కుర్సీతో మస్తీ | New version game to come as Zumba fitness classes for citizens | Sakshi
Sakshi News home page

కుర్సీతో మస్తీ

Published Sat, Sep 20 2014 12:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM

కుర్సీతో మస్తీ

కుర్సీతో మస్తీ

నిన్న మొన్నటి వరకూ ‘జుంబారె.. అ జుంబరే’ అంటూ జుంబా ఫిట్‌నెస్ క్లాసులకు పరుగులు తీసిన సిటీ జనులకు ఇప్పుడు సరికొత్త వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. జుంబాకు అప్‌డేటెడ్‌గా వచ్చిన ‘జుంబా సెంటావో’ ఎంజాయ్‌మెంట్‌తో పాటు ఎనర్జీని అందిస్తానంటోంది. కుర్చీలతో కుస్తీపడుతూ సాగిపోయే ఈ నృత్యాన్ని చైర్ డ్యాన్స్ అని కూడా పిలుస్తారు. బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు లయబద్దంగా కుర్చీలను తిప్పుతూ స్టెప్స్ వేయడమే జుంబా సెంటావో ప్రత్యేకత. దేశంలోనే తొలి మాస్టర్ క్లాస్ ఈ నెల 21న (ఆదివారం) వెస్టిన్ హైదరాబాద్ మైండ్ స్పేస్‌లో ‘హైదరాబాద్ ఫిట్‌నెస్ కార్నివాల్’ పేరుతో  పలకరించనుంది. సిటీవాసులకు కొత్త నృత్యం పరిచయం చేస్తున్న జుంబా జామర్ అయిన జేగతా (జాగ్స్)తో ‘సిటీప్లస్’ ముచ్చటించింది.
 
 ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న సిటీవాసులు ఎన్నో మార్గాలు అన్వేషిస్తున్నారు. కొందరు ఉదయాన్నే జాగింగ్ చేస్తున్నారు. ఇంకొందరు జిమ్ బాట పడుతున్నారు. అయితే జుంబా డ్యాన్స్ ఆడుతూ పాడుతూ ఫిట్‌నెస్ ఇస్తుందంటున్నారు జాగ్స్. జుంబా డ్యాన్స్‌కు మరిన్ని మెరుగులు దిద్దుకుని వచ్చిన ‘జుంబా సెంటావో’ బాడీని ఫుల్ ఫిట్‌గా ఉంచుతుందని హామీ ఇస్తున్నారామె. ‘రోజుకో గంట ఈ స్టెప్పులేస్తే చాలు.. బాడీలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ అంతు చూసేయొచ్చు. కష్టపడుతున్నామన్న ఫీలింగ్ లేకుండానే చెమటతో తడిసి ముద్దయి పోవచ్చు’ అని చెబుతున్నారు.
 
 ఫ్లోరిడా  కన్వెన్షన్..
 తన గురించి చెబుతూ భారత్‌లో లెసైన్సింగ్ కలిగిన జుంబా ఇన్‌స్ట్రక్టర్‌లకు శిక్షణ ఇస్తున్న జాగ్స్ ఇటీవల ఫ్లోరిడాలో జరిగిన ‘ఓర్లాండో జుంబా కన్వెన్షన్’ మంచి అనుభూతిని ఇచ్చిందన్నారు జాగ్స్. ఐదు రోజులు సాగిన వర్క్‌షాప్‌కి భారత్ నుంచి 50 మంది వెళ్తే ప్రత్యేక ఆహ్వానం పొందిన ఇద్దరు భారతీయులలో ఈమె ఒకరు. ‘ఐదురోజులు సాగిన ఈ వర్క్‌షాప్‌లో జుంబాలో వస్తున్న న్యూ ట్రెండ్స్ గురించి తెలుసుకున్నా. జుంబా సెంటావోపై అవగాహన కలిగింది. జుంబా సెంటావో ట్రైనింగ్ సర్టిఫికెట్ రావడం హ్యాపీగా ఉంద’ని ఆమె వివరించారు.
 
 మలుపు తిప్పిన సిటీ
 ‘2010లో ఇండియా ఇంటర్నేషనల్ సల్సా కాంగ్రెస్‌లో విజయం సాధించా. అనేక అంతర్జాతీయ, జాతీయ సల్సా పోటీలను నెగ్గా. గోవా సల్సా ఫెస్టివల్‌లో హైదరాబాద్‌కు చెందిన జుంబా ఇన్‌స్ట్రక్టర్ కార్తికేయన్ కృష్ణతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. తర్వాత పెళ్లికి దారి తీసింది. గోవాకు చెందిన నేను ఆ తర్వాత దాదాపు మూడేళ్ల కిందట సిటీకి మకాం మార్చా. అప్పటికి నగరంలో జుంబాకు ఆదరణ అంతగా లేదు. ఈ డ్యాన్స్‌కు ఆదరణ పెంచాలని ఆరు నెలలు ప్లాన్ చేశారు. అలా 2012లో డ్యాన్స్ జాకీని ప్రారంభించాం.
 
 నగరంలోని మాల్స్‌లో ఫ్లాష్ మాబ్ నిర్వహించి జుంబాకు క్రేజ్ పెంచాం’ అని జాగ్స్ వివరించారు. డ్యాన్స్‌ను ఎంతో ఎంజాయ్ చేస్తానంటున్న ఈ గోవా భామ.. జుంబా, సల్సాలోనూ సరికొత్త ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తానని చెప్పింది. నగరంలోని అనేక ఐటీ కంపెనీలు, కమ్యూనిటీలు, జిమ్‌లలో కూడా జుంబా ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
 
 జుంబాతో మంచి ఉపయోగం
 ‘జుంబా అనేది ఫిట్‌నెస్ ప్రోగ్రామ్. దీనికి సిటీలో మంచి క్రేజీ ఉంది. గంటపాటు ఆగకుండా డిఫరెంట్ స్టైల్స్‌తో డ్యాన్స్ చేయాలి. సల్సా బచాతా, మెరింగే చాచా స్టైల్స్‌తో పాటు బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు తగ్గట్టుగా స్టెప్పులేయడం వల్ల సుమారు 500 నుంచి 800ల కేలరీల శక్తి ఖర్చవుతుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది. బరువు కూడా తగ్గుతుంద’ని జాగ్స్ భర్త కార్తికేయన్ కృష్ణ తెలిపారు.  ఆదివారం జరిగే ‘హైదరాబాద్ ఫిట్‌నెస్ కార్నివాల్’లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు జ్ట్టిఞ://ఠీఠీఠీ.ఝ్ఛట్చ్ఛఠ్ఛ్టిట.ఛిౌఝలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.
 - వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement