నేడే రెడ్‌మీ 9 పవర్ ఫస్ట్ సేల్ | Redmi 9 Power Goes on First Sale | Sakshi
Sakshi News home page

నేడే రెడ్‌మీ 9 పవర్ ఫస్ట్ సేల్

Published Tue, Dec 22 2020 2:16 PM | Last Updated on Tue, Dec 22 2020 2:27 PM

Redmi 9 Power Goes on First Sale - Sakshi

న్యూఢిల్లీ: షియోమీ కంపెనీ రెడ్‌మీ 9 పవర్ మొబైల్ నీ గత వారం భారత్ లో ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. రెడ్‌మీ 9 పవర్ ఫస్ట్ సేల్ నేడు ప్రారంభం అయింది. ఈ మొబైల్ అమెజాన్, షియోమీ ఆన్లైన్ స్టోర్ లలో అందుబాటులో ఉంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఒకటి 4+64 జీబీ వేరియంట్ దీని ధర రూ.10,999, రెండవది 4+128 జీబీ వేరియంట్ దీని ధర రూ.11,999. దీనిలో ప్రత్యేకంగా మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా  ఉంది. షియోమీ రెడ్‌మీ 9 పవర్ మైటీ బ్లాక్, బ్లేజింగ్ బ్లూ, ఫైరీ రెడ్, ఎలక్ట్రిక్ గ్రీన్ అనే నాలుగు రంగులలో లభిస్తుంది. (చదవండి: రూ.14వేలకే శామ్‌సంగ్ 5జీ మొబైల్)

కొత్త రెడ్‌మీ 9 పవర్ మొబైల్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది అడ్రినో 610 జీపీయు, 4 జీబీ ర్యామ్‌తో జత చేయబడింది. ఇది 6.53-అంగుళాల ఫుల్‌హెచ్‌డి ప్లస్ డిస్ప్లే కలిగి ఉంది. మెయిన్ కెమెరా సెటప్‌లో నాలుగు కెమెరా లెన్సులు ఉన్నాయి. ఇందులో 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సల్ సెకండరీ కెమెరా, 2 ఎంపీ మాక్రో, 2 ఎంపీ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 8ఎంపీ కెమెరా ఉంది. ఈ ఫోన్ 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. భద్రత కోసం ఈ ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం ఇందులో 4జీ వోల్టే, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement