జాతీయ,అంతర్జాతీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో చైనా ఫోన్‌లు సత్తా చాటుతున్నాయి. మనదేశంలో స్మార్ట్‌ఫోన్ 3వ త్రైమాసిక(జులై,ఆగస్ట్,సెప్టెంబర్) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో షావోమీ సంస్థకు చెందిన రెడ్‌మీ 9 సిరీస్ ఫోన్‌లు ఈ ఏదాది అత్యదికంగా అమ్ముడైన ఫోన్లుగా సరికొత్త రికార్డ్‌లను క్రియేట్ చేశాయి. తాజాగా అదే సంస్థకు చెందిన మరో ఫోన్ సేల్స్ రాకెట్‌లా దూసుకెళ్తున్నాయి. సేల్ ప్రారంభమైన గంటలోపు 500,000 కంటే ఎక్కువ యూనిట్ల అమ్మకాలు జరిగినట్లు షావోమీ తెలిపింది.
గంటలో 5లక్షల ఫోన్ సేల్స్
షావోమీ గత వారం రెడ్‌మీ నోట్ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 11, రెడ్‌మీ నోట్11 ప్రో, రెడ్‌మీ నోట్‌ప్రో ప్లస్‌లను లాంఛ్ చేసింది. ఆఫోన్ సేల్స్ నేటి నుంచి చైనాలో ప్రారంభమయ్యాయి. అయితే సేల్స్ ప్రారంభమైన గంటలోపు 500,000లక్షల ఫోన్‌లు అమ్ముడైనట్లు షావోమీ తెలిపింది. ఫోన్‌ల అమ్మకాలు ప్రారంభమైన మొదటి 52 నిమిషాల 11 సెకన్లలో సుమారు 4 బిలియన్ యువాన్‌ల బిజినెస్ జరిగిందని, వీటిలో 1 నిమిషం 45 సెకన్లలో 2 బిలియన్ యువాన్లు బిజినెస్ జరిగినట్లు వెల్లడించింది.
భారత్‌లో 20లక్షల ఫోన్ సేల్స్
ఇగ 'గిజ్మోచైనా' నివేదిక ప్రకారం..భారత్‌లో సైతం షావోమీ ఫోన్‌లు సేల్స్ భారీగా జరుగుతున్నాయి. ఈఏడాదిలో షావోమీకి చెందిన రెడ్ మీ నోట్ 10 విడుదలైన 3నెలల్లో ఒక్క భారత్‌లోనే 20లక్షల ఫోన్‌లు అమ్ముడైనట్లు గిజ్మోచైనా తన నివేదికలో పేర్కొంది.
ఫోన్ ధరలు
చైనాలో అమ్మకాలు జరుపుతున్న 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ రెడ్ మీ నోట్ 11 ధర రూ.14,000 ఉండగా.. 6జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ ఉన్న రెడ్ మీ నోట్ 11 ప్రో సుమారు రూ.18,700 గా ఉంది. రెడ్ మీ నోట్ 11ప్రో ప్లస్ ఫోన్ ధర రూ.22,200గా ఉంది. 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ ఉన్న రెడ్ మీ నోట్ 11 వైపో ఎడిషన్ ఫోన్ ధర రూ.31,500గా నిర్ణయించింది.
చదవండి: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇదే..!
Comments
Please login to add a commentAdd a comment