ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో గగన్ నారంగ్‌కు నిరాశ | Gagan Narang shooting a disappointing World Cup tournament | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో గగన్ నారంగ్‌కు నిరాశ

Published Mon, Jun 27 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 3:28 AM

ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో గగన్ నారంగ్‌కు నిరాశ

ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో గగన్ నారంగ్‌కు నిరాశ

 నాలుగు రోజుల వ్యవధిలో రెండు ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న భారత షూటర్ గగన్ నారంగ్ పతకం మాత్రం సాధించలేకపోయాడు. అజర్‌బైజాన్‌లో జరుగుతున్న ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో ఆదివారం భారత షూటర్లు గగన్ నారంగ్, హీనా సిద్ధూ నిరాశ పరిచారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఫైనల్లో గగన్ నారంగ్ 103.1 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో హీనా సిద్ధూ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement