![Manu Bhaker win gold in Air Pistol Silver for Heena in CWG - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/8/Manu-Bhaker-CWG2018-Gold.jpg.webp?itok=nSzn_wrr)
కామన్‌వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళా షూటర్లు రాణించటంతో మరో రెండు పతకాలు భారత్ ఖాతాలోకి చేరాయి. ఆదివారం ఉదయం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్(మహిళల) పోటీల్లో హరియాణాకు చెందిన 16 ఏళ్ల మను భాకర్ స్వర్ణం సాధించింది. ఇక భారత్‌కే చెందిన మరో షూటర్ హీనా సిధూ రజత పతకం సాధించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలెనా గలియా బోవిచ్ కాంస్యంతో సరిపెట్టుకుంది. దీంతో కామెన్‌వెల్త్ గేమ్స్‌లో భారత పతకాల సంఖ్య 9కి చేరుకుంది. అందులో ఆరు స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం ఉన్నాయి. కాగా, ఈ ఉదయమే వెయిట్‌లిఫ్టర్ పూనమ్ యాదవ్ 69 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment