
రెండేళ్ల తర్వాత భారత మహిళా స్టార్ ఆర్చర్, ‘ట్రిపుల్’ ఒలింపియన్ దీపిక కుమారికి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు కల్పించారు. ఫామ్‌లో లేకపోవడంతో 2022 జనవరిలో కేంద్ర క్రీడా శాఖ దీపికను ‘టాప్స్’ నుంచి తొలగించింది.
2022 డిసెంబర్‌లో పాపకు జన్మనిచ్చిన దీపిక ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో ఆసియా కప్ టోర్నీలో స్వర్ణంతో దీపిక పునరాగమనం చేసింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో దీపిక రజత పతకం నెగ్గి సత్తా చాటుకుంది.
ఇవి చదవండి: బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత వెలవన్