Archer Deepika Kumari
-
Archery: ‘టాప్స్’లోకి దీపిక కుమారి
రెండేళ్ల తర్వాత భారత మహిళా స్టార్ ఆర్చర్, ‘ట్రిపుల్’ ఒలింపియన్ దీపిక కుమారికి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు కల్పించారు. ఫామ్‌లో లేకపోవడంతో 2022 జనవరిలో కేంద్ర క్రీడా శాఖ దీపికను ‘టాప్స్’ నుంచి తొలగించింది.2022 డిసెంబర్లో పాపకు జన్మనిచ్చిన దీపిక ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో ఆసియా కప్ టోర్నీలో స్వర్ణంతో దీపిక పునరాగమనం చేసింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో దీపిక రజత పతకం నెగ్గి సత్తా చాటుకుంది.ఇవి చదవండి: బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత వెలవన్ -
గురి తప్పిన దీపిక
క్వార్టర్స్‌లో పరాజయం ప్రపంచకప్ ఆర్చరీ షాంఘై (చైనా): క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ రౌండ్లో ప్రపంచ రికార్డును సమం చేసిన భార త అగ్రశ్రేణి ఆర్చర్ దీపిక కుమారి... ప్రధాన రౌండ్ లో మాత్రం నిరాశ పరిచిం ది. గురువా రం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత వి భాగంలో దీపిక పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో దీపిక 4-6తో మాజా జాగెర్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన లక్ష్మీరాణి క్వార్టర్ ఫైనల్లో 2-6తో తాన్ యా టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో... తొలి రౌండ్లో రిమిల్ 1-7తో కిమ్ చాయున్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత రౌండ్లో జయంత తాలుక్దార్ క్వార్టర్ ఫైనల్లో 4-6తో వీ చున్ హెంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. మంగళ్ సింగ్, రాహుల్ తొలి రౌండ్లో... అతాను దాస్ మూడో రౌండ్లో నిష్ర్కమించారు. పురుషుల కాం పౌండ్ విభాగంలో అభిషేక్ నాలుగో రౌండ్లో 148-149తో షోలెసర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. -
దీపికకు మళ్లీ రజతమే
ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్ మెక్సికో సిటీ: సీజన్ ముగింపు టోర్నమెంట్ ‘ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్స్’లో భారత అగ్రశ్రేణి ఆర్చర్ దీపికా కుమారి మరోసారి రజతం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక 2-6తో ప్రపంచ నంబర్ వన్ చోయి మిసున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓడింది. వరల్డ్ కప్ ఫైనల్స్‌లో దీపికకు రజతం లభించడం ఇది నాలుగోసారి. గతంలో ఈ జార్ఖండ్ అమ్మాయి 2011 (ఇస్తాంబుల్), 2012 (టోక్యో), 2013 (పారిస్)లలో కూడా రన్నరప్‌గా నిలిచింది. క్వార్టర్స్‌లో దీపిక 6-4తో కవనాక కవోరి (జపాన్)పై, సెమీస్‌లో 6-4తో లీ చియెన్ యింగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. శనివారం జరిగిన కాంపౌండ్ విభాగంలో అభిషేక్ వర్మ రజతంతో భారత్ ఈ టోర్నీని రెండు రజతాలతో ముగించినట్టయ్యింది. -
ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌కు దీపిక, అభిషేక్
కోల్‌కతా : వచ్చే నెలలో జరిగే ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌కు స్టార్ ఆర్చర్ దీపికా కుమారి, అభిషేక్ వర్మ అర్హత సాధించారు. అంటాల్యాలో జరిగిన స్టేజి-2 ప్రపంచకప్‌లో కాంస్యం సాధించిన దీపికా... ఈ ఈవెంట్లో రెం డేళ్ల అనంతరం పాల్గొననుంది. 24 ప్రపంచ ర్యాంకింగ్ పాయింట్లతో తను మహిళల రికర్వ్ ఈవెంట్‌కు అర్హత సాధించింది. మరోవైపు గతనెలలో వార్సాలో జరిగిన ప్రపంచకప్ స్టేజి 3లో విజేతగా నిలిచిన వర్మ 39 రేటింగ్ పాయింట్లతో కాంపౌండ్ విభాగంలో పోటీపడనున్నాడు. అక్టోబర్ 24, 25న మెక్సికోలో పోటీలు జరుగుతాయి.