చరిత్ర సృష్టించిన సందీప్ | Sandeep eyes bronze medal at World Wrestling Championship as others crash out | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సందీప్

Published Mon, Sep 23 2013 1:33 AM | Last Updated on Fri, Sep 1 2017 10:57 PM

Sandeep eyes bronze medal at World Wrestling Championship as others crash out

బుడాపెస్ట్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకంతో మొదలుపెట్టిన భారత్ పతకంతోనే ముగించింది. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో చివరిరోజు భారత్‌కు కాంస్య పతకం లభించింది. పురుషుల గ్రీకో రోమన్ 66 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సందీప్ తులసీ యాదవ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల చరిత్రలో గ్రీకో రోమన్ స్టయిల్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా సందీప్ చరిత్ర సృష్టించాడు. ‘రెప్‌చేజ్’ కాంస్య పతక పోరులో సందీప్ 4-0తో అలెగ్జాండర్ మక్సిమోవిచ్ (సెర్బియా)ను ఓడించాడు.
 
 అంతకుముందు ‘రెప్‌చేజ్’ రెండో రౌండ్‌లో సందీప్ 6-4తో షారూర్ వర్దాన్‌యాన్ (స్వీడన్)పై నెగ్గి కాంస్య పతక బౌట్‌కు అర్హత పొందాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన సందీప్ రెండో రౌండ్‌లో 5-0తో శాంచెజ్ (స్పెయిన్)పై, రెండో రౌండ్‌లో 6-2తో మిహైల్ కాస్నిక్‌యెను (మాల్దొవా)పై గెలిచాడు. క్వార్టర్ ఫైనల్లో సందీప్ 0-10తో హాన్ సు రియు (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయా డు. హాన్ సు రియు ఫైనల్‌కు చేరడంతో సందీప్‌కు ‘రెప్‌చేజ్’లో పోటీపడే అవకాశం లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement