నమ్మితే ఏదైనా చేస్తా: అనుష్క | If i trust anything, will do anymore, says Anushka | Sakshi
Sakshi News home page

నమ్మితే ఏదైనా చేస్తా: అనుష్క

Published Sun, Aug 17 2014 12:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM

నమ్మితే ఏదైనా చేస్తా: అనుష్క

నమ్మితే ఏదైనా చేస్తా: అనుష్క

చిట్‌చాట్: తాను నమ్మితే ఏదైనా చేసేస్తానంటోంది అందాల తార అనుష్క. సినిమా విషయంలో ఎలాగైతే కథ, కథనాలు విని నచ్చితేనే ఓకే  చేస్తానో.. కెమెరా బాగుందంటేనే మొబైల్స్‌కు ఓకే చెప్తానంటోంది. ఫీచర్స్ నచ్చి తనకు నమ్మకం కుదిరితేనే.. ఆ సెల్‌ఫోన్ కొంటానని తెలిపింది ఈ అభినవ రుద్రవుదేవి. ఇంటెక్స్ మొబైల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అనుష్క శెట్టి శనివారం నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్‌లో జరిగిన ఆక్వా స్టైల్ ప్రోను ఆవిష్కరించారు.
 
 ఈ సందర్భంగా అనుష్క ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. టాలీవుడ్ ముచ్చట్లు చెప్పడానికి నో అన్న ఈ అమ్మడు.. ఒక కంపెనీ ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఇదేం తొలిసారి కాదని చెప్పుకొచ్చింది. ‘నా వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఇష్టపడతా. నాకు అన్నివిధాలా ఆ కంపెనీ ప్రొడక్ట్స్ నచ్చితేనే అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ఓకే చెబుతా’నని అంటోంది. అభిమానుల ఆదరణతోనే తను టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకోగలిగానని ముసిముసినవ్వులు చిందించింది.
 -   వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement