యూపీ: యోగి ఐ సర్కార్‌.. | Yogi Adityanath wants Mantris To Up Their Tech Game With IPads | Sakshi
Sakshi News home page

యోగి ఐ సర్కార్‌..

Published Thu, Feb 13 2020 9:29 AM | Last Updated on Thu, Feb 13 2020 11:02 AM

Yogi Adityanath wants Mantris To Up Their Tech Game With IPads - Sakshi

లక్నో : అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి, సంక్షేమాన్ని కొత్తపుంతలు తొక్కించాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ నిర్ణయించారు. పాలనాపగ్గాలు చేపట్టిన తొలినాళ్లలో పోలీసుల దమనకాండ, ఎడాపెడా పేర్ల మార్పు వంటి నిర్ణయాలతో వివాదాస్పద సీఎంగా పేరొందిన యోగి క్రమంగా పాలనా సంస్కరణలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే దిశగా కసరత్తు వేగవంతం చేశారు. మంత్రులందరికీ ఐపాడ్లు సమకూర్చి పేపర్‌లెస్‌ కేబినెట్‌గా మార్చేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. లక్నోలో ఇటీవల జరిగిన డిఫెన్స్‌ ఎక్స్‌పోలో సీఎం యోగి ఐపాడ్‌తో నోట్స్‌ రాసుకోవడం, ఆదేశాలు ఇవ్వడం అధికారిక కార్యక్రమాలకు విస్తృతంగా ఐపాడ్‌ను వినియోగించడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

చదవండి : టీచర్లకు విదేశీ భాషలు నేర్పించండి : యోగి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement