లోకల్ రేడియో | Community radios entertain with FM radios | Sakshi
Sakshi News home page

లోకల్ రేడియో

Published Tue, Oct 28 2014 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

లోకల్ రేడియో

లోకల్ రేడియో

సిటీవాసులకు ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్దురపోయే వరకు మస్తీగా ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న ఎఫ్‌ఎంలకు ‘కమ్యూనిటీ రేడియో’లు కూడా శ్రుతి కలుపుతున్నాయి. ఒక ప్రాంత ప్రజల సాధకబాధకాలను వివరిస్తూనే, ప్రసారాలతో వారిలో సామాజిక స్పృహ కలిగిస్తున్నాయి. కొన్ని విద్యాసంస్థలైతే తమ కాలేజీ విద్యార్థులు బయట ఎక్కడకు వెళ్లినా ఉద్యోగం చేసి నిలదొక్కుకునేందుకు దోహదపడేలా డిఫరెంట్ ఐడియాలజీతో కమ్యూనిటీ రేడియోలను ప్రారంభించాయి.
 
 సిటీలోనే తొలి కమ్యూనిటీ రేడియో డెక్కన్ రేడియో 107.8 ఎఫ్‌ం. మెదక్‌లోని సంఘం రేడియో స్ఫూర్తిగా అబిద్ అలీ ఖాన్ ఎడ్యుకేషనల్ ట్రస్టు 2009 డిసెంబర్ 23న డెక్కన్ రేడియో 107.8 ఎఫ్‌ఎంను ప్రారంభించింది. అబిడ్స్‌లో ఉండే ఈ రేడియో స్టేషన్ ప్రసారం చేసే కార్యక్రమాలు ఆ ప్రాంతం నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ప్రసార ం అవుతాయి. లెర్న్ ఇంగ్లిష్, వారుుస్ అండ్ యూక్సెంట్ ట్రైనింగ్, పబ్లిక్ హెల్త్ అండ్ హైజిన్, మహిళా సాధికారత, వరకట్న సమస్యలు, పేదలు అభివృద్ధి చెందడం ఎలా.. తదితర కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. యువతకు ఉపయోగపడేలా ఉద్యోగాల నోటిఫికేషన్ సమాచారాన్ని కూడా అందిస్తోంది. క్రీడా విషయాలు, ఔత్సాహిక కళాకారులతో వినోద కార్యక్రవూలనూ ప్రసారం చేస్తోంది. వుతాలకు అతీతంగా పండుగ రోజుల్లో వాటి ప్రాధాన్యతను తెలిపే కార్యక్రవూలను 24 గంటల పాటు ప్రసారం చేస్తోంది. సాధారణ దినాల్లోనైతే ఉదయుం 8 నుంచి వుధ్యాహ్నం 12 గంటల వరకు, సాయుంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రసారాలు చేస్తోంది. త్వరలోనే ప్రతిరోజూ 24 గంటల ప్రసారాలకు సవూయుత్తవువుతోంది.
 
 ఔత్సాహికులకు ఉచిత శిక్షణ, ప్లేస్‌మెంట్
 రేడియోలో పని చేయాలనుకునే ఔత్సాహికుల కోసం డెక్కన్ రేడియో 107.8 ఎఫ్‌ఎం ఉచిత శిక్షణతో పాటు ప్లేస్‌మెంట్‌ను కూడా అందిస్తోంది. సోమవారం నుంచి బ్యాచ్‌ల వారీగా ట్రైనింగ్ క్లాస్‌లు ఉంటాయి. దీనికి వయోపరిమితి లేదు. శిక్షణ తర్వాత సర్టిఫికెట్లు ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 9848256515లో సంప్రదించవచ్చు.
 
 కేఎంఐటీ 90.4 ఎఫ్‌ఎం...
 విద్యార్థులకు అన్నిరకాలుగా ఉపయోగపడేలా రెండేళ్ల క్రితం నారాయణగూడలోని కేశవ మెమోరియల్  ఇన్‌స్టిట్యూట్ వేదికగా కేఎంఐటీ 90.4 ఎఫ్‌ఎం ప్రారంభమైంది. కాలేజీ పనిదినాల్లో ఈ రేడియో కార్యక్రవూలు మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రసారమవుతాయి. ఒక్కో సబ్జెక్ట్ టీచర్‌ను విద్యార్థులు చేసిన ఇంటర్వ్యూలు, కఠినమైన సబ్జెక్ట్‌లపై లెక్చరర్ల ప్రత్యేక పాఠాలు..ఇలా విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలను వారిచేతే నిర్వహిస్తోంది కేఎంఐటీ. ఫ్రెషర్స్ డే, ఫేర్‌వెల్ డే, స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం వంటి రోజుల్లో విద్యార్థులు వినోద కార్యక్రవూలనూ అందిస్తారు.
 
 బోల్ హైదరాబాద్ 90.4 ఎఫ్‌ఎం..
 హైదరాబాద్ సెంట్ర ల్ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ చొరవతో 2011లో ఈ రేడియో ప్రారంభమైంది. పది కిలోమీటర్ల పరిధిలో ఇందులోని  కార్యక్రమాలు విద్యార్థులు, వాలంటీర్‌ల పర్యవేక్షణలో ప్రసారవువుతుంటారుు. ఉదయం 7.30 నుంచి 9.00 వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9.00 వరకు ఎంటర్‌టైన్‌మెంట్, ఎడ్యుకేషన్, సమాచారం, పాఠాలు, గెస్ట్‌లతో ఇంటర్వ్యూలు ప్రసారమవుతుంటాయి. ఇవే కాకుండా తార్నాకలో త్వరలోనే మరో కమ్యూనిటీ రేడియో ప్రారంభంకానుంది.
 -  వాంకె శ్రీనివాస్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement