రియో నుంచి మాజీ నంబర్వన్ ఔట్ | Heena Sidhu failed in 25 miter pistol rapid firing event | Sakshi
Sakshi News home page

రియో నుంచి మాజీ నంబర్వన్ ఔట్

Published Tue, Aug 9 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

రియో నుంచి మాజీ నంబర్వన్ ఔట్

రియో నుంచి మాజీ నంబర్వన్ ఔట్

రియో డి జనీరో: భారత టాప్ షూటర్‌ హీనా సిద్ధూ విఫలమైంది. ఒలింపిక్స్‌లో భారత మహిళా షూటర్‌ హీనా సిద్ధూ మళ్లీ నిరాశపరిచింది. రియో ఒలింపిక్స్ లో భాగంగా మంగళవారం జరిగిన మహిళల 25మీటర్ల పిస్టల్‌ ర్యాపిడ్‌ విభాగంలో జరిగిన అర్హత పోటీల్లో హీనా 20వ స్థానంలో నిలిచింది. హీనాపై భారత్ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి.

మూడు రౌండ్లలో కలిపి 97, 97, 96తో మొత్తం 290 పాయింట్లు సాధించిన ప్రపంచ మాజీ నెంబర్‌ వన్‌ అయిన హీనా ఇంటిదారి పట్టింది. ఇప్పటికే రియోలో 10మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో ఫైనల్‌కు చేరుకోవడంలో హీనా విఫలమైన విషయం తెలిసిందే. ఆమె పాల్గొనే అన్ని విభాగాలు ముగియడంతో పతకం సాధించకుండానే హీనా రియో నుంచి వైదొలిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement