తక్కువ ధరకే ఐప్యాడ్.. రెడ్ కలర్‌లో ఐ ఫోన్
తక్కువ ధరలో కొత్త ఐప్యాడ్ మోడల్‌ను ఆపిల్ మంగళవారం విడుదల చేసింది. గత కొద్దిరోజులుగా మందకోడిగా ఉన్న ఐప్యాడ్ అమ్మకాలకు బూస్ట్ ఇచ్చేందుకే తక్కువ ధర ఐప్యాడ్‌ను ఆపిల్.. మార్కెట్లోకి తీసుకువస్తోందని తెలిసింది. అయితే, ఐప్యాడ్ ప్రొ ఫీచర్లతో పోల్చితే ఇందులో కొన్ని ఫీచర్లను తగ్గించింది. ఈ నెల 24 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంటుంది కొత్త ఐప్యాడ్.
కాగా, ఐప్యాడ్ రిలీజ్ ఈవెంట్లోనే ఐ ఫోన్ 7ను ఎరుపు రంగులో అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది ఆపిల్. హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధుల నివారణకు విరాళంగా ఇవ్వడానికి ఆపిల్ అప్పుడప్పుడూ రెడ్ కలర్‌లో ఫోన్లను విడుదల చేస్తూ వస్తోంది. రెడ్ కలర్ ఫోన్ల అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో కొంత హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వ్యాధుల నివారణ ఫండ్‌కు కేటాయిస్తుంది.
ఐప్యాడ్ ఫీచర్లు
స్క్రీన్: 9.7 అంగుళాలు
ప్రాసెసర్: ఏ9 ప్రాసెసింగ్ చిప్
బ్యాటరీ లైఫ్: 10 గంటలు
కెమెరా: 8 మెగాపిక్సల్
ధర: రూ.21467/-