఓటమి
Published Fri, Jun 30 2017 2:08 AM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
Advertisement
Advertisement