
భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి గత నెల పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. కేవలం 20 రోజుల బాలింత అయిన ఆమె విల్లుపట్టేందుకు సిద్ధమైంది. కోల్‌కతాలో రేపటి నుంచి జరిగే జాతీయ సీనియర్ ఓపెన్ ట్రయల్స్‌లో పాల్గొనేందుకు వచ్చింది.
‘ట్రిపుల్ ఒలింపియన్’ అయిన ఈ సీనియర్ ఇందులో పాల్గొనకపోతే మొత్తం ఏడాదంతా జట్టుకు దూరమవుతుంది. వచ్చే ఏడాది పారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో తనకీ ట్రయల్స్ కీలకమని ‘అమ్మ’ దీపిక చెప్పింది.