వరల్డ్ వైడ్ గా ఉన్న టెక్ ప్రియుల్ని అట్రాక్ట్ చేసేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్త కొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంది. అయితే తాజాగా ఈ టెక్ జెయింట్ 20 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే తో మ్యాక్ బుక్, ఐప్యాడ్‌లను టెక్ లవర్స్‌కు పరిచయం చేయనున్నట్లు పలు రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.
బ్లూమ్ బెర్గ్ కథనం ప్రకారం..2026 నాటికి ఫోల్డబుల్ డిస్‌ప్లేతో ప్రొడక్ట్‌లను మార్కెట్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గత రెండేళ్లుగా యాపిల్ డ్యూయల్ స్క్రీన్, ఫోల్డబుల్ మ్యాక్‌బుక్/ఐప్యాడ్ హైబ్రిడ్‌ను తయారు చేయాలని భావిస్తుందని బ్లూమ్ బెర్గ్ ప్రతినిధి గుర్మాన్ రిపోర్ట్‌లో పేర్కొన్నాడు. ఇదే విషయాన్ని డిస్‌ప్లే సప్లై చైన్ కన్సల్టెంట్స్ (డీఎస్‌సీసీ) విశ్లేషకుడు రాస్ యంగ్ నిర్ధారించారు.
యాపిల్ కంటే ముందే లెనోవో
యాపిల్ ప్రస్తుతం వర్క్ చేస్తున్న ఫోల్డబుల్ ప్రొడక్ట్‌లను లెనోవో గతంలో విడుదల చేసింది. Lenovo ThinkPad X1 ఫోల్డ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పర్సనల్ కంప్యూటర్ కేవలం టాబ్లెట్/ మానిటర్‌గా పనిచేయడమే కాకుండా ఫోల్డ్ చేసి ఉన్న సగం స్క్రీన్ కీబోర్డ్‌లా పనిచేస్తుంది. అయితే ఈ తరహా ప్రొడక్ట్‌లు చాలా కాస్ట్లీగా ఉన్నాయని లెనోవో విడుదల చేసిన ఈ ఫోల్డబుల్ ప్రొడక్ట్ Lenovo ThinkPad X1 ధర మనదేశంలో రూ.2,43,198గా ఉంది. యాపిల్ ఫోల్డబుల్ ప్రొడక్ట్ కూడా ఇదే కాస్ట్‌లో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment