చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షావోమీ భారత్‌లో తన దూకుడును కొనసాగిస్తుంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉన్న షావోమీ.. తాజాగా రెడ్‌మీ నోట్11 5జీ ఫోన్‌ను 'రెడ్‌మీ నోట్ 11టీ' పేరుతో ఇండియాలో విడుదల చేయనుంది.
షావోమీ సంస్థ గతవారం చైనాలో రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌ను లాంఛ్ చేసింది. వరల్డ్ వైడ్‌గా స్మార్ట్ ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటున్న ఈ రెడ్‌మీ నోట్ 11ను ఆయా దేశాల్లో మారు పేర్లతో విడుదల చేస్తోంది. చైనాలో రెడ్ మీ నోట్11గా విడుదల చేయగా..యురేపియన్ మార్కెట్‌లో పోకో ఎం4 ప్రో5జీగా విడుదల చేసేందుకు స్ధిమైంది.
'రెడ్‌మీ నోట్ 11టీ' ఫీచర్లు
రెడ్‌మీ నోట్ 11 సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 11 5జీ,రెడ్‌మీ నోట్11 ప్రో, రెడ్‌మీ నోట్11 ప్రో ప్లస్ మూడు స్మార్ట్ ఫోన్‌లు ఉన్నాయి. స్పెసిఫికేషన్ల పరంగా రెడ్‌మీ నోట్ 11 ప్రో, ప్రో ప్లస్‌లలో ఫాస్ట్ ఛార్జింగ్ తప్ప మిగిలిన అన్నీ ఫీచర్లు ఒకేలా ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 11 ప్రోలో 67వాల్ట్‌ల ఫాస్ట్ ఛార్జింగ్, 5,160ఎంఏహెచ్ తో వస్తుంది. రెడ్‌మీ నోట్ 11ప్రో ప్లస్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాల్ట్‌ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. మూడు స్మార్ట్‌ఫోన్‌లు మీడియాటెక్ డైమెన్సిటీ చిప్‌సెట్, పంచ్ హోల్ డిజైన్‌తో విడుదల కానుంది. చైనాలో రెడ్‌మీ నోట్ 11 సిరీస్ రూ.14,000 ప్రారంభం కానుంది.
ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన ఫోన్
రెడ్‌మీ నోట్11 పేరుతో షావోమీ చైనాలో నిన్నటి నుంచి సేల్స్ ప్రారంభించింది.ఈ సేల్స్ ప్రారంభమైన గంటలోపు 500,000లక్షల ఫోన్‌లు అమ్ముడైన విషయం తెలిసిందే. భారత్‌లో సైతం షావోమీ విడుదల చేసిన రెడ్‌మీ సిరీస్ ఫోన్‌లు సేల్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి.
ఇటీవల భారత్‌లో విడుదలైన క్యూ3 (త్రైమాసిక) ఫలితాల్లో షావోమీ 22శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..షావోమీ నుండి విడుదలైన నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు రెడ్‌మీ9, రెడ్‌మీ9 పవర్, రెడ్‌మీ నోట్ 10, రెడ్‌మీ 9 అత్యధికంగా అమ్ముడైన జాబితాలో మొదటి నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. ఈ నాలుగు ఫోన్‌లు మూడవ త్రైమాసికంలో మిలియన్ కంటే ఎక్కువగా అమ్ముడైన ఫోన్‌ల జాబితాలో చోటు సంపాదించాయి. ఈ ఏడాదిలో రెడ్‌మీ 9 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా అగ్రస్థానంలో ఉందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది.
చదవండి: మరికొన్ని గంటలే: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు
Comments
Please login to add a commentAdd a comment