దీపికకు మళ్లీ రజతమే | Deepika Kumari bags silver in Archery World Cup Final | Sakshi
Sakshi News home page

దీపికకు మళ్లీ రజతమే

Published Tue, Oct 27 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

దీపికకు మళ్లీ రజతమే

దీపికకు మళ్లీ రజతమే

ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్
మెక్సికో సిటీ: సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్’లో భారత అగ్రశ్రేణి ఆర్చర్ దీపికా కుమారి మరోసారి రజతం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక 2-6తో ప్రపంచ నంబర్ వన్ చోయి మిసున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో దీపికకు రజతం లభించడం ఇది నాలుగోసారి. గతంలో ఈ జార్ఖండ్ అమ్మాయి 2011 (ఇస్తాంబుల్), 2012 (టోక్యో), 2013 (పారిస్)లలో కూడా రన్నరప్‌గా నిలిచింది.

క్వార్టర్స్‌లో దీపిక 6-4తో కవనాక కవోరి (జపాన్)పై, సెమీస్‌లో 6-4తో లీ చియెన్ యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగంలో అభిషేక్ వర్మ రజతంతో భారత్ ఈ టోర్నీని రెండు రజతాలతో ముగించినట్టయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement