Cycle riders
-
అతడు అలా అనంగానే..ఆ ఆవులన్నీ ఒక్కసారిగా..!
ఆవులు మేత మేస్తున్నప్పుడూ వాటికి నచ్చినట్లు వెళ్లిపోతాయి. ఒక్కొసారి వాటిని కాస్తున్న వ్యక్తి మాటలు కూడా వినవు. అలాంటిది ఓ వ్యక్తి జస్ట్ చేతులు చూపించి సైగ చేయగానే అవన్నీ ఏదో అర్థమైనట్లు భలే బిహేవ్ చేశాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో ఓ సైకిలిస్ట్ ఇంగ్లాండ్‌లోని రెండో ఎత్తైన పర్వతం గ్రేట్ డన్ ఫెల్ మీదుగా వెళ్తూ కాసేపు బ్రేక్ తీసుకున్నాడు. ఇంతలో అతడివైపుకే ఉన్నట్టుండి ఆవులన్నీ వచ్చేస్తున్నాయి. ఆవులు కాస్తున్న రైతు వాటిని రోడ్డుమీదకు రానీయకుండా ఆపాలని కోరాడు. దీంతో ఆ సైకిలిస్ట్ ఆవుల మందకు ఎదురుగా నిలబడి గట్టిగా "స్టాప్" అని అరుస్తూ.. చేతులతో సంజ్ఞ చేశాడు. అంతే అవన్నీ ఏమనుకున్నాయో గానీ భలేగా ఒక్కసారిగా అన్నీ కదలకుండా రోడ్డుపైనే నిలిచిపోయాయి. ఏ ఒక్కటి ముందుకు రాలేదు. పైగా ఆ రైతు వాటిని సమీపించేంత వరకు అలానే ఉండటం విచిత్రం. ఈ విషయాన్ని సైకిల్ రైడర్ "రైడ్‌లో నాకెప్పుడు ఎదరవ్వని విచిత్రమైన అనుభవం" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోని షేర్ చేశాడు. ఈ వీడియోకి మిలయన్లలో వ్యూస్ లైక్‌లు వచ్చాయి. View this post on Instagram A post shared by Andrew O'Connor (@andrewon2wheels) (చదవండి: "విమానాన్నే ఇల్లుగా మార్చేశాడు"..అందుకోసం ఏకంగా..) -
నడిరోడ్డులో సైకిల్‌పై హుషారుగా స్టంట్స్.. పాపం తాత దీనగాథ!
-
సరదాగా ప్రీడమ్ రైడ్
స్వతంత్ర దినోత్సవ వేళ సిటీలో సైక్లింగ్ సందడి కనిపించింది. గచ్చిబౌలి స్టేడియంలో ద అట్లాంటా ఫౌండేషన్, వొడాఫోన్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన ఫ్రీడమ్ రైడ్‌లో పదివేల మందికిపైగా సైకిల్ రైడర్లు పాల్గొన్నారు. ఆరేళ్ల బుడతల నుంచి అరవై ఏళ్ల సీనియుర్ సిటిజన్ల వరకు అందరూ సైకిల్ రైడ్‌లో సరదాగా కదిలారు. 67 కిలోమీటర్ల ఈ రైడ్‌ను ఐటీ వుంత్రి కేటీఆర్, క్రికెటర్ ప్రజ్ఞా ఓజా, సినీనటి మంచు లక్ష్మి ప్రారంభించారు. ‘స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ నేషన్’ అంటూ ప్రత్యేకంగా మహిళా సైక్లింగ్ టీమ్, స్ట్రాంగ్ యూత్, స్ట్రాంగ్ నేషన్ అంటూ ప్రత్యేకంగా చిన్నారుల టీమ్‌లు పాల్గొన్నాయి. ప్రొఫెషనల్ సైక్లిస్ట్ల కోసం ‘టఫ్ క్రిటేరియం’ను నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన ఈ సిగ్నేచర్ రైడ్ మలేసియా టౌన్షిప్, ఇనార్బిట్ మాల్, లంగర్‌హౌస్ రోడ్, హిమాయత్ సాగర్ లేక్, వీఐఎఫ్ కాలేజీ మీదుగా మైక్రోసాఫ్ట్ వరకు సాగింది. - వాంకె శ్రీనివాస్