Archery World Cup finals
-
ఆర్చరీ వరల్డ్‌కప్: రజత పతకం కైవసం చేసుకున్న దీపికా కుమారి
ట్లాక్స్కాలా (మెక్సికో): భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి ఆర్చరీ వరల్డ్‌కప్ ఫైనల్లో రజత పతకాన్ని (మహిళల రికర్వ్ ఈవెంట్) కైవసం చేసుకుంది. ఫైనల్లో దీపికా.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు చెందిన అర్చర్ లి జియామన్ చేతిలో 0-6 తేడాతో ఓటమిపాలైంది.మూడేళ్ల విరామం తర్వాత వరల్డ్ కప్ ఫైనల్స్‌కి చేరిన దీపికా అద్భుతంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఫైనల్లో దీపికా తడబాటుకు లోనైంది. ఆర్చరీ వరల్డ్‌కప్ టోర్నీలో దీపికాకు ఇది ఆరో పతకం. 2011, 2012, 2013, 2015, 2024 ఎడిషన్లలో దీపికా రజత పతకాలు సాధించింది. 2018 ఎడిషన్‌లో కాంస్యం సొంతం చేసుకుంది.చదవండి: ధీరజ్, సురేఖలకు నిరాశ -
ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీకి ఆంధ్రప్రదేశ్ ఆణిముత్యం అర్హత
ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ ప్రపంచకప్ ఫైనల్స్‌కు భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెక్సికోలో జరుగుతుంది. తుర్కియేలో గతవారం జరిగిన ప్రపంచకప్ స్టేజ్–1 టోర్నీలో జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో, మిక్స్డ్ టీమ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది. ఈ ప్రదర్శనతో సురేఖకు మరో మూడు ప్రపంచకప్‌లు మిగిలి ఉండగానే ఫైనల్స్‌కు బెర్త్ దక్కింది. ప్రపంచకప్ స్టేజ్–2 టోర్నీ కొలంబియాలో జూన్ 13 నుంచి 18 వరకు జరుగుతుంది. -
దీపికకు మళ్లీ రజతమే
ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ మెక్సికో సిటీ: సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్’లో భారత అగ్రశ్రేణి ఆర్చర్ దీపికా కుమారి మరోసారి రజతం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక 2-6తో ప్రపంచ నంబర్ వన్ చోయి మిసున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో దీపికకు రజతం లభించడం ఇది నాలుగోసారి. గతంలో ఈ జార్ఖండ్ అమ్మాయి 2011 (ఇస్తాంబుల్), 2012 (టోక్యో), 2013 (పారిస్)లలో కూడా రన్నరప్‌గా నిలిచింది. క్వార్టర్స్‌లో దీపిక 6-4తో కవనాక కవోరి (జపాన్)పై, సెమీస్‌లో 6-4తో లీ చియెన్ యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగంలో అభిషేక్ వర్మ రజతంతో భారత్ ఈ టోర్నీని రెండు రజతాలతో ముగించినట్టయ్యింది. -
చరిత్ర సృష్టించిన అభిషేక్ వర్మ
మెక్సికో సిటీ: భారత ఆర్చర్ అభిషేక్ వర్మ కొత్త చరిత్ర సృష్టించాడు. సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్’లో కాంపౌండ్ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారతీయ ఆర్చర్‌గా గుర్తింపు పొందాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ కాంపౌండ్ ఫైనల్లో అభిషేక్ వర్మ 143-145 పాయింట్ల తేడాతో దెమిర్ ఎల్మాగ్స్లి (టర్కీ) చేతిలో ఓడిపోయాడు. అంతకుముందు సెమీఫైనల్లో వర్మ 150-142తో మారియో కార్డోసో (మెక్సికో)పై, క్వార్టర్ ఫైనల్లో 148-146తో మార్టిన్ డామ్బో (డెన్మార్క్)పై విజయం సాధించాడు.