Olympic athletes
-
టార్గెట్ 2036.. ఒలింపిక్స్ విజేతలకు మోదీ భరోసా
-
ఒలింపిక్స్ కాంస్య పతక విజేత స్వప్నిల్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గుంటూరు: ఒలింపిక్స్ కాంస్య పతక విజేత స్వప్నిల్ కుసాల్కి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ విభాగంలో పతకం సాధించిన స్వప్నిల్‌కు అభినందనలు తెలుపుతూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.My best wishes and congratulations to Swapnil Kusale on bringing home yet another medal at the Olympics. Kudos to Swapnil on being the first Indian to win a medal in the Men’s 50m Rifle 3 Positions category. You have filled the entire nation with great pride! #2024Olympics pic.twitter.com/rN3ereS7B9— YS Jagan Mohan Reddy (@ysjagan) August 1, 2024 ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భారత్‌కు మరో పతకం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్ తరఫున స్వప్నిల్ కుసాలే కాంస్యం గెలిచాడు. దీంతో ఈ విశ్వ క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య మూడుకు చేరింది. మహారాష్ట్రకు చెందిన స్వప్నిల్ కుసాలే.. గురువారం జరిగిన ఫైనల్లో 451.4 పాయింట్లు స్కోరు చేసి.. మూడో స్థానంలో నిలిచాడు. తద్వారా కాంస్యం ఖరారు చేసుకున్నాడు.పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో భారత్‌కు తొలి పతకం అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా ఇప్పటికే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో మనూ భాకర్... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మనూ భాకర్–సరబ్జోత్ కాంస్య పతకాలు గెలిచిన విషయం తెలిసిందే. అంచనాలు లేకుండా తొలిసారి ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగిన ఈ షూటింగ్ స్టార్.. ఆద్యంతం నిలకడగా పాయింట్లు స్కోరు చేసి ఈ ఘనత సాధించాడు. -
కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌లో.. జ్యోతి సురేఖ
ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో మూడు స్వర్ణ పతకాలతో మెరిసిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ తన కెరీర్ బెస్ట్ ర్యాంక్‌ను అందుకుంది.సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సురేఖ కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో 299 పాయింట్లతో రెండో ర్యాంక్ లో నిలిచింది. గత ర్యాంకింగ్స్‌లో సురేఖ మూడో ర్యాంక్‌లో ఉంది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి 103 స్థానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల రికర్వ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ 18వ ర్యాంక్‌లో ఉన్నాడు.ఇవి చదవండి: Archery: 'టాప్స్'లోకి దీపికా కుమారి -
Archery: ‘టాప్స్’లోకి దీపిక కుమారి
రెండేళ్ల తర్వాత భారత మహిళా స్టార్ ఆర్చర్, ‘ట్రిపుల్’ ఒలింపియన్ దీపిక కుమారికి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చోటు కల్పించారు. ఫామ్‌లో లేకపోవడంతో 2022 జనవరిలో కేంద్ర క్రీడా శాఖ దీపికను ‘టాప్స్’ నుంచి తొలగించింది.2022 డిసెంబర్లో పాపకు జన్మనిచ్చిన దీపిక ఏడాదిపాటు ఆటకు దూరంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో ఆసియా కప్ టోర్నీలో స్వర్ణంతో దీపిక పునరాగమనం చేసింది. ఆదివారం ముగిసిన ప్రపంచకప్ టోర్నీలో దీపిక రజత పతకం నెగ్గి సత్తా చాటుకుంది.ఇవి చదవండి: బ్యాచ్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ విజేత వెలవన్ -
Ram Nath Kovind: దేశమంతా గర్వపడుతోంది
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులంతా అద్భుత ప్రదర్శన కనబర్చారని... వారిని చూసి దేశమంతా గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. ఇకపై ఎక్కువ మంది క్రీడల్లో పాల్గొనేలా, వారిని తల్లిదండ్రులు ప్రోత్సహించేలా మన ఆటగాళ్లంతా స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్రపతి కొనియాడారు. రాష్ట్రపతి భవన్లో శనివారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులతో ముచ్చటించారు. ఒలింపిక్స్ పతక విజేతలు నీరజ్ చోప్రా, రవి దహియా, మీరాబాయి చాను, బజరంగ్, పీవీ సింధు, లవ్లీనా బొర్గోహైన్‌ల తోపాటు కాంస్య పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టు, నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులు, ఇతర క్రీడాకారులు, కోచ్ లు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అర్జున్ ముండా, నితీశ్ ప్రామాణిక్, ఐఓఏ అధ్యక్ష, కార్యదర్శులు నరీందర్ బత్రా, రాజీవ్ మెహతా కూడా పాల్గొన్నారు. -
భారత అథ్లెట్లందరికీ తలా లక్ష రూపాయలు
రియో ఒలింపిక్ గేమ్స్‌కు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నటుడు సల్మాన్ ఖాన్ ప్రతీ భారత అథ్లెట్‌కు ప్రోత్సాహకంగా లక్షా వేయి రూపాయల చొప్పున అందిస్తానని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ‘మన ఒలింపిక్ అథ్లెట్లకు మరింత ప్రోత్సాహంగా బహుమానం ఇవ్వబోతున్నాను. క్రీడలకు కేంద్రం చాలా మద్దతు ఇస్తోంది. దీంట్లో భాగంగా మనం కూడా తోడ్పాటునందించాలి’ అని సల్మాన్ ట్వీట్ చేశాడు. -
డెబిట్ కార్డుల స్థానే ఉంగరాలు!
ఇక డెబిట్ కార్డులను మర్చిపోవాల్సిందే.. ఎందుకంటే వాటి స్థానాన్ని భర్తీ చేసే డెబిట్ రింగ్స్ వచ్చేస్తున్నాయట. ఈ ఏడాది ఆగస్టులో జరగబోయే రియో ఒలంపిక్ గేమ్స్ లో వీటిని ప్రయోగాత్మకంగా వీసా ప్రవేశపెట్టనుంది. ఇవి అచ్చం మనం వేళ్లకు పెట్టుకునే ఉంగరాల్లా ఉంటాయి. వీసా డెబిట్ కార్డుకు అనుమతి లభించే అధికారిక ఈవెంట్స్ లో ఈసారి ప్రయోగాత్మమైన రూపంలో అథ్లెట్ల ముందుకు ఈ రింగ్స్ ను తీసుకురానుంది. 45 మంది ఒలింపిక్ అథెట్లకు ప్రీ పెయిడ్ డెబిట్ రింగ్‌లను ఇవ్వనున్నట్లు వీసా పేర్కొంది. ఈ టెక్నాలజీని మొదట అథ్లెట్లకు పరిచయం చేసి, ఆ తర్వాత సాధారణ ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఈ కొత్త టెక్నాలజీని పరీక్షించడానికి వీసా గ్లోబల్ ఈవెంట్స్ ను మార్గంగా ఎంచుకుంటోంది. ఈ రింగ్‌లో సెక్యూర్డ్ మైక్రోచిప్, ఎంబెడెడ్ యాంటెనా ఉన్నాయి. పైన కనిపించేదిగా బ్లాక్ అండ్ వైట్ సిరామిక్ లూప్ ను వీసా పొందుపరిచింది. ఈ రింగ్ కు ఎలాంటి బ్యాటరీ కానీ, చార్జింగ్ కానీ అవసరం లేదు. ఈ రింగ్‌తో ప్రీపెయిడ్ మొత్తాన్నిఅథ్లెట్లు పొందుతారు. వీసా కార్డులకు బదులుగా తీసుకురాబోయే ఈ పేమెంట్ రింగ్‌పై అథ్లెట్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాలెట్లు, కార్డులు తీసుకెళ్లడం చికాకు అని, యునిఫాం మార్చుకునే ప్రతిసారి వాటిని జాగ్రత్త చేసుకోవడం కష్టంగా ఉంటోందని చెబుతున్నారు. ఈ రింగ్ అయితే.. ఎంచక్కా వేలుకు ఉంగరంలా ధరించి దాంతోనే ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. వీసా రింగ్ తనకు ఎంతో ప్రత్యేకమైనదని నాలుగుసార్లు స్విమింగ్ లో గోల్డ్ మెడల్ గెలుచుకున్న మిస్సీ ఫ్రాంక్ లిన్ చెప్పారు.