world cup finals
-
మను భాకర్‌కు విశ్రాంతి
న్యూఢిల్లీ: వచ్చే నెల భారత్‌లో జరిగే సీజన్ ముగింపు టోర్నమెంట్ ప్రపంచకప్ ఫైనల్స్‌లో మను భాకర్ పాల్గొనడం లేదు. ఆమె మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె రెండు కాంస్య పతకాలు సాధించింది. జాతీయ రైఫిల్ సంఘం (ఎన్ఆర్ఏఐ) గురువారం 23 మంది సభ్యుల భారత షూటింగ్ జట్టును ఎంపిక చేసింది. ఇందులో పారిస్‌కు వెళ్లొచ్చిన తొమ్మిది మంది షూటర్లున్నారు. అయితే మొత్తం 23 మందిలో ఒక్క రిథమ్ సాంగ్వాన్ మాత్రమే రెండు ఈవెంట్లలో పోటీపడనుంది. ఆమె మహిళల 10 మీటర్ల, 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లలో తలపడుతుంది. మిగతా వారంతా ఒక ఈవెంట్‌కే పరిమితం కానున్నారు. వచ్చే నెల 13 నుంచి 18 వరకు ఢిల్లీలోని డాక్టర్ కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్లో ప్రపంచకప్ షూటింగ్ పోటీలు జరుగనున్నాయి. రైఫిల్, పిస్టల్, షాట్‌గన్ కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు. -
9 నెలల వ్యవధిలో భారత క్రికెట్ అభిమానులకు మూడోసారి గుండెకోత
తొమ్మిది నెలల వ్యవధిలో టీమిండియా అభిమానుల గుండె మూడోసారి కోతకు గురైంది. ఇటీవలికాలంలో జరిగిన అన్ని మేజర్ ఈవెంట్ల ఫైనల్స్‌లో టీమిండియా వరుస పరాభవాలను ఎదుర్కొంది. భారత్‌కు ఓటములు ఎదురైన మూడు సందర్భాల్లో ప్రత్యర్ధి ఆస్ట్రేలియానే కావడం విశేషం. తొలుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా టీమిండియాను చిత్తు చేసింది. ఆతర్వాత గతేడాది చివర్లో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్లో, తాజాగా అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్స్‌లో భారత క్రికెట్ జట్టు ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. సీనియర్ల బాటలోనే జూనియర్లు.. భారత క్రికెట్ జట్టును వరల్డ్‌కప్ ఫైనల్ ఫోబియా వదలట్లేదు. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో భారత సీనియర్లు ఇదే ఆసీస్ చేతిలో ఘోర పరాభవాన్ని ఎదుర్కోగా.. తాజాగా జూనియర్లు సీనియర్ల బాటలోనే నడుస్తూ అండర్ 19 వరల్డ్‌కప్ ఫైనల్లో కుర్ర ఆసీస్ జట్టు చేతిలో ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎడిషన్‌లో ఫైనల్ వరకు అజేయ జట్టుగా నిలిచిన భారత్ సీనియన్ టీమిండియాలాగే తుది సమరంలో బొక్కబోర్లా పడి భారత క్రికెట్ అభిమానులకు గుండెకోత మిగిల్చింది. ఇదిలా ఉంటే, అండర్ 19 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో కుర్ర ఆస్ట్రేలియా జట్టు యంగ్ ఇండియాను 79 పరుగుల తేడాతో ఓడించింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన యంగ్ ఇండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలి వంద కోట్లకు పైగా ఉన్న భారతీయులకు గుండెకోతను మిగిల్చింది. -
ICC World Cup 2023: ఒక రోజు హోటల్ అద్దె లక్షన్నర
అహ్మదాబాద్ పంట పండింది. ఆదివారం జరగనున్న ఇండియా– ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ వన్డే క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా ఆ నగరంలోని నరేంద్ర మోడీ స్టేడియం జాతీయ, అంతర్జాతీయ విమానాలు అభిమానులతో దిగనున్నాయి. మరి హోటల్ రూమ్‌లు? టికెట్లు? ఏవీ దొరకట్లేదు. రేట్లు చూస్తే గుండె గుభేల్స్. ప్రతి విశేషమూ వైరలే. ‘ఆల్ రోడ్స్ లీడ్ టు అహ్మదాబాద్’. క్రికెట్ జ్వరం, క్రికెట్ జలుబు, క్రికెట్ దగ్గు, క్రికెట్ కలవరింతలు, క్రికెట్ స్లీప్ వాక్... ఇవన్నీ ఉన్నవారు లేనివారు కూడా అహ్మదాబాద్‌కు చలో అంటున్నారు. అక్కడ లక్ష మంది పట్టే స్టేడియంలో వరల్డ్ కప్ ఫైనల్స్. ఇండియా వెర్సస్ ఆస్ట్రేలియా. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. మనవాళ్లు ఫైనల్స్. ఇది నేరుగా చూడ దగ్గ మేచ్యే గాని... టీవీలలో చూడ మ్యాచ్ కాదే... కాదు కాకూడదు అనుకుంటే మరి అహ్మదాబాద్ వెళ్లుట ఎటుల? వెళ్లెను పో అక్కడ ఆశ్రయం పొందుట ఎటుల? పొందెను పో టికెట్ సాధించుట ఎటుల?.. అన్నట్టుగా అందరూ సతమతమవుతున్నారు. అందరి దగ్గరా డబ్బులు ఉన్నాయి. కాని ఫ్లయిట్ టికెట్లు లేవు. ఒకప్పుడు ఢిల్లీ అహ్మదాబాద్ ఫ్లయిట్ టికెట్ మహా అయితే 4000. ఇప్పుడు 2500. అహ్మదాబాద్‌లో అత్యంత ఖరీదైన హోటల్లో రూమ్ అరవై వేలు దాకా ఉంటుంది. కాని ఇప్పుడు మామూలు హోటల్లో కూడా లక్షన్నర అడుగుతున్నారు. ఇస్తామన్నా దొరకడం లేదు. స్టేడియంలో అడుగు పెట్టడానికి 2000 టికెట్ 34 వేలకు అమ్ముతున్నారు. 2500 టికెట్ 42 వేలు. పదివేల టికెట్ అయితే లక్షా అరవై రెండు వేలు. మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా అభిమానులు నేరుగా అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతుండటం వల్ల అక్కడ స్ట్రీట్ ఫుడ్డు, రెస్టరెంట్ బిజినెస్, క్యాబ్‌ల వాళ్లు ఆటోల వాళ్లు అందరూ రాత్రికి రాత్రి కుబేరులు అయ్యేలా ఉన్నారు. గుడ్. నగరాలకు ఇలాంటి జ్ఞాపకాలు ఉండాలి. 100 కోట్ల జాతకం ఎలా ఉందో! చూడండి తమాషా. ‘ఆస్ట్రోటాక్’ యాప్ ప్రవేశపెట్టి, దేశ విదేశాలలో ఉన్న భారతీయులు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నట్టుగా జ్యోతిష్యుణ్ణి బుక్ చేసుకునేలా చేసి కోట్లు గడించిన ఆ యాప్ ఫౌండర్ పునీత్ గుప్తాకు ఫైనల్స్ జాతకం ఏమిటో కచ్చితంగా తెలియదు. ‘రేపు ఇండియాదే గెలుపు. మా ఆస్ట్రోటాక్ జోస్యం నిజం అవుతుంది చూడండి’ అనట్లేదు అతడు. ‘ఇండియా కనుక కప్పు గెలిస్తే మా యాప్ యూజ్ చేసేవారికి 100 కోట్లు పంచుతా’ అంటున్నాడు. 2011లో ఇండియా వరల్డ్ కప్‌లో గెలిచినప్పుడు తాను కాలేజీ చదువులు చదువుతున్నానని, ఇప్పుడు సంపాదించాను కనుక ఆ సంతోషాన్ని 100 కోట్లు పంచి పంచుకుంటానని అంటున్నాడు. ఏమో మన జాతకం ఎలా ఉందోనని ఆస్ట్రోటాక్ యూజర్లు ఆశగా చూస్తున్నారు. ఇతగాడు ఇలాంటి వాగ్దానాలు చేస్తుంటే మనవాళ్లు కప్పు కొడితే ఫలానా బీచ్‌లో బట్టలు విప్పుతానని ఒక హీరోయిన్ హల్చల్ చేసింది. ఇక మొక్కులు, పొట్టేళ్లు ఎంతమంది అనుకున్నారో తెలియదు. కమాన్ ఇండియా! జాతకం తిరగరాయి. -
World Cup 2023: లక్కీ పోజులు సరదా సెంటిమెంట్లు
అమితాబ్ ఇరకాటంలో పడ్డారు. ‘నేను చూడకపోతే ఇండియా గెలుస్తుంది’ అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనను మొహమాట పెడుతోంది. ‘ఆస్ట్రేలియాతో ఇండియా ఫైనల్స్ చూడకండి సార్’ అని అందరూ ఆయనతో మొరపెట్టుకుంటున్నారు. న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో మనం గెలవాలని ఒక అభిమాని 240 అగరుబత్తులు వెలిగించాడు. క్రికెట్ అంటే ఒక పిచ్చి. వెర్రి. అభిమానులకే కాదు ఆటగాళ్లకు బోలెడన్ని సెంటిమెంట్లు. రేపు ఫైనల్స్. ప్రతి ఫ్యామిలీ ఇందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్లు, సరదా విశ్వాసాల స్పెల్ చూద్దామా.. ‘జులాయి’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ కోసం పబ్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌కు అక్కడ ఒంగి నీలుక్కుపోయి నిలబడి ఉన్న సప్తగిరి కనపడతాడు. ‘వీడేంటి ఇలా?’ అని అడుగుతాడు అల్లు అర్జున్ తన ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్‌ని. ‘వీడా... ఇందాక వీడు ఇలా నిలుచున్నప్పుడు ధోని ఫోర్ కొట్టాడు. సెంటిమెంట్‌గా బాగుంటుందని అలా ఉంచేశాం’ అంటాడు ప్రదీప్. మనవాళ్ల సెంటిమెంట్స్ ఇలా ఉంటాయి. 1970ల నుంచి క్రికెట్‌ను విపరీతంగా ఫాలో అవుతూ స్టేడియంలకు వెళ్లి మరీ మ్యాచ్‌లు చూసిన ఒక తెలుగు అభిమాని తన సెంటిమెంట్లు ఇలా చెప్పుకొచ్చారు– ‘మా నాన్న క్రికెట్ చూసేటప్పుడు మా అమ్మను పక్కన కూచోబెట్టుకొని ఇవాళ నీకు వంట లేదు అనేవారు. ఆయనకు అదొక సెంటిమెంట్ అమ్మ పక్కనుంటే గెలుస్తుందని. నేను ఆ తర్వాత మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు మధ్యలో మా అమ్మ వచ్చి పలకరిస్తే మనం ఓడిపోతామని సెంటిమెంట్ పడింది. అందుకని మ్యాచ్ ఉన్న రోజు మా అమ్మకు ఉదయాన్నే చెప్పేసేవాణ్ణి ఇవాళ పలకరించవద్దని. పెద్దవాళ్లు కదా. ఊరికే ఉండరు. ఒక్కోసారి మర్చిపోయి వచ్చి పలకరిస్తుంది. ఇంకేముంది... మ్యాచ్ హరీ’... ఎనభైల్లో ఊరూ వాడా క్రికెట్ ఫీవర్ మొదలయ్యింది. హైస్కూళ్లకు వ్యాపించింది. 1990లు దాటాక బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇళ్ల కప్పుల మీదకు యాంటెన్నాలు లైవ్ టెలికాస్ట్‌లు మొదలయ్యాయి. ఒక నెల్లూరు వాసి ఇలా చెప్పాడు– ‘మా ఫ్రెండ్స్‌లో నలుగురైదుగురి ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాని ఎందుకనో విజయ్‌గారి ఇంట్లో చూస్తేనే ఇండియా గెలుస్తుందనే నమ్మకం ఏర్పడింది. దాంతో ఇండియా మేచ్ ఉన్న ప్రతిసారీ వాడింట్లో చేరి కిష్కిందకాండ చేసేవాళ్లం. ఇదేం గోలరా... ఇంకెక్కడా టీవీలు లేవా అని వాళ్లమ్మ మొత్తుకునేది. అదో సరదా’... అయితే ప్రతి గ్రూప్‌లో మచ్చనాలుకోడు ఒకడు ఉంటాడు. వాడు ‘ఫలానా వాళ్లు పోతారు’ అంటే గ్యారంటీగా పోతారు. వాడు తక్కిన రోజుల్లో ఎంత ప్రేమాస్పదమైన ఫ్రెండ్ అయినా క్రికెట్ వచ్చే రోజుల్లో అందరికీ కంటగింపు అవుతాడు. ‘మా ఫ్రెండ్ శేషుగాడు ఇలాగే ఉండేవాడు. మేమందరం ఉదయాన్నే లైవ్ చూడ్డానికి ఎగ్జయిట్ అవుతుంటే ఇండియా ఢమాల్ అనేవాడు. ఇండియా అలాగే పోయేది. అందుకని మ్యాచ్‌లు జరిగే కాలంలో వాడు కనిపిస్తే రాళ్లెత్తి కొట్టి మరీ తరిమేసేవాళ్లం’ అంటాడొక అభిమాని నవ్వుతూ. అభిమానులు మందుబాబులైతే వాళ్ల సెంటిమెంట్లకు కూడా లెక్కే లేదు. ‘మనకు అలవాటైన బార్లో మిగిలిన రోజుల్లో ఎక్కడైనా సరే కూచుంటాం. కాని ఇండియా మ్యాచ్ ఉన్న రోజు మాత్రం నాకొక పర్టిక్యులర్ సీట్లో కూచుని చూస్తే గెలుస్తామని సెంటిమెంట్. అక్కడే కూచునేవాణ్ణి. బార్వాళ్లు కూడా నా సీట్ నాకే అట్టి పెట్టేవాళ్లు. అంతేనా? గ్లాస్లో మందైపోతే వికెట్ పడిపోతుందని ఒక సెంటిమెంట్. అందుకే మందైపోయేలోపు ఒక పెగ్ రెడీగా పెట్టుకునేవాణ్ణి’ అని తెలియచేశాడు ఆ క్రికెట్ నిషా అభిమాని. అదేముంది... ఆటగాళ్లకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. టెస్ట్ మేచ్‌ల రోజుల్లో బాగా బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా ఆ ప్లేయర్లు ఆ డ్రస్సుల్ని వాష్ చేయకుండా మేచ్ అయ్యేంతవరకూ అవే డ్రస్సుల్ని వేసుకునేవారు. ‘నిన్న రాత్రి ఫలానా సినిమా చూసి నిద్రపోయి ఉదయం బ్రహ్మాండంగా ఆడాను. అందుకే మళ్లీ అదే సినిమా చూసి ఆడతాను అనుకునే వరకు క్రికెటర్ల సెంటిమెంట్లు ఉంటాయి’ అని ఒక క్రికెటర్ తెలిపాడు. ‘పూజ చేసి సాంబ్రాణి కడ్డీలు గుచ్చి రెండు రోజులుగా ఉంచిన అరటి పండును బౌలర్ శ్రీశాంత్ వికెట్లు పడతాయన్న నమ్మకంతో తినడం చూశానని’ ఆ క్రికెటర్ చెప్పాడు. సునీల్ గవాస్కర్‌కు గురువారం గండం ఉండేది. 1980లో రెండు వరస గురువారాల్లో ఇద్దరు అనామక బౌలర్లకు వికెట్స్ ఇచ్చి సున్నాకు ఔట్ అయ్యాడతడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌కు చేతిలో ఉన్న బ్యాట్‌ను గిర్రున తిప్పితే బాగా కొడతాననే నమ్మకం ఉండేది. అతని మ్యాచులు చూస్తే బ్యాట్ హ్యాండిల్‌ని తిప్పడం కనిపిస్తుంది. మొహిందర్ అమర్నాథ్ ఎర్ర కర్చీఫ్‌ను జేబులో పెట్టుకుని ఉండేవాడు. సచిన్‌కు ముందు ఎడమ కాలు ప్యాడ్ కట్టుకుంటే కలిసొస్తుందని నమ్మకం. జహీర్ ఖాన్ పసుపు రంగు చేతిగుడ్డను జేబులో పెట్టుకునేవాడు. బౌలర్ అశ్విన్ అయితే ఒకే బ్యాగ్‌ను అన్ని మ్యాచ్‌లకు తెచ్చేవాడు. అది అతని లక్కీ బ్యాగ్. ఇక అజారుద్దీన్ తావీజ్ లేకుండా మ్యాచ్ ఆడడు. 1987 వరల్డ్ కప్‌లో జింబాబ్వే మీద కపిల్ దేవ్ బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఇండియన్ ఆటగాళ్లు ఆశలు వదలుకుని డ్రస్సింగ్ రూమ్ బయటకు వచ్చి నిలబడ్డారు. కపిల్ దేవ్ బాదడం మొదలు పెట్టాడు. అంతే టీమ్ మేనేజర్ మాన్ సింగ్ ఎక్కడి వాళ్లను అక్కడే నిలబడమన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ను పాస్‌కు వెళ్లడానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా చాలా సెంటిమెంట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమితాబ్‌కు తాను మేచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుంది అనే సెంటిమెంట్ ఉంది. మరోవైపు ఫైనల్స్‌కు ఆహ్వానం ఉంది. వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్నాడు. మరోవైపు అభిమానులు కూడా రకరకాల సెంటిమెంట్లు చెప్పుకుంటున్నారు. 2011 నుంచి వరల్డ్ కప్ పోటీల్లో హోస్ట్ కంట్రీలే గెలిచాయి కాబట్టి ఈసారి హోస్ట్ కంట్రీ ఇండియా గెలుస్తుందని ఒక సెంటిమెంట్. మరోవైపు 2019 వరల్డ్ కప్ సమయంలో చంద్రయాన్–2 ఫెయిల్ అయ్యింది. ఇండియా కప్ కోల్పోయింది. 2023లో చంద్రయాన్ –3 సక్సెస్ అయ్యింది. అంటే మనం వరల్డ్ కప్ గెలుస్తామని ఒక సెంటిమెంట్. కాని ఆట ఎప్పుడూ టీమ్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది... సెంటిమెంట్స్ మీద కాదు. కాకుంటే కొంచెం అదృష్టం కలిసి రావాలంతే. ఆ అదృష్టం కోసం అభిమానుల ఆకాంక్షే సెంటిమెంట్ల రూపంలో బయటకు వస్తుంది. ఈసారి భారత్ గెలవాలని... అందుకు అందరి సెంటిమెంట్లు పని చేయాలని కోరుకుందాం. -
‘ఆ రికార్డు’ కూడా కోహ్లికి సాధ్యమే.. మరో 10 ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు చేస్తాడు..!
అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డునూ బద్దలుకొట్టే సత్తా భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లికి ఉందని భారత దిగ్గజం, మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ప్రస్తుతం విరాట్ 50వ శతకంతో వన్డేల్లో సచిన్ (49) సెంచరీల రికార్డును చెరిపేశాడు. ఓవరాల్‌గా చూస్తే టెస్టుల్లో 29, టి20ల్లో ఒక సెంచరీ కలుపుకుంటే 80 సెంచరీలతో ఉన్నాడు. విరాట్ 50వ వన్డే సెంచరీ పూర్తి చేసిన అనంతరం శాస్త్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘సచిన్ వంద సెంచరీలు చేసినపుడు ఇంతటి గొప్ప మైలురాయి దరిదాపుల్లోనే ఎవరూ రారని అనుకున్నాం. ఇప్పుడు కోహ్లి 80 దాకా వచ్చాడు. విరాట్‌లాంటి బ్యాటర్‌కు ఏదీ అసాధ్యం కాదు. శతక్కొట్టడం మొదలు పెడితే కొడుతూనే ఉంటారు. చూడండి అతని తదుపరి 10 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు గ్యారంటీ! పైగా తను మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు. ప్రతి ఫార్మాట్లోనూ అదే నిబద్ధత, అంకితభావాన్ని కనబరుస్తున్నాడు. అతని కెరీర్లో ఇంకా మూణ్నాలుగేళ్ల ఆట మిగిలుంది. ఒత్తిడిని అధిగమించే సామర్థ్యం, పరిస్థితులకు అలవాటు పడే నైజం, అంతకుమించి పూర్తి ఫిట్నెస్ అతన్ని అసాధారణ క్రికెటర్‌గా నిలబెడుతోంది’ అని అన్నారు. జట్టుకు తనెంత కీలకమో కోహ్లికి బాగా తెలుసు: బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ భారత జట్టులో తన పాత్ర ఎంత కీలకమో... తన భుజాలపై ఎంతటి గురుతర బాధ్యతలున్నాయో కోహ్లికి బాగా తెలుసని కోచ్‌లెవరూ అతనికి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వివరించారు. ‘విరాట్ సన్నాహాలకు సాయమందిస్తాం. అంతేతప్ప కోచింగ్ పాఠాలు చెప్పాల్సిన పనేం రాదు. అతనికేమైనా కావాలంటే తనే వచ్చి అడుగుతాడు. ప్రాక్టీస్ అయినా... ఆటయినా అతనికే వదిలేస్తాం. ఎప్పుడు ఎలా ఆడాలో కోహ్లికే బాగా తెలుసు. నిజం చెప్పాలంటే ఎన్ని సెంచరీలు చేసినా, ఎన్ని మైలురాళ్లు దాటినా అతని పరుగుల ఆకలి తీరనే తీరదు. బౌలర్లలో షమీ పేస్ అద్భుతం. అందుకే అతను స్పెషల్ బౌలర్. అయినప్పటికీ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు పక్కనబెట్టడానికి కారణం జట్టు కాంబినేషనే తప్ప అతని సమర్థతపై ఏ సంకోచం లేదు’ అని అన్నారు. ఇదిలా ఉంటే, భారత్-ఆస్ట్రేలియా జట్లు రెండో సారి వరల్డ్‌కప్ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్న విషయం తెలిసిందే. 20 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు వరల్డ్‌కప్ ఫైనల్లో మరోసారి తలపడనున్నాయి. నాటి ఫైనల్లో ఆసీస్.. టీమిండియాపై విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. మరి ఈ సారి ఏమవుతుందో తేలాలంటే నవంబర్ 19 రాత్రి వరకు వేచి చూడాలి. -
CWC 2023: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఫైనల్.. అరుదైన రికార్డు
వన్డే వరల్డ్‌కప్ 2023 ఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న భారత్, ఆస్ట్రేలియా మధ్య తుది సమరం జరుగనుంది. నిన్న (నవంబర్ 16) సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. అంతకుముందు భారత్.. న్యూజిలాండ్‌ను 70 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌కు చేరింది. కాగా, వన్డే ప్రపంచకప్ చరిత్రలో అవే జట్ల మధ్య ఫైనల్ జరగడం ఇది నాలుగో సారి. 1996, 2007 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆ్రస్టేలియా–శ్రీలంక జట్ల మధ్య తుది పోరు జరగ్గా.. ఆస్ట్రేలియా–భారత్ జట్ల మధ్య 2003లో తొలిసారి టైటిల్ పోరు జరిగింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ రెండు జట్లు టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇదిలా ఉంటే, కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో గెలవడం ద్వారా ఆస్ట్రేలియా ఎనిమిదో సారి వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరింది. ఈ జట్టు 1975 (రన్నరప్), 1987 (విజేత), 1996 (రన్నరప్), 2003 (విజేత), 1999 (విజేత), 2007 (విజేత), 2015 (విజేత)లలో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఇందులో ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచి, రెండుసార్లు రన్నరప్ తో సంతృప్తి పడింది. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఈ జట్టు ఐదోసారి సెమీస్ గండాన్ని గట్టెక్కలేకపోయింది. సఫారీలు తొలిసారి 1992 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోగా... 1999, 2007, 2023 ఎడిషన్లలో ఆ్రస్టేలియా చేతిలో, 2015లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలయ్యారు. -
152/0 VS 170/0: మీకు మాకు ఇదే తేడా.. పాక్ ప్రధానికి ఇర్ఫాన్ పఠాన్ స్ట్రాంగ్ కౌంటర్
టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా దారుణ పరాభవం నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన వివాదాస్పద ట్వీట్‌పై (152/0 VS 170/0) తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ఫైనల్‌కు చేరామన్న మదంతో కొట్టుకుంటున్న పాక్ ప్రధానికి.. ఇర్ఫాన్ పఠాన్ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. పాక్ ప్రధాని మరోసారి వంకర బుద్ధి చాటుకున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. So, this Sunday, it’s: 152/0 vs 170/0 🇵🇰 🇬🇧 #T20WorldCup — Shehbaz Sharif (@CMShehbaz) November 10, 2022 మీకు మాకు ఇదే తేడా.. మేము గెలిచినా, ప్రత్యర్ధి గెలిచినా మేము సంతోషిస్తాం, కానీ మీరు ఇతరుల ఓటమితో రాక్షసానందం పొందుతున్నారు.. ఇకనైనా ఇలాంటి పరువు పోగొట్టుకునే పనులు మానుకుని, సొంత దేశంలో సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ ఓ రేంజ్లో చురలకలంటిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. పాక్ ప్రధానికి భారత్ అభిమానులు ఇచ్చిన కౌంటర్లతో పోలిస్తే, ఇర్ఫాన్ ఇచ్చిన ఈ కౌంటర్ మరింత స్ట్రాంగ్‌గా ఉంది. Aap mein or hum mein fark yehi hai. Hum apni khushi se khush or aap dusre ke taklif se. Is liye khud ke mulk ko behtar karne pe dhyan nahi hai. — Irfan Pathan (@IrfanPathan) November 12, 2022 దీంతో ఇర్ఫాన్ చేసిన కౌంటర్ అటాక్‌పై భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచిగా బుద్ధి చెప్పావంటూ ఇర్ఫాన్‌ను మెచ్చుకుంటున్నారు. వంకర బుద్ధి గల వ్యక్తులు నిజంగానే ఇతరుల బాధను ఎగతాలి చేస్తూ రాక్షసానందం పొందుతారంటూ ఇర్ఫాన్ కౌంటర్ ట్వీట్‌కు మద్దతు పలుకుతున్నారు. పాక్ ప్రధానిని ఇన్ స్వింగింగ్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేసి భలే బుద్ధి చెప్పావంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, టీ20 వరల్డ్‌కప్-2022 సెమీఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో, టీ20 వరల్డ్‌కప్-2021 గ్రూప్ దశలో పాకిస్తాన్ చేతిలో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ప్రత్యర్ధులు చేసిన స్కోర్లను (152/0 VS 170/0) ప్రస్తావిస్తూ.. ఈ ఆదివారం 152/0 VS 170/0 అంటూ పాక్ ప్రధాని తన స్థాయి దిగజార్చుకునే ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై భారత అభిమానులు, మాజీలు తగు రీతిలో ఇప్పటికీ కౌంటర్లిస్తూనే ఉన్నారు. ఏదో అదృష్టం కలిసొచ్చి ఫైనల్ దాకా చేరిన మీకు ఇంత పొగరు పనికిరాదంటూ చురకలంటిస్తున్నారు. చదవండి: టీమిండియా ఓటమిపై పాక్ ప్రధాని ట్వీట్ వైరల్.. కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్ -
దీపిక ఖాతాలో కాంస్య పతకం
సామ్సన్ (టర్కీ): ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత్ తమ పోరాటాన్ని కాంస్య పతకంతో ముగించింది. చివరిరోజు ఆదివారం జరిగిన మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ దీపిక కుమారి కాంస్య పతకాన్ని సాధించింది. లీసా ఉన్రూ (జర్మనీ)తో మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో దీపిక ‘షూట్ ఆఫ్’లో విజయం సొంతం చేసుకుంది. నిర్ణీత ఐదు సెట్ల తర్వాత ఇద్దరూ 5–5తో సమంగా నిలిచారు. విజేతను నిర్ణయించడానికి ఇద్దరికీ ఒక్కో షాట్ అవకాశం ఇచ్చారు. ఇద్దరూ బాణాన్ని 9 పాయింట్ల వృత్తంలోనే కొట్టారు. అయితే లీసా సంధించిన బాణంకంటే దీపిక బాణం 10 పాయింట్ల వృత్తానికి అతి సమీపంలో ఉండటంతో భారత ఆర్చర్‌కు పతకం ఖాయమైంది. ఒక్కో సెట్లో ఇద్దరికీ మూడు షాట్ల చొప్పున అవకాశం ఇస్తారు. సెట్ గెలిస్తే రెండు పాయింట్లు ఇస్తారు. స్కోరు సమమైతే ఒక్కో పాయింట్ లభిస్తుంది. తొలి సెట్‌ను దీపిక 28–25తో సొంతం చేసుకోగా... రెండో సెట్‌ను లీసా 25–22తో గెల్చుకుంది. మూడో సెట్‌ను దీపిక 30–28తో కైవసం చేసుకోగా... నాలుగో సెట్ 28–28తో సమంగా ముగిసింది. ఐదో సెట్‌ను లీసా 29– 28తో నెగ్గడంతో ఇద్దరి స్కోర్లు 5–5తో సమమయ్యాయి. అంతకుముందు క్వార్టర్ ఫైనల్లో దీపిక 6–4తో లీ చియెన్ యింగ్ (చైనీస్ తైపీ)పై గెలుపొంది... సెమీస్‌లో 3–7తో యాస్మీన్ అనాగోజ్ (టర్కీ) చేతిలో ఓడిపోయింది. స్వర్ణ పతక మ్యాచ్‌లో లీ యున్ గ్యాయోంగ్ (దక్షిణ కొరియా) 6–4తో యాస్మీన్‌పై గెలిచింది. ప్రపంచకప్ ఫైనల్స్ టోర్నీలో దీపిక నెగ్గిన పతకాలు. 2011, 2012, 2013, 2015లలో ఆమె రజత పతకాలు గెలిచింది. -
చరిత్ర సృష్టించిన మహిళా షూటర్ హీనా సిద్ధూ
ముంబై: భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచ కప్ ఫైనల్స్ టోర్నమెంట్లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ పిస్టల్ షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. జర్మనీలోని మ్యూనిచ్‌లో జరుగుతున్న ఈ సీజన్ ముగింపు టోర్నమెంట్లో హీనా సిద్ధూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. గతంలో భారత్ నుంచి అంజలి భగవత్ (2002లో), గగన్ నారంగ్ (2008లో) రైఫిల్ ఈవెంట్లో ఈ ఘనత సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-10 షూటర్లు మాత్రమే పాల్గొనే ఈ టోర్నీలో హీనా విశేషంగా రాణించింది. స్వర్ణ పతకాన్ని నెగ్గే క్రమంలో ఈ పంజాబ్ అమ్మాయి ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ గువో వెన్జున్ (చైనా)... ప్రపంచ చాంపియన్ అరునోవిచ్ జొరానా (సెర్బియా)... రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ఒలెనా కొస్టెవిచ్ (ఉక్రెయిన్)లను ఓడించింది. క్వాలిఫయింగ్‌లో -
మళ్లీ రజతమే
పారిస్: కీలకదశలో ఒత్తిడికిలోనైన భారత స్టార్ ఆర్చర్ దీపిక కుమారి ప్రపంచ కప్ ఫైనల్స్‌లో మూడోసారీ రజతంతో సంతృప్తి పడింది. 2010, 2011లలో రన్నరప్‌గా నిలిచిన ఈ జార్ఖండ్ అమ్మాయి ఈసారీ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఆదివారం జరిగిన ఈ మెగా ఈవెంట్ మహిళల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో దీపిక 4-6 సెట్ పాయింట్లతో (30-27, 28-28, 19-29, 27-28, 29-29) యున్ ఓక్ హీ (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో దీపిక 7-1తో ఐదా రొమాన్ (మెక్సికో)పై గెలుపొందగా... ‘షూట్అవుట్’ ద్వారా తేలిన సెమీఫైనల్లో దీపిక 6-5తో లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత అలెజాంద్రా వాలెన్సియా (మెక్సికో)ను ఓడించింది.