సరదాగా ప్రీడమ్ రైడ్ | Freedom ride to make as Cycle riders over Gachibowli stadium | Sakshi
Sakshi News home page

సరదాగా ప్రీడమ్ రైడ్

Published Sat, Aug 16 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

సరదాగా ప్రీడమ్ రైడ్

సరదాగా ప్రీడమ్ రైడ్

స్వతంత్ర దినోత్సవ వేళ సిటీలో సైక్లింగ్ సందడి కనిపించింది. గచ్చిబౌలి స్టేడియంలో ద అట్లాంటా ఫౌండేషన్, వొడాఫోన్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన ఫ్రీడమ్ రైడ్‌లో పదివేల మందికిపైగా సైకిల్ రైడర్లు పాల్గొన్నారు. ఆరేళ్ల బుడతల నుంచి అరవై ఏళ్ల సీనియుర్ సిటిజన్ల వరకు అందరూ సైకిల్ రైడ్‌లో సరదాగా కదిలారు. 67 కిలోమీటర్ల ఈ రైడ్‌ను ఐటీ వుంత్రి కేటీఆర్, క్రికెటర్ ప్రజ్ఞా ఓజా, సినీనటి మంచు లక్ష్మి ప్రారంభించారు. ‘స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ నేషన్’ అంటూ ప్రత్యేకంగా మహిళా సైక్లింగ్ టీమ్, స్ట్రాంగ్ యూత్, స్ట్రాంగ్ నేషన్ అంటూ ప్రత్యేకంగా చిన్నారుల టీమ్‌లు పాల్గొన్నాయి. ప్రొఫెషనల్ సైక్లిస్ట్‌ల కోసం ‘టఫ్ క్రిటేరియం’ను నిర్వహించారు.  గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన ఈ సిగ్నేచర్ రైడ్ మలేసియా టౌన్‌షిప్, ఇనార్బిట్ మాల్, లంగర్‌హౌస్ రోడ్, హిమాయత్ సాగర్ లేక్, వీఐఎఫ్ కాలేజీ మీదుగా మైక్రోసాఫ్ట్ వరకు సాగింది.
 - వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement