Wankey Srinivas
-
కెరీర్ గోల్స్.. వయా హల్స్.. మాల్స్
కల్యాణ మంటపం అనగానే.. మంగళవాద్యాలు, వేద మంత్రాలు వినిపిస్తుంటాయి. షాపింగ్ మాల్స్.. కొనుగోలుదారులతో నిండి ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింట్లోనూ చేతిలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న సీరియస్ యంగ్ పీపుల్ కనపడుతున్నారు. హైదరాబాద్‌కు ఏమైందబ్బా అని ఆందోళనలో పడిపోకండి. టీఎస్పీఎస్సీ పుణ్యమా అని కల్యాణ మంటపాలు, షాపింగ్ మాల్స్ కోచింగ్ సెంటర్స్‌గా మారిపోయాయి. త్వరలో ప్రభుత్వోద్యోగాల నోటిఫికేషన్స్ వెలువడనుండటంతో... బంధుమిత్ర సపరివార సందడి తో కళకళలాడే ఫంక్షన్ హాల్స్ విద్యార్థుల అధ్యయన, అభ్యాసాలకు కేంద్రాలయ్యాయి. నిత్యం జనం రద్దీతో లక్ష్మీకళ ఉట్టిపడాల్సిన షాపింగ్ మాల్స్‌లో... విద్యార్థులతో సరస్వతీ వైభవం కనిపిస్తోంది. - వాంకె శ్రీనివాస్ అశోక్‌నగర్.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్.. సాధారణంగా గ్రూప్స్, సివిల్స్ కోచింగ్ సెంటర్స్‌కు అడ్డాలు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కావడం, త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉండటంతో హైదరాబాద్ నగరానికి ప్రభుత్వ ఉద్యోగాల ఫీవర్ పట్టుకుంది. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ఉంటుందన్న ఆశతో జిల్లాల నుంచి విద్యార్థులంతా నగరబాట పట్టారు. ఖాళీలు భారీగా ఉంటాయన్న నమ్మకంతో ఈసారి సర్కారీ నౌకరీ కచ్చితంగా కొట్టాలన్న పట్టుదల తో ఉన్నారు. ఆలసించిన ఆశాభంగం అనుకుని కోచింగ్ సెంటర్లకు క్యూ కట్టారు. ఉద్యోగార్థుల తాకిడి వందలు దాటి వేలకు చేరడంతో.. కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్‌ను క్లాస్ రూమ్స్‌గా మార్చేశారు. ఫలితంగా శుభకార్యాలతో సందడిగా కనిపించాల్సిన కల్యాణ మంటపాలు ఉద్యోగార్థులతో కిటకిటలాడుతున్నాయి. ఆరు నెలల అద్దె ఒకేసారి.. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఆశోక్ నగర్లోనే కాదు.. వీఎస్టీ, అమీర్‌పేట్, కూకట్పల్లి, దిల్షుక్నగర్ ఏరియాల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్‌లో ఒకేసారి వెయ్యి మందికిపైగా విద్యార్థులను అకామిడేట్ చేసే అవకాశం ఉండటంతో కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కూడా వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఆరు నెలల అద్దె ఒకేసారి చెల్లించి వీటిని బుక్ చేసుకుంటున్నారు. ‘నెలలో మహా అయితే నాలుగు, ఐదు పెళ్లిళ్లుంటాయి. అది కూడా సీజన్లోనే. అలాంటిది ఆరేడునెలలు, ఎలాంటి ఆటంకం లేకుండా డబ్బు రావడంతో మారుమాట చెప్పకుండా ఇచ్చేశాం’ అంటున్నాడు వీఎస్టీలోని ఓ కల్యాణ మంటపం యజమాని. ఆర్‌పార్.. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగాల్లో ఖాళీలు భారీగా ఉన్నాయని, రానున్న రెండేళ్లలో వీటిని భర్తీ చేస్తారని విద్యార్థుల అంచనా. కొద్ది నెలల్లో నోటిఫికేషన్లు జారీ కావొచ్చనే అంచనాలు నిరుద్యోగులకు ఆశ కల్పిస్తోంది. ఇప్పుడు ఉద్యోగం పొందలేకపోతే.. భవిష్యత్తులో అసాధ్యమని చాలామంది డిసైడ్ అయ్యారు. అందుకే డిగ్రీలు పూర్తి చేసిన వారు సైతం పీజీల ఊసెత్తకుండా పోటీపరీక్షలకు సిద్ధం సుమతి అంటున్నారు. జంటనగరాలతో పాటు.. తెలంగాణ జిల్లాల్లోని ఉద్యోగార్థులంతా కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. పీజీలు, పీహెచ్‌డీలు పూర్తి చేసిన వారు సైతం.. ప్రభుత్వోద్యోగం పొందడమే లక్ష్యంగా కోచింగ్ తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల సంఖ్య మూడింతల వరకూ పెరిగిందని చెబుతున్నారు విశ్లేషకులు. దీంతో పెరిగిన విద్యార్థులకు సరిపడా క్లాస్‌రూమ్‌లు లేకపోవడంతో ఇలా ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్‌ను కోచింగ్ అడ్డాలుగా మార్చేశారు నిర్వాహకులు. ఫర్వా నై.. ‘ప్రత్యేక రాష్ట్రంలో పబ్లిక్ కమిషన్ ఏర్పాటుతో చాలా ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నాం. పెద్ద ఎత్తున పోస్టులుండే అవకాశం ఉంది కాబట్టి... ప్రభుత్వోద్యోగం ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడూ రాదు. అందుకే సీరియస్‌గా చదువుతున్నా’ అని అంటున్నాడు వరంగల్‌కు చెందిన వీరన్న. మరి ఫంక్షన్ హాల్స్‌లో క్లాస్ రూమ్ వాతావరణం కనిపిస్తుందా అని అడిగితే.. ‘డిమాండ్‌ను బట్టి సప్లై అన్నట్టుగా.. విద్యార్థులను బట్టి తరగతి గదులు మారుతున్నాయి. హాల్స్‌లో అయినా స్పీకర్స్ గట్రా ఉంటుండటంతో ఎలాంటి ఇబ్బంది ఉండటం లేదు’ అని చెబుతున్నాడు ఖమ్మం విద్యార్థి నర్సింహ నాయక్. ‘ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు. అందుకే శిక్షణ తీసుకుంటున్నా. ఫంక్షన్ హాలా, షాపింగ్ మాలా అనేది ముఖ్యంకాదు... మాకు చెబుతున్న ఇన్స్ట్రక్టర్స్ ఎలాంటివారన్నదే చూస్తున్నాం’ అని అంటున్నారు కరీంనగర్‌కు చెందిన చైతన్య, రంగారెడ్డి విద్యార్థి శిరీష. ఎలాగైనా ఉద్యోగం పొందాలని కసిగా ఉన్న విద్యార్థులు.. పాఠాలను తప్ప.. అవి ఎక్కడ చెబుతున్నారన్న విషయాన్ని పక్కనపెట్టేస్తున్నారు. వెరసి భవిష్యత్ ఉద్యోగులకు ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్సే కెరీర్ టర్నింగ్ పాయింట్స్‌గా నిలుస్తున్నాయి. -
నాన్నే నా పాటశాల
హిందూస్థానీ బాణీల్లోని కమ్మదనం దక్కన్ వాసులకు వీనులవిందు చేసింది. తండ్రి నుంచి వారసత్వంగా అందిన గమకాలను తన స్వరంలో పలికించాడు శౌనక్ అభిషేకీ. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, సూరమండల్ సంయుక్త ఆధ్వర్యంలో లకిడీకాపూల్‌లోని విద్యారణ్య స్కూల్లో జరిగిన దివంగత హిందూస్థానీ సంగీత విద్వాంసుడు పండిట్ జితేంద్ర అభిషేకీ నివాళి కార్యక్రమం ఆయన కుమారుడు శౌనక్ రాగరంజనికి వేదికైంది. ఐదేళ్ల తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ‘మార్నింగ్ రాగా కన్సర్ట్’ మెలోడీని వినిపించిన శౌనక్ను సిటీప్లస్ పలకరించింది. - వాంకె శ్రీనివాస్ మా స్వస్థలం గోవా. నేను పుట్టి పెరిగింది మాత్రం పుణేలో. పాతికేళ్లుగా అక్కడే ఉంటున్నాను. సింబియాసిస్ యూనివర్సిటీలో లా చదివాను. హిందూస్థానీ క్లాసిక్ అంటే ప్రాణం. అందులో ఆగ్రా, జైపూర్ స్టయిల్ మిక్స్ చేసి పాడుతుంటే ఆ ఆనందం వర్ణించలేను. నాన్న పండిట్ జితేంద్ర అభిషేకీ హిందూస్థానీ సంగీతంలో ఓ శకం. ఆయనకు దేశవిదేశాల్లో అభిమానులు ఉన్నారు. కచేరీల కోసం ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభించేది. నాన్న స్ఫూర్తితో నా అడుగులు సంగీతం వైపు పడ్డాయి. నేను సంగీతంలో ఏ కోర్స్ చేయలేదు. నాన్నే నాకు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ. ఆయన నీడలోనే రాగాలను ఉపాసించాను. ఆయన ఆశీస్సులే నన్ను ఇంతవాణ్ని చేశాయి. నాలో నాన్నను చూడాలని.. నాన్న అంత గొప్పవాడిని కాకపోయినా, స్వయం ప్రతిభతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఇందులో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇండియాతో పాటు అమెరికా, జర్మనీ, గల్ఫ్, థాయ్‌లాండ్‌లో కూడా కచేరీలు చేశాను. నేను ఎక్కడికి వెళ్లినా చాలా మంది నాన్న గొప్పదనం గురించి ప్రస్తావిస్తుంటారు. ‘మీ నాన్నను నీలో చూడాలని ఉంది’ అని అడిగేవారు. ఆయనకు సంగీతంతోనే నివాళి అర్పించాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నా స్వర ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. స్వరాభిషేక్, తులసీ కీ రామ్, కబీర్, మరాఠీ అభాంగ్ వాణి ప్రదర్శనలు ఇచ్చాను. అవి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నా కుటుంబ సభ్యుల సహకారం తోడవడంతో మ్యూజిక్‌ను ఆస్వాదిస్తున్నా. మై మదర్ సిటీ.. హైదరాబాద్‌కు రావడం ఇది ఐదోసారి. ఈ సిటీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అంతటా ఉన్నట్టే ఇక్కడ కూడా నాన్నకు అభిమానులు ఉన్నారు. మా అమ్మ విద్యా అభిషేకీ పుట్టింది, పెరిగింది ఈ సిటీలోనే. అందుకే హైదరాబాద్‌లో ప్రోగ్రామ్ అనగానే ఓకే చెప్పేశాను. గతంతో పోల్చుకుంటే శాస్త్రీయ సంగీతానికి సిటీలో ఆదరణ పెరుగుతోంది. చాలా మంది సంగీతం చేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో హైదరాబాద్ క్లాసికల్ మ్యూజిక్కు కేరాఫ్‌గా నిలుస్తుంది. -
లోకల్ రేడియో
సిటీవాసులకు ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్దురపోయే వరకు మస్తీగా ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఎఫ్ఎంలకు ‘కమ్యూనిటీ రేడియో’లు కూడా శ్రుతి కలుపుతున్నాయి. ఒక ప్రాంత ప్రజల సాధకబాధకాలను వివరిస్తూనే, ప్రసారాలతో వారిలో సామాజిక స్పృహ కలిగిస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలైతే తమ కాలేజీ విద్యార్థులు బయట ఎక్కడకు వెళ్లినా ఉద్యోగం చేసి నిలదొక్కుకునేందుకు దోహదపడేలా డిఫరెంట్ ఐడియాలజీతో కమ్యూనిటీ రేడియోలను ప్రారంభించాయి. సిటీలోనే తొలి కమ్యూనిటీ రేడియో డెక్కన్ రేడియో 107.8 ఎఫ్ం. మెదక్‌లోని సంఘం రేడియో స్ఫూర్తిగా అబిద్ అలీ ఖాన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు 2009 డిసెంబర్ 23న డెక్కన్ రేడియో 107.8 ఎఫ్ఎంను ప్రారంభించింది. అబిడ్స్‌లో ఉండే ఈ రేడియో స్టేషన్ ప్రసారం చేసే కార్యక్రమాలు ఆ ప్రాంతం నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ప్రసార ం అవుతాయి. లెర్న్ ఇంగ్లిష్, వారుుస్ అండ్ యూక్సెంట్ ట్రైనింగ్, పబ్లిక్ హెల్త్ అండ్ హైజిన్, మహిళా సాధికారత, వరకట్న సమస్యలు, పేదలు అభివృద్ధి చెందడం ఎలా.. తదితర కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. యువతకు ఉపయోగపడేలా ఉద్యోగాల నోటిఫికేషన్ సమాచారాన్ని కూడా అందిస్తోంది. క్రీడా విషయాలు, ఔత్సాహిక కళాకారులతో వినోద కార్యక్రవూలనూ ప్రసారం చేస్తోంది. వుతాలకు అతీతంగా పండుగ రోజుల్లో వాటి ప్రాధాన్యతను తెలిపే కార్యక్రవూలను 24 గంటల పాటు ప్రసారం చేస్తోంది. సాధారణ దినాల్లోనైతే ఉదయుం 8 నుంచి వుధ్యాహ్నం 12 గంటల వరకు, సాయుంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రసారాలు చేస్తోంది. త్వరలోనే ప్రతిరోజూ 24 గంటల ప్రసారాలకు సవూయుత్తవువుతోంది. ఔత్సాహికులకు ఉచిత శిక్షణ, ప్లేస్మెంట్ రేడియోలో పని చేయాలనుకునే ఔత్సాహికుల కోసం డెక్కన్ రేడియో 107.8 ఎఫ్ఎం ఉచిత శిక్షణతో పాటు ప్లేస్‌మెంట్‌ను కూడా అందిస్తోంది. సోమవారం నుంచి బ్యాచ్‌ల వారీగా ట్రైనింగ్ క్లాస్‌లు ఉంటాయి. దీనికి వయోపరిమితి లేదు. శిక్షణ తర్వాత సర్టిఫికెట్లు ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 9848256515లో సంప్రదించవచ్చు. కేఎంఐటీ 90.4 ఎఫ్ఎం... విద్యార్థులకు అన్నిరకాలుగా ఉపయోగపడేలా రెండేళ్ల క్రితం నారాయణగూడలోని కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ వేదికగా కేఎంఐటీ 90.4 ఎఫ్ఎం ప్రారంభమైంది. కాలేజీ పనిదినాల్లో ఈ రేడియో కార్యక్రవూలు మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రసారమవుతాయి. ఒక్కో సబ్జెక్ట్ టీచర్‌ను విద్యార్థులు చేసిన ఇంటర్వ్యూలు, కఠినమైన సబ్జెక్ట్లపై లెక్చరర్ల ప్రత్యేక పాఠాలు..ఇలా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను వారిచేతే నిర్వహిస్తోంది కేఎంఐటీ. ఫ్రెషర్స్ డే, ఫేర్వెల్ డే, స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి రోజుల్లో విద్యార్థులు వినోద కార్యక్రవూలనూ అందిస్తారు. బోల్ హైదరాబాద్ 90.4 ఎఫ్ఎం.. హైదరాబాద్ సెంట్ర ల్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ చొరవతో 2011లో ఈ రేడియో ప్రారంభమైంది. పది కిలోమీటర్ల పరిధిలో ఇందులోని కార్యక్రమాలు విద్యార్థులు, వాలంటీర్ల పర్యవేక్షణలో ప్రసారవువుతుంటారుు. ఉదయం 7.30 నుంచి 9.00 వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.00 వరకు ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, సమాచారం, పాఠాలు, గెస్ట్‌లతో ఇంటర్వ్యూలు ప్రసారమవుతుంటాయి. ఇవే కాకుండా తార్నాకలో త్వరలోనే మరో కమ్యూనిటీ రేడియో ప్రారంభంకానుంది. - వాంకె శ్రీనివాస్ -
స్కేటింగ్ సిటీ
పరుగులు తీసే మనసును.. పగ్గాల్లేకుండా దూసుకుపోయేలా చేస్తుంది. ఉరకలు తీసే పిల్లలకు స్కేటింగ్ మరింత ఉత్సాహాన్నిస్తోంది. సిటీలో ఎప్పట్నుంచో ఉన్న ఈ ట్రెండ్ ఈ మధ్య వేగం పెంచింది. స్కేటింగ్ అంటేనే హైదరాబాద్ అని గుర్తొచ్చేలా ఈవెంట్లు జరుగుతున్నాయి. లోకల్ బాలబాలికలెందరో ఈ ఆటలో అదరగొడుతున్నారు. దూలపల్లిలోని డీఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండు రోజుల పాటు సాగిన సీబీఎస్ఈ సౌత్‌జోన్ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్ ఉత్సాహభరితంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల నుంచి వందలాది మంది విద్యార్థులు స్కేటింగ్ బాట పట్టారు. తల్లిదండ్రుల సంపూర్ణ మద్దతుతో తమకిష్టమైన స్కేటింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ ఇన్లైన్ ఈవెంట్, క్వాడ్ ఇన్లైన్ ఈవెంట్లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో ‘సిటీప్లస్’ ముచ్చటించింది. - వాంకె శ్రీనివాస్ ఆనందంగా ఉంది హోం టౌన్లో రాణించడం ఆనందంగా ఉంది నేను పుట్టి పెరిగిన సిటీలోనే స్కేటింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించడం గొప్ప అనుభూతి. రోడ్ టూ ఈవెంట్ అండర్ 16 గర్ల్స్ డిస్టెన్స్ ఐదువేల మీటర్లలో, టైమ్ టైమర్ 300 మీటర్లలో బంగారు, రజత పతకాలు వచ్చాయి. చిన్నప్పటి నుంచే స్కేటింగ్ అంటే ఇష్టం. 2005 నుంచే ఇందిరాపార్క్‌లోని రింగ్, బేగంపేటలో రోడ్ ఈవెంట్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. గత నెలలోనే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఎక్సలెన్సీ సర్టిఫికెట్ అందుకున్నా. అంతర్జాతీయ స్కేటర్‌గా ఎదగాలనేది నా లక్ష్యం. - అమ్రీన్ఖాన్, డీఆర్ఎస్ స్కూల్ విద్యార్థిని తల్లిదండ్రుల ప్రోత్సాహం.. మా నాన్న ఫ్రెండ్ వల్లనే నాకు స్కేటింగ్‌పై ఇష్టం ఏర్పడింది. 2011 నుంచి ఇందిరాపార్క్‌లో ప్రాక్టీసు చేస్తున్నా. గతేడాది అమృత్సర్, విరార్‌లో జరిగిన నేషనల్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్య పతకాలు సాధించా. ఈ ఈవెంట్ రింగ్ 3లో స్వర్ణం, రోడ్ స్కేటింగ్‌లో రజతం వచ్చాయి. ఆరు రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి ఈ పతకాలు సాధించడం ఆనందంగా ఉంది. నాలాగా అనేక మంది సిటీ విద్యార్థులు స్కేటింగ్‌లో ప్రతిభ కనబర్చడం శుభపరిణామం. - శ్రేయ, సికింద్రాబాద్ ఢిల్లీ పబ్లిక్‌స్కూల్ ్చసిటీ ‘పతకాన్ని’చ్చింది మాది చెన్నై. మా అమ్మాయి కార్తీకను ఇక్కడ స్కేటింగ్ పోటీలకు తీసుకొచ్చా. తొలిసారిగా పాల్గొన్న సీబీఎస్ఈ సౌత్‌జోన్ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్ అండర్-6 విభాగంలో తను బంగారు పతకం సాధించడం సంతోషాన్నిచ్చింది. మా అమ్మాయికి ప్రారంభ పతకాన్ని ఇచ్చిన ఈ సిటీని ఎప్పటికీ మరవలేము. - కార్తీక తండ్రి జగదీశ్వర్, చెన్నై మంచి ఆదరణ సిటీలో స్కేటింగ్‌కు మంచి ఆదరణ ఉంది. 2010లో ఇక్కడ జరిగిన సీబీఎస్ఈ సౌత్‌జోన్ రోలర్ స్కేటింగ్‌లోనూ పాల్గొన్నా. ఈసారి అండర్-19 విభాగంలో రోడ్ ఈవెంట్లో బంగారం, రింగ్‌లో రజతం సాధించా. మళ్లీ నగరానికి రావాలని కోరుకొంటున్నా. - సిలియా స్మిత, మంగళూరు -
బతుకు భాగ్యం
తంగేడు పూల పరిమళం.. గునుగు పూల ఠీవి.. కట్ల పూల సొగసు.. గుమ్మడి పూల వయ్యారం.. ఒకే చోట కనిపించే పూబాల బతుకమ్మ. ప్రతి గడపను పలకరించే ప్రకృతి కాంత బతుకమ్మ. పల్లెవాకిట జానపదుల జేజేలు అందుకున్న ఈ తీరొక్క పూల కొమ్మ.. ఆ పల్లె సందడిని పట్నవాసానికి తీసుకొచ్చింది. చిత్తు చిత్తుల బొమ్మ, శివుడి ముద్దుల గుమ్మ.. బంగారు బొమ్మ దొరికేనమ్మ.. ఈ వాడలోన అంటూ.. పల్లెపదాలను మోసుకొచ్చింది. తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ వేడుకలు భాగ్యనగరంలో ఘనంగా మొదలయ్యాయి. కార్పొరేట్ కల్చర్‌లో బతుకుతున్న సిటీ స్త్రీలు.. పల్లెపడుచుల్లా కొంగు సవరించి మరీ బతుకమ్మ ఆటల్లో సందడి చేస్తున్నారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అని పాటలు అందుకున్నారు. నవ వేడుక బతుకమ్మ సందడి ఉండే తొమ్మిది రోజులకు తొమ్మిది చీరలు కొన్నాను. మా కుటుంబసభ్యులంతా ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అందరూ ఒక చోట చేరడం.. పాటలు పాడటం.. బతుకమ్మ ఆడటం.. ఎంతో సంతోషంగా ఉంటుంది. రోజుకో రకం ప్రసాదం తయారు చేసి ఒకరికొకరం ఇచ్చుకుంటాం. సమష్టితత్వం బలపడేందుకు బతుకమ్మ చక్కటి వేదిక. - సింధు, గృహిణి స్త్రీల రక్షణ పండుగ బతుకమ్మకు భూమికి, నీళ్లకు, ప్రకృతికి ఉన్న అనుబంధం విడదీయరానిది. అందుకే బతుకమ్మను సహజవనరుల సంరక్షణ ఉద్యమంగా ఆడుదాం. బతుకమ్మ ఆడవారి పండుగ. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు, భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా స్త్రీల సంరక్షణ పండుగగా ఈసారి బతుకమ్మ జరుపుకుందాం. ప్రతి ఊళ్లో ఓ గుట్టకు బతుకమ్మ గుట్టగా, వాగుకు బతుకమ్మ వాగుగా, కుంటకు బతుకమ్మ కుంటగా పేరు పెట్టి వాటి రక్షణకు చర్యలు తీసుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం. - విమలక్క, అరుణోదయ అధ్యక్షురాలు పుష్పవిలాసం కొమ్మకొమ్మకు పూసిన సన్నాయిలు అక్కడ కోకొల్లలు. బంతి పూల సొంపులు.. చేమంతుల గుంపులు.. గులాబీల గుట్టలు.. సంబరాల కనకాంబరాలు..! తనువెల్లా కాంక్రీట్ పరచుకున్న పట్నంలో బారులు తీరిన పూబాలల కేరింతలు అక్కడ కనిపిస్తాయి. అదే గుడి మల్కాపూర్ మార్కెట్. గౌరమ్మ ఒడి చేరి బతుకమ్మగా తీర్చిదిద్దడానికి తరలివచ్చిన బంతిపూలు మొదలు పల్లెవిరులైన గునుగు.. అడవిసిరులైన తంగేడు పూలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ పండుగ పేరుతో అయినా కొందరి బతుకులను తేలిక చేస్తుంది ఈ మార్కెట్. బెంగళూరు నుంచి బడాయిగా వచ్చిన లిల్లీ, గులాబీలు.. నాగ్‌పూర్ నుంచి వచ్చి నయగారాలొలికే బంతి, చేమంతులు.. బతుకమ్మ సిగలో దూరినా.. ఈ గడ్డ ముద్దుబిడ్డలైన గునుగు, తంగేడులు హత్తుకుంటేనే ఆ తల్లికి ఆనందం. అందుకే గునుగు, తంగేడు పూలమ్మే అమ్మలకు తొమ్మిది రోజులూ మంచి గిరాకీ. నగరశివార్ల నుంచి వచ్చి ఏడాదంతా కొత్తిమీర, ఆకుకూరలు అమ్మి పొట్టపోసుకునే వీళ్లకు ఈ తొమ్మిది రోజులే అసలైన పండుగ. రెక్కలు తెరిచి రెపరెపలాడుతున్న ధరలను తళతళమెరిసే నోట్లతో కట్టేసి.. పూలతో బుట్టలు నింపుకుని బతుకమ్మను అలంకరించే సంబురంలో పడిపోయారు హైదరాబాద్ ఆడవాళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బతుకమ్మ వేడుకలకు హైదరాబాదీలు ఘన స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించే బతుకమ్మ పండుగను వేడుకగా జరుపుకుంటున్నారు. తొమ్మిది రోజులు సాగే ఈ సామూహిక సందడి లో రోజుకో రీతిగా కనిపించడానికి తరుణులు తహతహలాడుతున్నారు. వన్నెచిన్నెలన్నీ ఉన్న చీరలు.. వాటికి సరిపోయే ఆభరణాలతో సిద్ధమవుతున్నారు. యువతుల విషయానికి వస్తే లంగావోణీలే ముద్దంటున్నారు. కాలనీల్లోని మహిళలంతా ఓ చోట చేరి రంగవల్లులు తీర్చి.. అందులో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి అదరగొడుతున్నారు. చేయి చేయి కలుపుతూ నృత్యాలు చేస్తున్నారు. బామ్మలు, వయసు పైబడిన మహిళలు బతుకమ్మ పాటలు పాడుతుంటే మిగతావారు వాటిని అనుస్వరిస్తూ పండుగ చేసుకుంటున్నారు. జంట బతుకమ్మ బతుకమ్మను జంటగా పేర్చడం ఆచారం. ఒకటి పెద్దగా, రెండోది చిన్నగా ఉంటాయి. పెద్ద పళ్లెంలో పేర్చిన బతుకమ్మను తల్లి బతుకమ్మ అని, చిన్న పళ్లెంలో పేర్చిన బతుకమ్మను పిల్ల బతుకమ్మ అని అంటారు. తల్లి బతుకమ్మ పక్కనే పిల్ల బతుకమ్మను పేరుస్తాం. తల్లీపిల్లలు ఎప్పటికీ విడిపోకుండా కలసి ఉండాలనే ఇలా చేస్తాం. ఈ రెండు బతుకమ్మలపై గౌరమ్మను ఉంచుతాం. ఈ తరం పిల్లలూ బతుకమ్మ పండుగపై ఉత్సాహం చూపిస్తున్నారు. పెద్దవాళ్ల దగ్గర బతుకమ్మ పాటలు కూడా నేర్చుకుంటున్నారు. - టి.సుశీల, కూకట్పల్లి పోటాపోటీ సిటీ యువతులకు ఆచారాలు, సంప్రదాయాలు తెలియవనుకుంటారు. ఏటా జరిగే బతుకమ్మ ఉత్సవం కోసం ఎదురు చూస్తుంటాం. పెద్ద బతుకమ్మలు తయారు చేసేందుకు మా స్నేహితులమంతా పోటీపడుతున్నాం. ఇప్పటికే బతుకమ్మ పాటలు నేర్చుకున్నాం. కాస్త తడబడ్డా పెద్దవారి పాటను అందుకుంటున్నాం. - సాహితి, లయోలా కళాశాల విద్యార్థిని రంగురంగుల కొమ్మ.. బతుకమ్మను పేర్చేందుకు పూల కోసం సిటీవాసులు చక్కర్లు కొడుతున్నారు. ఇరుగుపొరుగిళ్లకు వెళ్లి పూలు సేకరిస్తున్నారు. తంగేడు, గునుగు పూలు దొరకడం కష్టంగా ఉన్నా బంతి, చేమంతులతో బతుకమ్మను తీర్చిదిద్దుతున్నారు. గులాబీలు, మందారాలతో బతుకమ్మకు అదనపు సొబగులు అద్దుతున్నారు. - వాంకె శ్రీనివాస్ -
దాండియా బీట్స్
దాండియా ఆటలు ఆడ.. సరదా పాటలు పాడ.. అంటూ భాగ్యనగరం ఉత్సాహంతో ఊగిపోతోంది. దసరా నవరాత్రుల్లో సిటీని ఉత్సాహంలో ముంచెత్తడానికి దాండియా ఆట సిద్ధవువుతోంది. ఒత్తిడిని చిత్తు చేస్తూ ఉత్తేజాన్ని నింపుతున్న ఈ ఆట అందరికీ లేటెస్ట్ ఎంజాయ్‌మెంట్‌గా వూరింది. టీనేజర్ల నుంచి మేనేజర్ల వరకు అంతా దీనికే సై అంటున్నారు. ఆరోగ్యం అదనపు బోనస్‌గా వస్తోందని గృహిణులు, బిజినెస్ వుమెన్ సైతం దాండియూపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దాండియా నేర్పే శిక్షణ కేంద్రాలూ నగరంలో పెరిగారుు. ఇలా ఓ కేంద్రంలో దాండియా, గార్భా సాధన కోసం వచ్చిన మహిళలను పలకరిస్తే ఆసక్తికరమైన విషయాలను ‘సిటీ ప్లస్’తో పంచుకున్నారు. ‘దాండియాతో ఒత్తిడి దూరమవుతుంది. మనసూ ప్రశాంతంగా ఉంటుంది. దాదాపు నెలరోజుల పాటు ఈ నృత్యం చేయడం వల్ల మంచి ఫిట్నెస్ వస్తుంది. ఈ నెల 25 నుంచి జరిగే నవరాత్రి ఉత్సవాల్లో దాండియా ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అంటున్నారు ఆహార్ కుటీర్ రెస్టారెంట్ వర్కింగ్ పార్టనర్ అర్చన. చురుగ్గా కదలాల్సిన ఈ ఆటపై గృహిణులు, వృద్ధులు సైతం వుక్కువ చూపడం విశేషం. ‘కొన్ని నెలల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమైంది. ఫిజియో థెరపీ చేశారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే ఇబ్బందిగా ఉండేది. దాండియా సాధన వల్ల ఇప్పుడు చురుగ్గా నడవగలుగుతున్నా’ అంటూ ఇందులోని ఫిట్నెస్ మంత్ర గురించి చెప్పారు బేగంపేటలో ఉండే గృహిణి గీత. ఐదు పదులు దాటినా పట్టుదలతో దాండియూ నేర్చుకున్న లక్ష్మి (కూకట్పల్లి) నిజంగా యూత్‌కు స్ఫూర్తి. ‘నా వయస్సు 55 ఏళ్లు. దాండియా ప్రాక్టీసు వల్ల చిన్ననాటి ఎనర్జీవచ్చినట్టు అనిపిస్తోంది. ఆత్మవిశ్వాసంతో నేర్చుకున్నా’నని ఆమె ఆనందం నిండిన కళ్లతో చెబుతారు. సిటీజనులే కాదు.. వివిధ జిల్లాల నుంచీ అనేకవుంది దాండియూలో శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. అలా వచ్చినవారే శ్రీకాకుళంలోని హోటల్ నాగావళి జారుుంట్ మేనేజర్ రాధ. ‘దాండియూ ఆడితే నలుగురిలో గుర్తింపు రావడంతో పాటు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటాం. అందుకే ఇక్కడకు వచ్చా’ అన్నారామె. - వాంకె శ్రీనివాస్ -
కుర్సీతో మస్తీ
నిన్న మొన్నటి వరకూ ‘జుంబారె.. అ జుంబరే’ అంటూ జుంబా ఫిట్నెస్ క్లాసులకు పరుగులు తీసిన సిటీ జనులకు ఇప్పుడు సరికొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. జుంబాకు అప్డేటెడ్గా వచ్చిన ‘జుంబా సెంటావో’ ఎంజాయ్‌మెంట్‌తో పాటు ఎనర్జీని అందిస్తానంటోంది. కుర్చీలతో కుస్తీపడుతూ సాగిపోయే ఈ నృత్యాన్ని చైర్ డ్యాన్స్ అని కూడా పిలుస్తారు. బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు లయబద్దంగా కుర్చీలను తిప్పుతూ స్టెప్స్ వేయడమే జుంబా సెంటావో ప్రత్యేకత. దేశంలోనే తొలి మాస్టర్ క్లాస్ ఈ నెల 21న (ఆదివారం) వెస్టిన్ హైదరాబాద్ మైండ్ స్పేస్‌లో ‘హైదరాబాద్ ఫిట్నెస్ కార్నివాల్’ పేరుతో పలకరించనుంది. సిటీవాసులకు కొత్త నృత్యం పరిచయం చేస్తున్న జుంబా జామర్ అయిన జేగతా (జాగ్స్)తో ‘సిటీప్లస్’ ముచ్చటించింది. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న సిటీవాసులు ఎన్నో మార్గాలు అన్వేషిస్తున్నారు. కొందరు ఉదయాన్నే జాగింగ్ చేస్తున్నారు. ఇంకొందరు జిమ్ బాట పడుతున్నారు. అయితే జుంబా డ్యాన్స్ ఆడుతూ పాడుతూ ఫిట్నెస్ ఇస్తుందంటున్నారు జాగ్స్. జుంబా డ్యాన్స్‌కు మరిన్ని మెరుగులు దిద్దుకుని వచ్చిన ‘జుంబా సెంటావో’ బాడీని ఫుల్ ఫిట్‌గా ఉంచుతుందని హామీ ఇస్తున్నారామె. ‘రోజుకో గంట ఈ స్టెప్పులేస్తే చాలు.. బాడీలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ అంతు చూసేయొచ్చు. కష్టపడుతున్నామన్న ఫీలింగ్ లేకుండానే చెమటతో తడిసి ముద్దయి పోవచ్చు’ అని చెబుతున్నారు. ఫ్లోరిడా కన్వెన్షన్.. తన గురించి చెబుతూ భారత్‌లో లెసైన్సింగ్ కలిగిన జుంబా ఇన్స్ట్రక్టర్లకు శిక్షణ ఇస్తున్న జాగ్స్ ఇటీవల ఫ్లోరిడాలో జరిగిన ‘ఓర్లాండో జుంబా కన్వెన్షన్’ మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు జాగ్స్. ఐదు రోజులు సాగిన వర్క్‌షాప్‌కి భారత్ నుంచి 50 మంది వెళ్తే ప్రత్యేక ఆహ్వానం పొందిన ఇద్దరు భారతీయులలో ఈమె ఒకరు. ‘ఐదురోజులు సాగిన ఈ వర్క్‌షాప్‌లో జుంబాలో వస్తున్న న్యూ ట్రెండ్స్ గురించి తెలుసుకున్నా. జుంబా సెంటావోపై అవగాహన కలిగింది. జుంబా సెంటావో ట్రైనింగ్ సర్టిఫికెట్ రావడం హ్యాపీగా ఉంద’ని ఆమె వివరించారు. మలుపు తిప్పిన సిటీ ‘2010లో ఇండియా ఇంటర్నేషనల్ సల్సా కాంగ్రెస్‌లో విజయం సాధించా. అనేక అంతర్జాతీయ, జాతీయ సల్సా పోటీలను నెగ్గా. గోవా సల్సా ఫెస్టివల్లో హైదరాబాద్‌కు చెందిన జుంబా ఇన్స్ట్రక్టర్ కార్తికేయన్ కృష్ణతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. తర్వాత పెళ్లికి దారి తీసింది. గోవాకు చెందిన నేను ఆ తర్వాత దాదాపు మూడేళ్ల కిందట సిటీకి మకాం మార్చా. అప్పటికి నగరంలో జుంబాకు ఆదరణ అంతగా లేదు. ఈ డ్యాన్స్‌కు ఆదరణ పెంచాలని ఆరు నెలలు ప్లాన్ చేశారు. అలా 2012లో డ్యాన్స్ జాకీని ప్రారంభించాం. నగరంలోని మాల్స్‌లో ఫ్లాష్ మాబ్ నిర్వహించి జుంబాకు క్రేజ్ పెంచాం’ అని జాగ్స్ వివరించారు. డ్యాన్స్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తానంటున్న ఈ గోవా భామ.. జుంబా, సల్సాలోనూ సరికొత్త ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తానని చెప్పింది. నగరంలోని అనేక ఐటీ కంపెనీలు, కమ్యూనిటీలు, జిమ్‌లలో కూడా జుంబా ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు. జుంబాతో మంచి ఉపయోగం ‘జుంబా అనేది ఫిట్నెస్ ప్రోగ్రామ్. దీనికి సిటీలో మంచి క్రేజీ ఉంది. గంటపాటు ఆగకుండా డిఫరెంట్ స్టైల్స్‌తో డ్యాన్స్ చేయాలి. సల్సా బచాతా, మెరింగే చాచా స్టైల్స్‌తో పాటు బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు తగ్గట్టుగా స్టెప్పులేయడం వల్ల సుమారు 500 నుంచి 800ల కేలరీల శక్తి ఖర్చవుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. బరువు కూడా తగ్గుతుంద’ని జాగ్స్ భర్త కార్తికేయన్ కృష్ణ తెలిపారు. ఆదివారం జరిగే ‘హైదరాబాద్ ఫిట్నెస్ కార్నివాల్’లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు జ్ట్టిఞ://ఠీఠీఠీ.ఝ్ఛట్చ్ఛఠ్ఛ్టిట.ఛిౌఝలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. - వాంకె శ్రీనివాస్ -
అన్‌కట్ అదుర్స్
ఆభరణాలనేవి ఐశ్వర్యానికి ప్రతీకలుగా అన్పించేవేమోగానీ... ఇప్పుడలా కాదు. ఆధునిక పోకడలు పోతున్న నగరవాసుల దృష్టిలో అవి జీవనశైలికి ప్రతిబింబాలు. ధరించే దుస్తులైనా, ఆభరణాలైనా అభిరుచికి తగినట్లుగా ఉండాలని నవతరం కోరుకుంటోంది. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే ట్రెండ్‌ను ఫాలో అవుతోంది. ఇంట్లో జరిగే చిన్న శుభకార్యం నుంచి ఎంగేజ్మెంట్ల వరకు మహిళలు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక పెళ్లిళ్లైతే చెప్పనవసరం లేదు. జీవితంలో ఒకేసారి జరిగే పెళ్లిలో వధువు అందంగా, ఆకర్షణీయంగా ఉండేందుకు ధగధగలాడే నగలు ధరించేలా నగరవాసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి ఆసక్తిని బట్టి నగరంలోని జ్యువెలరీ సంస్థలు ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా నగల డిజైన్లను మారుస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో అన్‌కట్ డైమండ్ ఆభరణాలకు విపరీతమైన క్రేజ్. టెంపుల్ విత్ పచ్చి, రూబీ ఎంబ్రాల్డ్ సీజెడ్ (జిర్కాన్), వివిధ డిజైన్లతో కూడిన సరికొత్త వడ్డాణం, జడ, నెక్లెస్, షార్ట్ నెక్లెస్లపై కూడా సిటీవాసులు మోజు పెంచుకుంటున్నారు. ఏ పండుగ వచ్చినా ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్లలో ఏ జ్యువెలరీ షాపు చూసినా రద్దీగా కనిపిస్తుంటుంది. మధ్యతరగతి, సంపన్న కుటుంబాలు ఈ ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. హైదరాబాద్‌లోనే తయారీ సిటీవాసులను కట్టిపడేస్తున్న ఈ ఆభరణాలన్నీ నగరంలోనే తయారవడం విశేషం. ఇవన్నీ హ్యండ్‌మేడ్ నగలు. దీంతో ధర ఎంతైనా కొనుగోలు చేసేందుకు వెనకాడడం లేదు. మెరుగైన డిజైన్లు చేయగల అద్భుత అనుభవం నగరవాసుల స్పెషాలిటీగా చెప్పవచ్చు. ఇక్కడి నుంచే అన్‌కట్ డైమండ్, టెంపుల్ విత్ పచ్చి, రూబీ ఎంబ్రాల్డ్ సీజెడ్ (జిర్కాన్) తదితర ఆభరణాలను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దుబాయ్, అమెరికాలో ఈ జ్యువెలరీకి మంచి డిమాండ్. దక్షిణ భారతదేశంలో మంచి మార్కెట్ ఉంది. అష్టలక్ష్మీ లాకెట్, విష్ణు, కృష్ణా, గణేష్.. ఇలా దేవతల బొమ్మలతో వీటిని తయారు చేస్తున్నారు. కెంపులు పచ్చలతో నెక్లెస్, జడ, బెల్టులు రెడీ చేస్తున్నారు. ట్రెండ్‌ను ఫాలో అవుతున్నాం దేశవిదేశాల మధ్య పెరిగిన రాకపోకలు, ఇంటర్నెట్, టీవీ చానల్స్ తదితర మాధ్యమాలు అంతులేని ఫ్యాషన్లను కుమ్మరిస్తున్నాయి. ఈ క్రమంలో తాము ధరించే ఆభరణాల డిజైన్ సరికొత్తగా ఉండాలని కోరుకునే ఫ్యాషన్ ప్రియులు ఎక్కువయ్యారు. అందుకనుగుణంగానే అన్‌కట్ డైమండ్ తదితర ఆభరణాలను నగరంలోనే తయారు చేస్తున్నారు. సిటీవాసులు వీటినే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. - మహేందర్ తయాల్, అధ్యక్షుడు, హైటెక్ సిటీ జ్యువెలరీ మాన్యుఫాక్చర్స్ అసోసియేషన్ - - వాంకె శ్రీనివాస్ -
బురదలో సరదగా..
చదునైన రహదారిపై పరుగు కాదిది. దారి పొడవునా ఎగుడు దిగుళ్లే! ఏ దారి అయితేనేం? పరుగే కదా అని పొడి పొడిగా పెదవి విరిచేయడానికి కాదు. పరుగు తీయాల్సింది బురదమయమైన దారిలో. అడుగు తీసి అడుగేస్తే చాలు, అంతా తడి తడి చిత్తడి. అయినా సరే, బురదలో పరుగు తీయడంలోనే సరదా ఉందంటున్నారు ఔత్సాహిక సిటీజనులు. అలాంటి వారి కోసమే గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచరీ క్లబ్ (జీహెచ్ఏసీ) ‘హైదరాబాద్ మడ్న్’్ర మెగా ఈవెంట్ నిర్వహించనుంది. ఇందులో పాల్గొనేవారు బురదతో నిండిన ట్రాక్‌పై రెండు కిలోమీటర్ల దూరం పరుగు తీయాల్సి ఉంటుంది. ఈ పరుగులో నీటిగుంతలు, సొరంగాలు, గోడలు, వంతెనలు, టార్జాన్ స్వింగ్, బెల్లీ క్రాల్, టైర్ ఫీల్డ్ వంటి పాతిక అవరోధాలను అధిగమించాల్సి ఉంటుంది. సమయంతో నిమిత్తం లేకుండా, విజయవంతంగా రెండు కిలోమీటర్ల పరుగు పూర్తి చేసుకున్న వారందరూ పతకాలు, ప్రశంసా పత్రాలు పొందవచ్చు. నడవొచ్చు.. పాకొచ్చు.. ఎగిరెగిరి దూకొచ్చు.. బురద పరుగులో (మడ్ రన్) కొన్నిచోట్ల ఆచితూచి నడుచుకుంటూ వెళ్లొచ్చు. మరికొన్ని చోట్ల సొరంగాల గుండా బురదగుంతల్లో పాకొచ్చు. ఇంకొన్ని చోట్ల ఎగిరెగిరి దూకొచ్చు. మొత్తానికి పడుతూ, లేస్తూ... అడ్డంకులను దాటుకుంటూ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. లక్ష్యాన్ని చేరుకునేలోగా ఒళ్లంతా బురదమయంగా మారుతుంది. ఇదో సరదా. లక్ష్యాన్ని చేరుకున్నా, చేరుకోలేకున్నా... మొత్తానికి మడ్ రన్ భలే ఫన్ అంటున్నారు సిటీజనులు. వాక్బ్రిడ్జ్: రెండు చెట్ల మధ్య కట్టెలతో ఏర్పాటు చేసిన ఈ రోప్‌బ్రిడ్జ్ మీదుగా నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. రెండున్నర అడుగుల ఎత్తునున్న ఈ బ్రిడ్జి పైనుంచి జారిపడినా, కిందనున్న బురద కారణంగా గాయాలు తగలవు. 14న పరుగెడదాం.. రండి గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన మడ్న్ ్రనిర్వహిస్తున్నారు. ఇందులో ఎనిమిదేళ్లు పైబడిన వారు పాల్గొనవచ్చు. పదమూడేళ్ల లోపు పిల్లలు తమ పేరెంట్స్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలసి రావడం వల్ల మడ్న్న్రు ఎంతో ఎంజాయ్ చేయవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1250. hyderabadmudrun.com లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం 9849011006, 040-68888197 నంబర్లలో సంప్రదించవచ్చు. పటాన్చెరు-శంకరపల్లి రోడ్డులోని లహరి రిసార్ట్స్‌లో ఆదివారం ఉదయం 7 గంటలకు ఈ మెగా ఈవెంట్ ప్రారంభమై, సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. టార్జన్ స్వింగ్: చెట్టుకు కట్టిన లావాటి తాడు కిందనున్న బురదగుంతలో వేలాడుతూ ఉంటుంది. ఆ తాడును పట్టుకుని, బురదగుంతను దాటి ముందుకు దూకాల్సి ఉంటుంది. తాడుకు, గుంతకు మధ్య మూడడుగుల దూరమే ఉండటంతో కిందపడితే ఒళ్లంతా బురదమయమవుతుంది. కమాండో నెట్: లావాటి తాడుతో వలలా తయారు చేసి, ‘ఏ’ ఆకారంలో ఉంచుతారు. దీని నుంచి రన్నర్స్ ఎక్కి దిగాల్సి ఉంటుంది. అప్పటికే బురదమయంగా మారిన రన్నర్స్ ఈ ప్రక్రియలో పట్టుజారి కింద పడుతుంటారు. ఇది పోటీ క్రీడ కాకపోవడంతో అందరూ పడుతూ లేస్తూ ఎంజాయ్ చేస్తారు. టైర్ ఫీల్డ్: భూమి మీద అరడుగు మందాన బురద ఉంటుంది. అక్కడక్కడా టైర్లు వేసి ఉంచుతారు. రన్నర్స్ ఈ టైర్ల మధ్యలో కాలు పెట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అటు బురద, ఇటు టైర్ మధ్యలో నుంచి వెళ్లటం భలే తమాషాగా ఉంటుంది. ఇక జారుడుబండ మీద నుంచి జారి కింద బురదలో పడటం వెరైటీ థ్రిల్ కలిగిస్తుంది. మడ్ రన్ అంటే సిటీ గుర్తొచ్చేలా.. మడ్ రన్లో సుమారు వెయ్యి మంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నాం. 2012లో తొలిసారి మెదక్‌లోని సంగారెడ్డిలో, 2013లో లహరి రిసార్ట్స్‌లో నిర్వహించాం. వచ్చే మూడేళ్లలో దీనిని నేషనల్ ఈవెంట్‌గా మారుద్దామనుకుంటున్నాం. ప్రస్తుతం పుణే, హైదరాబాద్‌లలో మాత్రమే నిర్వహిస్తున్నాం. మడ్ రన్ అంటే సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్‌గా అందరికీ తెలిసేలా కృషి చేస్తున్నాం. - సురేశ్, కో-ఆర్గనైజర్, గ్రేటర్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ రోప్ ట్రవర్స్: భూమికి రెండడుగుల పైన ఒక తాడు.. ఆ తాడుకు మరో రెండడుగులపైన ఇంకో తాడు. మొదటి తాడుపై కాలుపెట్టి, రెండో తాడును చేతపట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. పట్టుతప్పి జారిపోతే, కింద ఏర్పాటు చేసిన చిన్నసైజు కాలువలో పడొచ్చు. అందులో మోకాలి లోతు నీళ్లు మాత్రమే ఉంటాయి. ఈత రాకున్నా, ఎలాంటి ప్రమాదం ఉండదు. భద్రత: ప్రతి అవరోధం వద్ద మెయిన్ మార్షల్స్, ముగ్గురు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారు. ఒకవేళ ఎవరికైనా కళ్లలో మట్టి పడినా, చిన్న గాయాలైనా ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినందున పెద్ద గాయాలయ్యే అవకాశాల్లేవు. అయితే.. అంబులెన్స్ కూడా ఉంటుంది. - వాంకె శ్రీనివాస్ -
జూనియర్ ‘రాకెట్’
చిన్నప్పటి చలాకీతనం ఆమెను టెన్నిస్ కోర్టు వైపు అడుగులు వేరుుంచింది. ఆరేళ్ల వయుసులోనే ప్రాంజలకు రాకెట్ మీద వునసైంది. ఇది గ్రహించిన తల్లిదండ్రులు ఆర్థికంగా భారవునిపించినా ఆ చిన్నారిని ప్రోత్సహించారు. దీనికి కోచ్ సంజయ్ ప్రోద్బలం తోడవడంతో ప్రాంజల సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ప్రతి టొర్నీలో తానేంటో రుజువు చేసుకుంది. ఆమె ఆటతీరుకు ఫిదా అరుున జీవీకే గ్రూప్ స్పాన్సర్‌గా వుుందుకొచ్చింది. అలా మొదలైన ప్రాంజల టెన్నిస్ జర్నీ ఇప్పుడు దేశవిదేశాల్లోని టెన్నిస్ కోర్టుల్లో దువుు్మరేపుతోంది. హైదరాబాద్ పేరుప్రఖ్యాతులు ఖండాంతరాలు చాటుతోంది. ఓ టోర్నీలో పాల్గొనడానికి ఈజిప్ట్‌కు బయుల్దేరేవుుందు ఈ జూనియుర్ రాకెట్‌ను ‘సిటీప్లస్’ పలకరించింది. నేను పుట్టింది గుంటూరులో అరుునా పెరిగింది వూత్రం హైదరాబాద్‌లోనే. పదిహేనేళ్ల కిందటే వూ కుటుంబం సిటీకి వచ్చి సెటిలైంది. నాన్న కిషోర్ బిజినెస్మెన్, అవ్ము వూధవి గృహిణి. నాకు టెన్నిస్ అంటే ఇష్టం. ఆరేళ్లున్నపుడు సంజయ్ టెన్నిస్ అకాడమీలో చేర్పించారు. కోచ్ సహకారంతో ఆట మీద ఆసక్తి ఇంకా పెరిగింది. ‘కష్టపడితే భవిష్యత్‌లో వుంచి క్రీడాకారిణి అవుతావు’ అన్న ఆయున వూటలు నన్ను ఆటకు వురింత దగ్గర చేశారుు. 2012 నుంచి ఐటీఎఫ్ జూనియుర్ టోర్నీలు ఆడటం మొదలుపెట్టాను. అదే టైంలో జీవీకే టెన్నిస్ అకాడమీ నా ప్రతిభను గుర్తించి చేయుూతనిచ్చింది. శిక్షణతో పాటు టోర్నమెంట్లలో పాల్గొనేందుకు స్పాన్సర్ చేస్తోంది. జీవీకే అకాడమీ కోచ్ ఇలియూస్ గౌస్ గైడ్ చేస్తున్నారు. ఆరు గంటల ప్రాక్టీస్.. క్రీడల్లో రాణించాలంటే ఫిట్నెస్ ప్రధానం. ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకునే సావుర్థ్యం ఉండాలి. అందుకు తగ్గట్టే శారీరక వ్యాయూవుంతో పాటు వుంచి ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, ఎనర్జీటిక్ డ్రింక్స్‌కు ప్రాధాన్యమిస్తాను. ప్రతి రోజూ ఉదయుం వుూడు గంటలు, సాయుంత్రం వుూడు గంటలు ప్రాక్టీస్ చేస్తుంటాను. టోర్నీ సవుయూల్లో ప్రత్యర్థుల బలాబలాలు, ఆటతీరు ఆధారంగా నా శైలిని వూర్చుకుంటాను. సిటీలో విక్టరీ.. నా కెరీర్లో ఇప్పటి వరకు 59 సింగిల్స్, 18 డబుల్స్ వ్యూచ్లలో విజయుం సాధించాను. ఈ ఏడాది 22 సింగిల్స్, ఆరు డబుల్స్‌లో విన్ అయ్యూను. గత జనవరిలో చంఢీగడ్‌లో జరిగిన ఐటీఎఫ్ జూనియర్స్ గ్రేడ్ -3 టోర్నీ విజయాన్ని నాకెంతో ఆనందాన్నిచ్చింది. నా కెరీర్లో నేను దక్కించుకున్న తొలి ట్రోఫి అది. జర్మనీలో బోహమ్, ఫ్రాంక్ఫర్ట్, బెర్లిన్, నెదర్లాండ్స్‌లోనూ గ్రేడ్-1, గ్రేడ్-2 టోర్నీల్లో పూర్తిస్థాయిలో రాణించలేకపోయాను. గతనెల చైనాలో జరిగిన టోర్నీలోనూ క్వార్టర్ ఫైనల్స్ వరకు వూత్రమే చేరుకున్నాను. అరుుతే హైదరాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్ జూనియుర్ టోర్నీ అండర్-18 బాలికల సింగిల్స్ టైటిల్ దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఈజిప్ట్ టోర్నీలో కూడా విజయుం సాధిస్తానన్న నవ్ముకం ఉంది. ఎప్పటికైనా గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవడమే నా ల క్ష్యం. గోల్కొండ ఇష్టం.. టైం దొరికితే పుస్తకాలు చదువుతుంటాను. టీవీలో స్పోర్ట్స్ ఎక్కువగా చూస్తుంటాను. ఫెడరర్, కిమ్ క్లియ్‌స్టర్స్ నాకు ఇష్టమైన క్రీడాకారులు. చిన్మయు విద్యాలయు నుంచి పదో తరగతి పరీక్షలు రాసి పాసయ్యూను. అదే కళాశాలలో ఇంటర్లో జారుున్ అయ్యూను. హైదరాబాద్‌లో గోల్కొండ కోట అంటే చాలా ఇష్టం. - వాంకె శ్రీనివాస్ -
వాండర్ టీమ్
వారు గ్రామీణ నేపథ్యమున్న విద్యార్థులు. అయితేనేం వారి ప్రతిభ గగనతలంలో ఘనతను చాటింది. ఉరిమే ఉత్సాహం ఊరికే ఉండనీయలేదు. ఏదైనా సాధించాలన్న తపన ఎప్పుడూ వెంటాడేది. మదిలో పుట్టిన ఓ ఐడియా వారి జీవితాన్నే మార్చింది. సినిమాలు, షికార్లకు గుడ్ బై చెప్పి ఆలోచనకు జీవం పోశారు. చదువుకుంటూనే నూతన ఆవిష్కరణకు నాంది పలికారు. పట్టుదలే పెట్టుబడిగా ముందుకు సాగారు. అంతే! వారి ఆశల ప్రతిరూపం.. ఎయిర్‌క్రాఫ్ట్ గగనతలంలో రయ్యిమంటూ దూసుకెళ్లింది. వారే శ్రీనిధి ‘సెవెన్ వండర్స్’... కటకం సంతోష్, సముద్రాల సంతోష్, ఎం.ధీరజ్, టీవీకే సుభాష్, ఎస్.రాకేశ్, టి.అమిత్, వివేక్ జైశ్వాల్. వరంగల్ జిల్లా మర్రిపెడ బంగ్లాకు చెందిన కటకం సంతోష్ టీమ్ లీడర్. రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లోని శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్. 16 నెలలపాటు శ్రమించారు. 360 కిలోలు ఉండే ‘మాక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్’ను తయారు చేశారు. భూతలం నుంచి సుమారు కిలోమీటర్ ఎత్తులో ఎగరగలదు. ‘డీజీసీఏ అధికారులు మా ఫ్యాబ్రికేషన్‌లో ఏ లోపం లేదని నిర్ధారించి సర్టిఫికెట్ ఇస్తారనుకుంటున్నాం. పరికరాలకు అవసరమైన డబ్బు మేమే సమకూర్చుకున్నాం. వ్యయప్రయాసలకోర్చి సమన్వయం చేసుకుంటూ సక్సెస్ సాధించాం’ అన్నాడు కటకం సంతోష్. మార్చిన ‘మూడు’... ఇంజనీరింగ్ తొలి రెండేళ్లు సరదాగా గడిచింది. ఎంజాయ్ చేశారు.ఎక్కడికెళ్లాలన్నా ఈ ఏడుగురే ముందుండేది. సినిమాలు, షికార్లు మామూలే. ఏదో చేయాలన్న తపన కొత్త ఆలోచనకు పురికొల్పింది. దీని నుంచి ఉద్భవించిందే ‘మాక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్’. పైసాపైసా పోగేసి అనుకున్నది సాధించారు. లక్ష్యాన్ని ఛేదించారు. బుల్లి విమానాన్ని గగనతలంలో విహరింపజేసేందుకు సిద్ధమయ్యారు. తయారీ ఇలా.. ‘టాటా నానో ఇంజిన్ 624 సీసీ, 38 పీఎస్, ట్రాస్ అల్యూమినియం పైప్‌లు వాడాం. బెంగళూరు నుంచి అల్యూమినియం అల్లాయ్ టైర్లు, ప్రొఫెల్లర్ బ్లేడ్(ఫ్యాన్) తెప్పించాం. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి బెంగళూరులోని ఏవియేషన్ సిస్టమ్స్ వాళ్లని కలిసి ఎలా పని చేయాలనే సలహాలు తీసుకున్నాం. గూగుల్ సెర్చ్ చేసి టెక్నిక్స్ నేర్చుకున్నాం. డిజైనింగ్ క్యాటియా అన్సిస్లో చేశాం. బాడీ లిఫ్ట్ ఫోర్స్ కోసం లో స్పీడ్ వింగ్ ప్రొఫైల్ వాడాం. లెఫ్ట్, రైట్ వింగ్ లెంత్ 12 ఫీట్. వింగ్ స్పాన్ 26.5 ఫీట్. టోటల్ బాడీ వెయిట్ 365 కేజీలు. పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ 25 లీటర్లు,’ అని సంతోష్ వివరించాడు. ‘ప్రస్తుతం మాక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రన్‌వేపై నడుపుతున్నాం. ఇన్నాళ్లు మేం పడిన శ్రమకు ఫలితం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. ఆశించిన మేరకు కాలేజీ యాజమాన్యం ప్రోత్సహించింది. మా తల్లిదండ్రులు వెన్నుతట్టి ముందుకు నడిపించారు. వీరందరి ఆశీస్సులు, బాసటగా నిలువడం వల్లే ఈ రోజు ఎయిర్‌క్రాఫ్ట్ తయారు చేయగలిగాం’ అని టీమ్ మరో సభ్యుడు వివేక్ జైశ్వాల్ తెలిపారు. - వాంకె శ్రీనివాస్ -
నమ్మితే ఏదైనా చేస్తా: అనుష్క
చిట్‌చాట్: తాను నమ్మితే ఏదైనా చేసేస్తానంటోంది అందాల తార అనుష్క. సినిమా విషయంలో ఎలాగైతే కథ, కథనాలు విని నచ్చితేనే ఓకే చేస్తానో.. కెమెరా బాగుందంటేనే మొబైల్స్‌కు ఓకే చెప్తానంటోంది. ఫీచర్స్ నచ్చి తనకు నమ్మకం కుదిరితేనే.. ఆ సెల్‌ఫోన్ కొంటానని తెలిపింది ఈ అభినవ రుద్రవుదేవి. ఇంటెక్స్ మొబైల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అనుష్క శెట్టి శనివారం నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్లో జరిగిన ఆక్వా స్టైల్ ప్రోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనుష్క ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. టాలీవుడ్ ముచ్చట్లు చెప్పడానికి నో అన్న ఈ అమ్మడు.. ఒక కంపెనీ ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఇదేం తొలిసారి కాదని చెప్పుకొచ్చింది. ‘నా వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఇష్టపడతా. నాకు అన్నివిధాలా ఆ కంపెనీ ప్రొడక్ట్స్ నచ్చితేనే అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ఓకే చెబుతా’నని అంటోంది. అభిమానుల ఆదరణతోనే తను టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకోగలిగానని ముసిముసినవ్వులు చిందించింది. - వాంకె శ్రీనివాస్ -
సరదాగా ప్రీడమ్ రైడ్
స్వతంత్ర దినోత్సవ వేళ సిటీలో సైక్లింగ్ సందడి కనిపించింది. గచ్చిబౌలి స్టేడియంలో ద అట్లాంటా ఫౌండేషన్, వొడాఫోన్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన ఫ్రీడమ్ రైడ్‌లో పదివేల మందికిపైగా సైకిల్ రైడర్లు పాల్గొన్నారు. ఆరేళ్ల బుడతల నుంచి అరవై ఏళ్ల సీనియుర్ సిటిజన్ల వరకు అందరూ సైకిల్ రైడ్‌లో సరదాగా కదిలారు. 67 కిలోమీటర్ల ఈ రైడ్‌ను ఐటీ వుంత్రి కేటీఆర్, క్రికెటర్ ప్రజ్ఞా ఓజా, సినీనటి మంచు లక్ష్మి ప్రారంభించారు. ‘స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ నేషన్’ అంటూ ప్రత్యేకంగా మహిళా సైక్లింగ్ టీమ్, స్ట్రాంగ్ యూత్, స్ట్రాంగ్ నేషన్ అంటూ ప్రత్యేకంగా చిన్నారుల టీమ్‌లు పాల్గొన్నాయి. ప్రొఫెషనల్ సైక్లిస్ట్ల కోసం ‘టఫ్ క్రిటేరియం’ను నిర్వహించారు. గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభమైన ఈ సిగ్నేచర్ రైడ్ మలేసియా టౌన్షిప్, ఇనార్బిట్ మాల్, లంగర్‌హౌస్ రోడ్, హిమాయత్ సాగర్ లేక్, వీఐఎఫ్ కాలేజీ మీదుగా మైక్రోసాఫ్ట్ వరకు సాగింది. - వాంకె శ్రీనివాస్ -
కర్టసీ షూపుదాం
ఒక ఆలోచన పరిస్థితులను మార్చే ప్రయత్నం చేస్తుంది.. నలుగురు కలసి నడిస్తే.. దారిలో ఒకరి ఇబ్బంది మరొకరిని కదిలిస్తుంది. సామూహిక చైతన్యంగా మారి.. ఇంకొందరికి చేయూతనిస్తుంది. అందరూ కలసి ఒకటిగా అడుగేస్తే.. తడబడు అడుగులు కూడా పరుగెత్తుతాయి. ఇలాంటి ఆలోచనే హైదరాబాద్ రన్నింగ్ సభ్యులకు వచ్చింది. ఏటా నిర్వహించే మారథాన్ పరుగు పందెంలో షూలు లేకుండా పరుగెత్తుతున్న వారి కోసం.. ఓ సామాజిక మార్పునకు శ్రీకారం చుట్టింది. మారథాన్.. ఈ సుదీర్ఘ పరుగుపందెంలో పాల్గొనేందుకు అందరూ ఉత్సాహం చూపిస్తుంటారు. అందులో ఉన్నవారే కారు.. లేనివారు ఉంటారు. ఈ పందెంలో రంగురంగుల బూట్లతో పరుగెత్తే వారే కాదు.. షూలు లేకుండా పాల్గొనే వారు కూడా క నిపిస్తారు. సామాజిక స్పృహ నింపే వేదికగా ఉన్న మారథాన్‌లో కనిపిస్తున్న ఈ వ్యత్యాసాన్ని రూపుమాపాలని హైదరాబాద్ రన్నింగ్ సభ్యులు నిర్ణయించుకున్నారు. అందుకోసమే పాత షూ జోళ్లను సేకరించడం మొదలుపెట్టారు. యూజ్ అండ్ డొనేట్.. నగరంలో షూ వాడకం పెరిగిపోయింది. ఎమ్ఎన్సీల రాకతో కార్పొరేట్ సంస్కృతి విస్తరిస్తోంది. ప్రపంచ పోకడలకు తగ్గట్టు ముస్తాబవుతూ.., ఏటా షూలను మార్చేసే కుర్రకారు పెద్దసంఖ్యలోనే ఉన్నారు. కొత్త బూట్ల రాకతో.., పాతవాటిని బయట పడేయడం ఇష్టం లేక.. ఇంట్లో దాచుకోలేక ఇబ్బంది పడుతుంటారు. వీరికిప్పుడో పరిష్కారం చూపుతోంది హైదరాబాద్ రన్నర్స్ క్లబ్. ఇంట్లో వృథాగా పడిఉన్న బూట్లను కొన్ని మరమ్మతులు చేసి అవసరమైన వారు వినియోగించే మార్గాన్ని ఏర్పాటు చేసింది. టార్గెట్ యూత్.. సామాజిక అనుసంధాన వేదిక ప్రచారంతో పాటు యువత ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చూస్తున్నారు హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ సభ్యులు. మూడేళ్లుగా పాత షూలు సేకరిస్తున్నారు. ఈ సారి కూడా కళాశాల విద్యార్థులు, ఆన్లైన్ వేదికతో పాటు నగరంలోని షాపర్స్ స్టాప్ సూపర్ మార్కెట్, రిలయన్స్ ఫుట్ ప్రింట్లలోనూ ‘పాత షూ సేకరణ’ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇలా సేకరించిన బూట్లను మారథాన్‌లో పాల్గొనే బూట్లు లేనివారికి అందించనున్నారు. మిగతా వాటిని స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా నిరుపేద విద్యార్థులకు అందించేలా ప్లాన్ చేశారు. కాస్త పనికొచ్చినా ఓకే.. పనికొచ్చే ఏ తరహా షూ జోళ్లనైనా తీసుకుంటాం. మారథాన్‌లో షూ లేకుండా వచ్చేవారికి అందిస్తాం. మిగిలిన వాటిని డాన్‌బాస్కో ఎన్జీవో, వివేకానంద విద్యా వికాస కేంద్రం, ఓం సాయి సేవాశ్రమానికి చేరవేస్తాం. ఇతర నగరాల నుంచి మారథాన్‌లో పాల్గొనేవారు పరుగు ముందురోజు కిట్ పొందే ఎక్స్‌పోలో ఇస్తే సరిపోతుంది. - నవీన్, హైదరాబాద్ రన్నర్ సభ్యుడు విస్తృత ప్రచారం.. యువతరం ఎక్కువగా వచ్చే స్పెన్సర్ రిటైల్ అవుట్‌లెట్స్, రిలయన్స్ ప్రింట్స్‌లలో షూ కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేశాం. కళాశాలల్లోనూ వీటి సేకరణకు సంబంధించి ప్రచారాన్ని మొదలుపెట్టాం. ఈ సేకరణలో ఐదు విద్యాసంస్థలు భాగస్వామ్యం అయ్యాయి. - జయభారతి, హైదరాబాద్ రన్నర్ మెంబర్ కలెక్షన్ పాయింట్లు ఇవే.. ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూషన్స్, సెయింట్ మేరీస్. ముఫకం జా కాలేజి, రూట్ బిజినెస్ స్కూల్, ఐసీబీఎం బిజినెస్ స్కూల్ స్పెన్సర్ రిటైల్ అవుట్‌లెట్స్ ముషీరాబాద్, గచ్చిబౌలి, అత్తాపూర్, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్‌పేట రిలయన్స్ ఫుట్‌ప్రింట్స్ సోమాజిగూడ, హిమాయత్‌నగర్, కూకట్పల్లి, మదీనాగూడ, కార్ఖానా, ఏఎస్రావు నగర్ - వాంకె శ్రీనివాస్ -
బంజారా మేళా
సరికొత్త వస్త్రాభరణ శ్రేణులు నగరవాసులకు కనువిందు చేస్తున్నాయి. రంగురంగుల చీరలు... వెరైటీ నగలు మగువ మనసు దోస్తున్నాయి. రామ్‌కోఠి కచ్చిభవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘బంజారా మేళా’లో ఇలాంటివెన్నో ఆకర్షణీయంగా ఉన్నాయి. శనివారం కూడా కొనసాగే ఈ మేళాలో వీటితోపాటు గృహోపరకరణ వస్తువులు, యాక్ససరీస్ కొలువుదీరాయి. అందాల తార ఇషికాసింగ్ (హృదయ కాలేయం) ప్రత్యేక ఆకర్షణ. ఈ సందర్భంగా ఇిషిక ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. ‘నాన్‌వెజ్ ఫుడ్ ముట్టను. ఓ ప్రాణిని చంపి తినడం నాకు ఇష్టం ఉండదు. మా ఫ్యామిలీ అంతా పక్కా శాకాహారులు. మాది రాజస్థాన్. అమ్మానాన్న ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాం. ఇక్కడే కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ చదివా. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్ పూర్తి చేశా. మోడలింగ్‌పై ఆసక్తి. హృదయ కాలేయం సినిమాలో అవకాశం వచ్చింది. వెంటనే ఓకే చెప్పేశా. ఇప్పుడు మహేశ్ కత్తి దర్శకత్వంలో పెసరట్టు సినిమాలో చాన్స్ వచ్చింది. తమిళంలో పెరుమాన్, పంజాబ్‌లో సెహద్, ఇంగ్లిష్‌లో వెయిటింగ్ ఇన్ వెల్డర్‌నెస్ మూవీస్ చేశా’ అంటూ చెప్పుకొచ్చింది ఇషిక. - వాంకె శ్రీనివాస్ -
నేల విడిచి సాగు
పూలు పూసే మొక్కలంటే అందరికీ ఇష్టమే. ఉదయం లేవగానే బాల్కనీలో ఉన్న గులాబీ మొక్కకు ఓ పువ్వు కనిపిస్తే... ఓ ఆనందం. టై పైకి పాకిన మల్లెతీగను చూస్తే ఓ సంతోషం. అయితే మక్కువతో మొక్కలు పెంచాలనుకున్న వారికి మెట్రో సిటీలో స్థలాభావం ప్రధాన ఇబ్బంది. అపార్ట్మెంట్లలో మట్టి లభించడం మరో సవుస్య. అనువుగాని చోట మొక్కలెందుకని హోమ్ గార్డెనింగ్‌కు దూరమవుతున్న వారికి ‘పాటింగ్ మిక్స్’ వరంగా మారింది. దీనివల్ల వుట్టి లేకుండానే ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకునే అవకాశం కలుగుతుంది. విరబూసిన పూలతో ఉన్న మొక్కలను ఎంత సేపరుునా చూస్తూ ఉండిపోవచ్చు. పల్లెవాసికి ఇవి పాత అందాలే అరుునా, మెట్రో నగరాల్లో.. అందునా ఆకాశాన్నంటే అపార్ట్మెంట్లలో ఉంటున్న వారికి వూత్రం ఆ భాగ్యం లేకుండా పోతోంది. ప్రకృతి అందాలకు చోటు ఇవ్వలేక.. పూబాలల సోయుగాన్ని మిస్ అవుతున్నారు. ఇరుకుగా ఉన్న బాల్కనీనే చిన్నపాటి ఉద్యానంగా వూర్చుకునే వారూ ఉన్నారు. అరుుతే వుట్టి కుండీలను మెరుుంటేన్ చేయులేక.. మొక్కల పెంపకానికి దూరం అవుతున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని ‘మహాగ్రో’ అనే కంపెనీ తయారు చేసిందే పాటింగ్ మిక్స్. మట్టి లేకుండా మొక్కలను పెంచే ఈ మిక్స్ ఎందరినో ఆకర్షిస్తోంది. డిమాండ్ ఎందుకంటే... తక్కువ స్థలం ఉండే అపార్ట్మెంట్లలో మట్టితో పని లేకుండా పాటింగ్ మిక్స్‌తో మొక్కలు పెంచవచ్చు. మార్బుల్, ఖరీదైన ఫ్లోరింగ్‌పై ఎలాంటి మరకలు పడకపోవడంతో ఈ మిక్స్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. మట్టితో పోలిస్తే ఇది ఐదు రెట్లు తేలికగా కూడా ఉంటుంది. దీంతో కుండీలను ఒక చోటు నుంచి మరో చోటికి తరలించడం సులభమవుతుంది. అందుకే పాటింగ్‌మిక్స్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇక్రిశాట్లో జొన్నపంట కోసం పాంటింగ్ మిక్స్‌నే వాడుతున్నారు. డీఆర్డీవో, మోన్శాంటో, నేషనల్ పోలీసు అకాడమీ, గౌతమ్ మోడల్ స్కూల్స్ కూడా ఈ మిక్స్‌నే వాడుతున్నాయి. ఈ సాగు చేయాలనుకునేవారు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 సురభి ఎన్‌క్లేవ్‌లోని మహాగ్రో హార్టిటెక్‌ను సంప్రదించవచ్చు. ఏమిటీ పాటింగ్ మిక్స్! కోకోపీట్, సేంద్రియ ఎరువు, వర్మిక్యులేట్ (మొక్కల వేళ్లకు గాలి బాగా అందేలా చేస్తుంది) మిశ్రమమే ఈ పాట్ మిక్స్. వారానికి ఒకసారి నీళ్లు పోస్తే చాలు. మొక్కలకు తెగుళ్లు వచ్చే అవకాశాలూ చాలా తక్కువ. ఎరువుల అవసరం కూడా ఉండదు. ఏడాదిన్నర తర్వాత మొక్క కుండీ పరిమితిని దాటి పెరుగుతుంది. అప్పుడు దానిని వేరే దానిలోకి మార్చుకుంటే సరిపోతుంది. అందరీ సమస్య అనుకున్నాం... మాది బందరు. మా అమ్మ గిరిజ లక్ష్మికి మొక్కలంటే ప్రాణం. హైదరాబాద్ వచ్చాక అపార్ట్మెంట్లో ఉండేవాళ్లం. చిన్న బాల్కనీలో, మా అమ్మ మట్టి కుండీలు తెప్పించి మొక్కలు పెట్టింది. వాటికి నీళ్లు పోస్తే ఇల్లంతా బురదే! పైగా నీళ్లు కింది ఇంటి బాల్కనీలోకి వెళ్తే వాళ్లతో తగాదా. నాలుగు రోజులు ఊరికి వెళ్తే మొక్కలన్నీ తోటకూర కాడల్లా వాడిపోయేవి. అపార్ట్మెంట్లలో ఉండే ప్రతి ఒక్కరిదీ ఇదే సమస్య అని భావించిన మా అమ్మ.. దీని పరిష్కారం ఆలోచించింది. అదే పాటింగ్ మిక్స్ తయారీకి కారణమైంది. కోకోపీట్, సేంద్రియ ఎరువు, వర్మిక్యులేట్ వివిధ పాళ్లలో కలిపి వాటితో మొక్కలు పెంచాం. మొదట్లో లోపాలు కనిపించాయి. నిపుణుల సలహాలు తీసుకున్నాం. 170 ప్రయోగాల తర్వాత మా ప్రయత్నం ఫలించింది. 2012లో పాటింగ్ మిక్స్‌కు అంకురార్పణ జరిగింది. దీన్ని ల్యాబ్ టెస్ట్‌కి పంపిస్తే.., మొక్కల పెంపకానికి ఉపయోగపడే పాట్ మిక్సింగ్‌గా గుర్తించారు. అనతి కాలంలోనే మా మిక్స్‌కు మంచి ఆదరణ లభించింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాం. అమ్మ ఇప్పటికీ అమెరికాకు వెళ్లి మొక్కల పెంపకం సులభతరం చేయడంపై అధ్యయనం చేస్తోంది. మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నా. - మహాగ్రో సీఈవో కృష్ణకార్తీక్ - వాంకె శ్రీనివాస్ -
గూడు రిక్షా మరువలేను..
జ్ఞాపకం: స్నేహితులతో ‘అందాల రాముడు’ చూస్తూ ఆస్వాదించిన రోజులు... పిల్లలతో కలసి డబుల్‌డెక్కర్ బస్సు ఎక్కి తానూ పిల్లాడైపోవడం.. రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ సముద్రాల గోవిందరాజులుకు హైదరాబాద్‌తో ముడిపడిన స్మృతులు. హరివిల్లులాంటి నుమాయిష్లాగే నగరం భిన్న సంస్కృతుల నిలయం అంటున్న జస్టిస్ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే... 1973 సెప్టెంబర్‌లో తొలిసారి హైదరాబాద్‌లో కాలుపెట్టా. అడ్వొకేట్‌గా ఎన్రోల్మెంట్ చేసుకున్నాక చిక్కడపల్లిలో ఉంటున్న స్నేహితుడి ఇంటికి వె ళ్లిన. సరదాగా నగరమంతా చక్కర్లు కొట్టిన. నారాయణగూడ వేంకటేశ్వర థియేటర్లో ఏఎన్ఆర్ అందాలరాముడు సినిమా ఫ్రెండ్స్‌తో కలసి చూడటం గొప్ప అనుభూతి. ఆ టేస్టే వేరు... ఎనిమిది నెలల తర్వాత కుటుంబంతో కలిసి హిమాయత్‌నగర్‌కు మకాం మార్చా. నెలకు రూ.150 రెంట్. ట్యాంక్ బండ్లో బండి వద్ద మిర్చి బజ్జీల రుచి అమోఘం. రూపాయికి పది బజ్జీలొచ్చేవి. అన్నీ ఒక్కడినే లాగించేవాడిని. ఇప్పుడైతే రూ.40 పెట్టినా రావడంలేదు. ఆ టేస్టూ లేదు. ఇప్పటికీ కాయిన్ చప్పుడు... మా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు రామకృష్ణ థియేటర్లో ‘షోలే’కు వెళ్లాం. కొత్తగా స్టీరియోఫోనిక్ సౌండ్ సిస్టమ్‌తో ఎంతో ఎంజాయ్ చేశాం. ఆఖరి సీన్లో ధర్మేంద్ర కాయిన్ విసిరినప్పుడు థియేటర్లో కుడివైపు సౌండ్ స్పీకర్ నుంచి వచ్చిన సౌండ్‌కు ఉలిక్కిపడ్డాం. ఆ సౌండ్ ఇప్పటికీ చెవుల్లో రింగుమంటుంది. సైకిల్‌తో చక్కర్లు... మొదటి ఆరేళ్లు నగరంలో ఎక్కడికి వెళ్లినా సైకిల్ మీదే. ఇక్కడి గల్లీ గల్లీ తెలుసు. ఇప్పుడు సైకిళ్ల స్థానాన్ని మోటారు సైకిళ్లు ఆక్రమించాయి. ఫలితంగా కాలుష్యకోరల్లో నగరం. వాటిల్లో ప్రయాణం మస్త్... గూడు రిక్షాలో ప్రయాణమంటే మస్తు అనిపించేది. రిక్షావాలాలు మర్యాదపూర్వకంగా వ్యవహరించేవారు. ఎక్కడికి వెళ్లాలన్నా 75 పైసలు ఇవ్వమనేవారు. ఒకరోజు నేను హిమాయత్‌నగర్ నుంచి హైకోర్టుకి వెళ్లడానికి రిక్షావాలా బారానా ఇవ్వమన్నాడు. ‘హైకోర్టు ఎక్కడుంటుందో తెలుసా’ అంటే. ‘మీరే చెబుతారు కదా సాబ్’ అని తీసుకెళ్లాడు. అంత దూరానికి బారానే ఇవ్వడం కరెక్టు కాదనిపించింది. రూపాయిన్నర ఇచ్చిన. అందుకాయన నాకు దండం పెడుతూ వెళ్లిపోయాడు. 1980లో రాజమండ్రికి వెళ్లా. పదేళ్ల తర్వాత మళ్లీ సిటీకి వచ్చా. అప్పుడు మా పిల్లలు డబుల్ డెక్కర్ ఎక్కాలని ఉబలాటపడ్డారు. అబిడ్స్‌లో బస్సు ఎక్కి ఎక్కడికి వెళుతుందో అక్కడికి టికెట్ ఇవ్వమంటే కండక్టర్ ఆశ్చర్యపోయాడు. తిరుగుప్రయాణం అదే బస్సులో. నుమాయిష్ 1974లో అనుకుంటా. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మొట్టమొదటిసారి నుమాయిష్‌కు వెళ్లా. భారీ సంఖ్యలో స్టాళ్లు, టాయ్ ట్రెయిన్, రంగుల రాట్నాలు, జెయింట్ వీల్... ఇలా అన్నీ ఒకేచోట. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నగరం విభిన్న సంస్కృతుల నిలయంగా వర్ధిల్లుతోంది. - వాంకె శ్రీనివాస్ జస్టిస్ సముద్రాల గోవిందరాజులు రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునల్ చైర్మన్