ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్... గూగుల్ తీసుకొచ్చిన అద్భుతమైన ఈ టెక్నాలజీతో ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్మార్టుగా తయారైంది అని చెప్పుకోవాలి. ఆండ్రాయిడ్ మొదటి వెర్షన్ 1.0 సెప్టెంబర్ 23, 2008న విడుదలైంది. అప్పటి నుంచి ప్రతి ఏడాది మొబైల్ వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తుంది. గత ఏడాది సెప్టెంబర్ 8న తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ 11లో ఛాట్ బబుల్స్, కన్వర్జేషన్ నోటిఫికేషన్స్, బిల్ట్-ఇన్ స్క్రీన్ రికార్డర్ వంటి కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేశారు.
ప్రస్తుతం ఇంకా ఆండ్రాయిడ్ 11 అప్‌డేట్ అందరి స్మార్ట్‌ఫోన్లలో అందుబాటులోకి రానప్పటికీ అప్పుడే తర్వాత రాబోయే ఆండ్రాయిడ్12పై అనేక పుకార్లు బయటకి వస్తున్నాయి. ఆండ్రాయిడ్ 12కు చెందిన కొన్ని ఫీచర్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది చివరికి గూగుల్ పిక్సల్, ఆండ్రాయిడ్ వన్ తో పాటు ఇతర స్మార్ట్‌ఫోన్లలో దీనిని తీసుకొనిరానున్నట్లు తెలుస్తుంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పతులలో వినియోగిస్తున్నారు. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఆండ్రాయిడ్ 12 లీకైన స్క్రీన్‌షాట్లను గమనిస్తే ప్రధానంగా యూఐ, సెక్యూరిటీ విషయంలో దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
గూగుల్ తర్వాత తీసుకొనిరాబోయే ఆండ్రాయిడ్ 12లోని ఫీచర్లు ఐఓఎస్ ని పోలి ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాక, పెద్ద నోటిఫికేషన్ టోగుల్ బటన్‌తో ఉన్న స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసింది. ఆండ్రాయిడ్ 11లో ఆరు క్విక్ టోగుల్ బటన్స్ ఉండగా, ఆండ్రాయిడ్ 12లో మాత్రం నాలుగు టోగుల్ బటన్స్ మాత్రమే ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే ఐఓఎస్ లో కనిపించే సెక్యూరిటీ టోగుల్స్ కూడా ఇందులో తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. అంటే, ఆండ్రాయిడ్ 12లో పటిష్టమైన సెక్యూరిటిని అందించడానికి ఈ అప్‌డేట్‌లో ప్రయత్నిస్తున్నారు. దీనితో పాటు రీసెంట్ మెసేజెస్, కాల్స్, యాక్టివిటీ స్టేటస్ వంటి కొత్త విడ్జెట్‌లను తీసుకురానున్నారు. సమీప ఎలక్ట్రానిక్ పరికరాలతో వై-ఫై పాస్‌వర్డ్‌లను పంచుకోవడం, మెరుగైన థీమింగ్ అందిస్తారని అర్ధం అవుతుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment