దాండియా బీట్స్ | Dandiya beats celebrations in Hyderabad city | Sakshi
Sakshi News home page

దాండియా బీట్స్

Published Tue, Sep 23 2014 1:08 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

దాండియా బీట్స్ - Sakshi

దాండియా బీట్స్

దాండియా ఆటలు ఆడ.. సరదా పాటలు పాడ.. అంటూ భాగ్యనగరం ఉత్సాహంతో ఊగిపోతోంది. దసరా నవరాత్రుల్లో సిటీని ఉత్సాహంలో ముంచెత్తడానికి దాండియా ఆట సిద్ధవువుతోంది. ఒత్తిడిని చిత్తు చేస్తూ ఉత్తేజాన్ని నింపుతున్న ఈ ఆట అందరికీ లేటెస్ట్ ఎంజాయ్‌మెంట్‌గా వూరింది. టీనేజర్ల నుంచి మేనేజర్ల వరకు అంతా దీనికే సై అంటున్నారు. ఆరోగ్యం అదనపు బోనస్‌గా వస్తోందని గృహిణులు, బిజినెస్ వుమెన్ సైతం దాండియూపై ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే దాండియా నేర్పే శిక్షణ కేంద్రాలూ నగరంలో పెరిగారుు. ఇలా ఓ కేంద్రంలో దాండియా, గార్భా సాధన కోసం వచ్చిన మహిళలను పలకరిస్తే ఆసక్తికరమైన విషయాలను ‘సిటీ ప్లస్’తో పంచుకున్నారు.
 
 ‘దాండియాతో ఒత్తిడి దూరమవుతుంది. మనసూ ప్రశాంతంగా ఉంటుంది. దాదాపు నెలరోజుల పాటు ఈ నృత్యం చేయడం వల్ల మంచి ఫిట్‌నెస్ వస్తుంది. ఈ నెల 25 నుంచి జరిగే నవరాత్రి ఉత్సవాల్లో దాండియా ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అంటున్నారు ఆహార్ కుటీర్ రెస్టారెంట్ వర్కింగ్ పార్‌‌టనర్ అర్చన. చురుగ్గా కదలాల్సిన ఈ ఆటపై గృహిణులు, వృద్ధులు సైతం వుక్కువ చూపడం విశేషం.
 
 ‘కొన్ని నెలల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమైంది. ఫిజియో థెరపీ చేశారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే ఇబ్బందిగా ఉండేది. దాండియా సాధన వల్ల ఇప్పుడు చురుగ్గా నడవగలుగుతున్నా’ అంటూ ఇందులోని ఫిట్‌నెస్ మంత్ర గురించి చెప్పారు బేగంపేటలో ఉండే గృహిణి గీత. ఐదు పదులు దాటినా పట్టుదలతో దాండియూ నేర్చుకున్న లక్ష్మి (కూకట్‌పల్లి) నిజంగా యూత్‌కు స్ఫూర్తి.
 
 ‘నా వయస్సు 55 ఏళ్లు. దాండియా ప్రాక్టీసు వల్ల చిన్ననాటి ఎనర్జీవచ్చినట్టు అనిపిస్తోంది. ఆత్మవిశ్వాసంతో నేర్చుకున్నా’నని ఆమె ఆనందం నిండిన కళ్లతో చెబుతారు. సిటీజనులే కాదు.. వివిధ జిల్లాల నుంచీ అనేకవుంది దాండియూలో శిక్షణ తీసుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. అలా వచ్చినవారే శ్రీకాకుళంలోని హోటల్ నాగావళి జారుుంట్ మేనేజర్ రాధ. ‘దాండియూ ఆడితే నలుగురిలో గుర్తింపు రావడంతో పాటు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటాం. అందుకే ఇక్కడకు వచ్చా’ అన్నారామె.
 -  వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement