అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్ – డబ్ల్యూ35) మహిళల ఓపెన్ టోర్నమెంట్ డబుల్స్ విభాగంలో భారత క్రీడాకారిణి అంకిత రైనా తన భాగస్వామితో కలిసి విజేతగా నిలిచింది. కజకిస్తాన్‌కు చెందిన జిబెక్ కులంబయెవాతో కలిసి అంకిత డబుల్స్ బరిలోకి దిగింది. శనివారం జరిగిన ఫైనల్లో అంకిత – జిబెక్ ద్వయం 6–4, 6–2 స్కోరుతో జాక్‌లిన్ కబాజ్ (స్వీడన్) – జస్టినా మికుల్‌సైట్ (లిథుయేనియా)పై విజయం సాధించింది.
అయితే సింగిల్స్ విభాగంలో అంకితకు సెమీ ఫైనల్లోనే చుక్కెదురైంది. సెమీస్‌లో కొరియాకు చెందిన యెన్ వూ కూ 7–6 (7/4), 6–3 తేడాతో అంకితను ఓడించింది. మరో సెమీస్‌లో దలిలా జకుపొవిక్ (స్లొవేకియా)ను 6–4, 2–6, 7–6 (7/0)తో ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించిన జస్టినా మికుల్‌సైట్ (లిథుయేనియా) తుది పోరులో యెన్ వూ కూతో తలపడేందుకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment