![Apple Advice To iPhone Users Against Putting in Rice Bag - Sakshi](/styles/webp/s3/article_images/2024/02/20/iphone.jpg.webp?itok=dluK1d_j)
మనం రోజు ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ నీటిలో పడినప్పుడు చాలామంది చేసేపని దాన్ని తీసి వెంటనే తుడిచి ఓ బియ్యం సంచిలోనో లేక డబ్బాలోనో ఉంచి, కొంత సమయం వేచి ఉన్న తరువాత దానికి మళ్ళీ ఛార్జింగ్ పెడతారు. అయితే ఈ విధానం 'ఐఫోన్'ల విషయంలో అమలు చేయకూడదని యాపిల్ కంపెనీ పేర్కొంది.
ఐఫోన్ నీళ్లలో పడితే దాన్ని బియ్యం సంచిలో ఉంచకూడదని, అలా చేస్తే బియ్యంలో ఉండే సూక్ష్మ రేణువులు ఫోన్‌లోకి చేసే అవకాశం ఉంది, తద్వారా ఫోన్ పాడయ్యే అవకాశం ఉంటుందని యాపిల్ కంపెనీ పేర్కొంది.
నీళ్లలో ఐఫోన్ పడితే దాన్ని దానిలోకి చేరిన నీటిని మెల్లగా బయటకు తీయడానికి కిందివైపు ఉన్న డివైజును నెమ్మదిగా/సున్నితంగా కొట్టాలి. ఆ తరువాత గాలి వీచే ప్రదేశంలో ఉంచాలి. ఓ అరగంట తరువాత కేబుల్‌తో ఛార్జ్ చేయాలి.
ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్ ఇవే! ధరలు ఎలా ఉన్నాయంటే?
నిజానికి ఫోన్‌లోకి చేరిన నీరు బయటకు రావడానికి ఒక రోజు సమయం కూడా పట్టొచ్చు. దీనిని లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ సాయంతో ఫోన్ పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఇంకా ఏదైనా అనుమానం ఉంటే దాన్ని యాపిల్ అధీకృత సర్వీస్ ప్రొవైడర్ వద్దకు తీసుకెళ్లాలని సంస్థ సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment