ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ ప్రో తయారీని పెంచాలనే ప్రయత్నాల్ని విరమించుకుంటున్నట్లు బ‍్లూమ్ బర్గ్ తన కథనంలో పేర్కొంది.
సెప్టెంబర్ 16 న ‘యాపిల్ ఫార్ అవుట్’ ఈవెంట్‌లో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ను విడుదల చేసింది. అయితే ఈ సిరీస్‌లోని ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్ సేల్స్ పెరగడం.. ధర భారీగా ఉండడంతో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ను యూజర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. విడుదల ప్రారంభంలో ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ సేల్స్ బాగున్నా.. క్రమ క్రమంగా వాటి అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ల అమ్మకాలపై యాపిల్ పెట్టుకున్న భారీ అంచనాలు తారుమారయ్యాయి.
అంచనాలు తలకిందులు
ఈ తరుణంలో యాపిల్ సంస్థ ధర ఎక్కువగా ఉన్న ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ల తయారీని తగ్గించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి విడుదలకు ముందు ఐఫోన్ 14 సిరీస్‌పై అంచనాలు భారీగా పెరగడంతో ఈ ఏడాది జులై 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలంలో 6 మిలియన్ యూనిట్ల ఐఫోన్ 14 సిరీస్ ఫ్లాగ్ షిప్ ఫోన్‌లు..ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను తయారు చేయాలని భావించింది.
ఆదరణ అంతంత మాత్రమేనా
కానీ యూజర్ల అభిరుచులకు అనుగుణంగా లేకపోవడం, వాటి ఆదరణ అంతంత మాత్రంగా ఉండడంతో తయారీని తగ్గించాలని యాపిల్ సంస్థ ఐఫోన్ తయారీ సంస్థల‍్ని ఆదేశించినట్లు బ్లూమ్ బర్గ్ తన కథనంలో హైలెట్ చేసింది. బదులుగా, అదే సమయానికి 90 మిలియన్ ఐఫోన్ 14 ఎంట్రీ లెవల్ ఫోన్‌లను తయారు చేయాలని భావిస్తోంది. ఎంట్రీ లెవల్ ఫోన్‌ల కంటే ఐఫోన్ 14 ప్రో మోడల్ ఫోన్‌ల డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి సామర్థ్యాన్ని యాపిల్ తగ్గించనుందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.
Comments
Please login to add a commentAdd a comment