
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) తనయుడు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు, నిర్మాతగా ప్రసిద్ధి చెందారు. గురు, ధూమ్, దోస్తానా, హ్యాపీ న్యూ ఇయర్, బంటీ ఔర్ బబ్లీ వంటి చిత్రాలలో తన నటనతో గుర్తింపు పొందారు. అభిషేక్ నటనతో పాటు వ్యాపార రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. క్రీడలలోనూ చురుకుగా పాల్గొనే ఆయనకు వివిధ క్రీడా జట్లలో వాటాలు ఉన్నాయి.
ఎస్‌బీఐ నుంచి నెలకు రూ.18లక్షలు
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అభిషేక్ బచ్చన్‌కు ప్రతి నెలా రూ. 18 లక్షలు చెల్లిస్తుందని మీకు తెలుసా? అభిషేక్ బచ్చన్, విశ్వ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఆరాధ్య బచ్చన్ అనే ఒక కుమార్తె ఉంది.
రూ.280 కోట్ల నెట్‌వర్త్ ఉన్న అభిషేక్ బచ్చన్ తమ విలాసవంతమైన జుహు బంగ్లా, అమ్ము, వాట్స్ భవనాల్లోని గ్రౌండ్ ఫ్లోర్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లాభదాయకమైన లీజు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఎస్‌బీఐ ఈ స్థలాన్ని 15 సంవత్సరాల పాటు లీజుకు తీసుకుంది. ఇది బచ్చన్ కుటుంబానికి గణనీయమైన అద్దె ఆదాయాన్ని అందిస్తుంది.
రియల్ ఎస్టేట్ ఒప్పందాలను బయటపెట్టే జాప్‌కీ (Zapkey.com) అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. బచ్చన్ కుటుంబం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య 15 సంవత్సరాల లీజు ఒప్పందం కుదిరింది. అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం బ్యాంకు నుంచి నెలవారీ అద్దె రూ.18.9 లక్షలు తీసుకుంటున్నారు. ఈ అద్దె కాలానుగుణంగా పెరుగుదలకు సంబంధించిన క్లాజులు కూడా లీజులో పత్రాల్లో ఉన్నాయి. అద్దె ఐదేళ్ల తర్వాత రూ. 23.6 లక్షలకు, పదేళ్ల తర్వాత రూ. 29.5 లక్షలకు పెరుగుతుంది. నివేదికల ప్రకారం.. బచ్చన్ కుటుంబ నివాసమైన ‘జల్సా’కు సమీపంలో ఉన్న భవనంలో 3,150 చదరపు అడుగుల స్థలాన్నే ఎస్‌బీఐ లీజుకు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment