Apple Wonderlust Event iOS 17 టెక్ దిగ్గజం ‘వండర్ లస్ట్’ పేరుతో యాపిల్ నిర్వహించనున్న మెగా ఈవెంట్‌లో ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయనుంది. యాపిల్ కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ పార్క్‌లో సెప్టెంబర్ 12న జరగనున్న 'వండర్‌లస్ట్' ఈవెంట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రేపు(సెప్టెంబరు 12, మంగళవారం) 15 సిరీస్‌తోపాటు, ఐప్యాడ్‌లు, కొత్త వాచ్ సిరీస్‌ను అభిమానుల కోసం లాంచ్ చేయనుంది. దీంతోపాటు ఈ ఈవెంట్‌లో కార్యక్రమంలో ఐవోఎస్ 17ను యాపిల్ ఆవిష్కరించనుంది. ముఖ్యంగా భారత యూజర్ల కోసం ఐవోఎస్ (ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్) 17లో ప్రత్యేక ఫీచర్లను, watchOS 10 లాంచింగ్ తేదీలను అందించనుందని తెలుస్తోంది. దీంతోపాటు యాపిల్ ఐఫోన్ 15 లైనప్‌ను USB-C పోర్ట్‌లతో అందించనుండటం మరో విశేషం కానుంది.
ఐవోఎస్17లో ఇండియన్ ఫీచర్లు
ఐఫోన్లలో ప్రధానంగా మూడు కొత్త ఫీచర్లను భారతీయ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. స్మార్ట్‌ఫోన్‌లలో డ్యూయల్ సిమ్ కార్డ్‌లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో డబుల్ సిమ్.ఐవోఎస్ 17 ప్రైమరీ, సెకండరీ సిమ్ ప్రతీ సిమ్ కు మెస్సేజ్ కు సంబంధించి వేర్వేరు రింగ్ టోన్ పెట్టుకోవచ్చు.మిస్డ్ కాల్ కనిపిస్తే , ఆ నంబర్ కాంటాక్ట్ లిస్ట్ లో సేవ్ చేయకపోయినా నేరుగా కాల్ బ్యాక్ చేసుకోవచ్చు.
బైలింగ్విల్ సిరి అసిస్టెంట్ ద్వారా ఒకటికి మించిన భాషలను టింగ్లీష్, హింగ్లీషు లాగా.. ఇంగ్లిష్, హిందీ కలిపి.. లేదంటే ఆంగ్లంతో తెలుగు, పంజాబీ, కన్నడ, మరాఠి భాషలను కలిపి మాట్లాడొచ్చు. అలాగే కీబోర్డ్‌లోనే బిల్టిన్ ట్రాన్సలేషన్ సపోర్టుతో తమిళం, తెలుగు, కన్నడ మలయాళంతో సహా 10 భారతీయ భాషల్లోకి అనువాదానికి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా, పంజాబీ డిక్షనరీకి iOS 17 బీటా సపోర్ట్ ఉంటుందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. సిరీ ప్లీజ్ సెట్ అలారమ్ మ్యూజిక్ ప్లే లాంటి ఆదేశాలను తెలుగులోనే ఇవ్వొచ్చు.
IOS 17 ఎప్పుడు విడుదలవుతుంది?
గత సంవత్సరం, Apple iPhone 14 ఈవెంట్ తర్వాత ఐదు రోజుల తర్వాత iOS 16 ను విడుదల చేసింది. ఈ సంవత్సరం, iOS 17 బీటా 8 , పబ్లిక్ బీటా 6 ఇప్పటికే ముగిసింది, కాబట్టి Apple అదే షెడ్యూల్‌ను అనుసరించవచ్చు. iOS 17ని ముందుగానే ప్రయత్నించాలనుకుంటే, బీటాలను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కానీ ఫైనల్ పబ్లిక్ రిలీజ్ కోసం మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment