గురి తప్పిన దీపిక | Lost in the World Cup quarter-finals Archer Deepika Kumari, | Sakshi
Sakshi News home page

గురి తప్పిన దీపిక

Published Fri, Apr 29 2016 1:25 AM | Last Updated on Mon, Aug 20 2018 2:14 PM

గురి తప్పిన దీపిక - Sakshi

గురి తప్పిన దీపిక

క్వార్టర్స్‌లో పరాజయం ప్రపంచకప్ ఆర్చరీ
 
షాంఘై (చైనా): క్వాలిఫయింగ్ ర్యాంకింగ్ రౌండ్‌లో ప్రపంచ రికార్డును సమం చేసిన భార త అగ్రశ్రేణి ఆర్చర్ దీపిక కుమారి... ప్రధాన రౌండ్ లో మాత్రం నిరాశ పరిచిం ది. గురువా రం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత వి భాగంలో దీపిక పోరాటం క్వార్టర్ ఫైనల్లో ముగిసింది.  క్వార్టర్ ఫైనల్లో దీపిక 4-6తో మాజా జాగెర్ (డెన్మార్క్) చేతిలో ఓడిపోయింది. భారత్‌కే చెందిన లక్ష్మీరాణి క్వార్టర్ ఫైనల్లో 2-6తో తాన్ యా టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో... తొలి రౌండ్‌లో రిమిల్ 1-7తో కిమ్ చాయున్ (కొరియా) చేతిలో ఓడిపోయారు.

పురుషుల రికర్వ్ వ్యక్తిగత రౌండ్‌లో జయంత తాలుక్‌దార్ క్వార్టర్ ఫైనల్లో 4-6తో వీ చున్ హెంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు. మంగళ్ సింగ్, రాహుల్ తొలి రౌండ్‌లో... అతాను దాస్ మూడో రౌండ్‌లో నిష్ర్కమించారు. పురుషుల కాం పౌండ్ విభాగంలో అభిషేక్ నాలుగో రౌండ్‌లో 148-149తో షోలెసర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement