ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్‌ల తయారి కంపెనీ పెగట్రాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఐఫోన్‌ల తయారీ కోసం బెంగళూరులోని విస్ట్రాన్ ప్లాంట్‌ను కొనుగోలు చేసిన టాటా ఎలక్ట్రానిక్స్.. తాజా పెగట్రాన్‌తో సంప్రదింపులు జరగడం ఆసక్తికరంగా మారింది.
అయితే టాటా ఎలక్ట్రానిక్ పెగట్రాన్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుందని, ఇందుకోసం ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత డీల్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా, దీనిపై పెగట్రాన్ గానీ, టాటా ఎలక్ట్రానిక్స్ గానీ స్పందించేందుకు నిరాకరించాయి.
Comments
Please login to add a commentAdd a comment