Taj Krishna Hotel
-
బంజారా హిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన సూత్ర ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఉమేష్ మధ్యాన్, మోడల్స్ (ఫోటోలు)
-
CWC Meeting: అతిథుల కోసం 78 రకాల వంటకాలు.. నోరూరాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయని.. ఈ క్రమంలో రాష్ట్ర కేడర్‌లో జోష్ నింపడం, బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలను ఇవ్వడం కోసం ఇక్కడ సమావేశాలు పెట్టారని చర్చ జరుగుతోంది. అతిథుల కోసం 78 రకాల వంటకాలు ఇక సీడబ్ల్యూసీ భేటీలకు వచ్చే నేత లకు తెలంగాణ ప్రత్యేక వంటకాలతోపాటు హైదరాబాదీ దమ్ బిర్యానీని వడ్డించనున్నారు. మొత్తంగా 78 రకాల వంటకాలను వడ్డించేలా పీసీసీ ఏర్పా ట్లు చేసింది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నిరకాల వంటలు, రుచులు ఉండేలా మెనూ సిద్ధం చేసింది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, వివిధ రాష్ట్రాల ఇతర సీనియర్లు వస్తున్న నేపథ్యంలో.. ప్రత్యేక వంటకాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వంట మనుషులను రప్పించింది. ►అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఉగ్గాని, కిచిడీ, ఉప్మా, రాగి, జొన్న సంగటి, పాయ సూప్, ఖీమా రోటీ, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ వడ, ప్రూట్ సలాడ్ వంటివి వడ్డించనున్నారు. ►మధ్యాహ్నం భోజనంలో హైదరాబాదీ దమ్ బిర్యానీ, హలీమ్, బగారా రైస్, కుర్మా, దాల్చా మటన్, స్పెషల్ చికెన్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, తలకాయ కూర, లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, చేపలు వడ్డిస్తారు. ►శాకాహారుల కోసం పచ్చిపులుసు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్లు ఉండనున్నాయి. ►స్నాక్స్ ఐటమ్స్‌గా ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సర్వపిండి, వివిధ రకాల సమోసాలు, కుడుములు, మురుకులు, ఉడికించిన మొక్కజొన్న, సకినాలు, గారెలు రుచి చూపించనున్నారు. -
Hyderabad: తాజ్‌కృష్ణపై డేగకన్ను
హైదరాబాద్: నగరంలోని హోటల్ తాజ్‌కృష్ణ కేంద్రంగా జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర కొత్వాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికే పలువురు పోలీసు సిబ్బంది ఈ బాధ్యతలు చేపట్టారు. సమావేశాలు జరిగే తాజ్ కృష్ణ హోటల్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, దారి తీసే మార్గాలనూ పోలీసులు తమ అధీనంలోకి తీసుకోనున్నారు. శుక్రవారం నుంచే ప్రముఖులు వస్తుండటంతో అటు శంషాబాద్ విమానాశ్రయంతో పాటు తాజ్ కృష్ణ పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించారు. శాంతిభద్రతల విభాగంతో పాటు నగర భద్రత విభాగం, ట్రాఫిక్ వింగ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా పని చేస్తున్నారు. హోటల్లో బస చేసి ఉన్న వారి జాబితాలను సేకరించిన పోలీసులు విశ్లేషిస్తున్నారు. మరోపక్క రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసేలా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన గలాభా నేపథ్యంలో మరింత అప్రమత్తయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజ్ కృష్ణతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోకి కేవలం అధీకృత వ్యక్తులనే అనుమతించాలని నిర్ణయించారు. ప్రతి రోజూ మూడు నాలుగు సార్లు అణువణువూ బాంబు నిర్వీర్యం బృందాలు, స్నిఫర్ డాగ్స్ తనిఖీ చేయనున్నారు. ఇద్దరు డీసీపీ స్థాయి అధికారుల నేతృత్వంలో ఇద్దరు అదనపు డీసీపీలు, నలుగురు ఏసీపీలు, తొమ్మిది మంది ఇన్స్పెక్టర్లు, 25 మంది సబ్–ఇన్స్పెక్టర్లు, 13 మంది ఏఎస్సైలు, 110 మంది కానిస్టేబుళ్ళు, నాలుగు ప్లటూన్ల సాయుధ బలగాలు మూడు షిఫ్టులో విధులు నిర్వర్తిస్తాయి. వీరిలో మహిళా అధికారులు, సిబ్బంది సైతం అవసరమైన సంఖ్యలో ఉండేలా చర్యలు తీసుకున్నారు. సీడబ్ల్యూసీకి సిటీ ముస్తాబు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాలకు ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో తరలివస్తున్న అతిరథ మహారథులకు నగరం స్వాగతం పలుకుతోంది. సమావేశాల వేదిక తాజ్‌కృష్ణ హోటల్‌కు వెళ్లే మార్గాలను సుందరంగా అలంకరించిన పార్టీ నాయకత్వం.. భారీ కటౌట్లు, జెండాలు, ఫ్లెక్సీలతో ముంచెత్తింది. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో శని, ఆదివారాల్లో జరగనున్న భేటీకి పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ, ఖర్గే సహా అధినాయకత్వమంతా హాజరు కానుంది. పార్టీ రథ సారథులు నగరానికి కదిలి వస్తుండటంతో శ్రేణుల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. కాగా.. నగర శివారు తుక్కుగూడ వేదికగా జరిగే విజయభేరి సభకు నగర శివారు ప్రాంతాలు సైతం భారీగా ముస్తాబవుతున్నాయి. విజయభేరి బహిరంగ సభకు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచి భారీగా జనసమీకరణకు పార్టీ కసరత్తు చేస్తోంది. -
నేడు సోనియా సమక్షంలో కాంగ్రెస్ గూటికి తుమ్మల
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అసంతృప్తనేత, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు శనివారం(నేడు) కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. సీడ బ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలో శనివారం ఆ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్‌గాంధీల సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. పార్టీలోకి రావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఇప్ప టికే తుమ్మలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని తుమ్మల నివాసా నికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతోపాటు రేవంత్, భట్టి విక్ర మార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెళ్లారు. పార్టీలోకి రావాలని మరోమారు ఆహ్వానించగా సానుకూలంగా స్పందించిన తుమ్మల శనివారం కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని గాంధీభవన్ వర్గాలు తెలిపా యి. కాగా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని పలువురు మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమా చారం. వీరిని ఈ నెల 17న తుక్కుగూడ సభా వేదికగా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించినప్ప టికీ అనివార్య కారణాల వల్ల దానిని మార్చారని తెలిసింది. శని, ఆదివారాల్లో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాల విరామ సమయంలోనే వీరిని సోని యా, రాహుల్, ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్చుకోవా లని నిర్ణయించినట్టు సమాచారం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి తుమ్మల పోటీ చేసే అవకాశముందని సమాచారం. -
CWC: ఐదు అంశాలే ఎజెండాగా కాంగ్రెస్ భేటీ!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన ‘కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)’ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో శని, ఆదివారాల్లో జరగనున్న ఈ సమావేశాల్లో కాంగ్రెస్ అతిరథ మహారథులంతా పాల్గొననున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. శనివారం మధ్యాహ్నం సీడబ్ల్యూసీ సభ్యులకు టీపీసీసీ విందు అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు సీడబ్ల్యూసీ భేటీ మొదలవుతుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఐదు కీలక అంశాలు ఎజెండాగా.. సీడబ్ల్యూసీ భేటీ ముగిసే మరునాటి నుంచే పార్లమెంటు ప్రత్యేక భేటీ జరుగుతుండటం, ఆ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెడుతుందన్న అంచనాల నేపథ్యంలో.. హైదరాబాద్ సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఏం చర్చిస్తారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్న దానిపై దేశ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. శని, ఆదివారాల్లో జరిగే ఈ సమావేశాల్లో ఐదు కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ చర్చించనుంది. ‘త్వరలోనే జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, భారత్ జోడో యాత్ర–2 నిర్వహణ, 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల పంపకాలు, ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి’పై కాంగ్రెస్ కీలక నేతలు చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇదే సమయంలో దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అదానీ వ్యవహారం, ఎన్డీయేకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతృత్వంలో చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ, ఇండియా కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలను ఆయా రాష్ట్రాల్లో ఎదుర్కోవాల్సిన తీరు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ పార్టీలో జోష్ కోసం త్వరలో తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయని.. ఈ క్రమంలో రాష్ట్ర కేడర్‌లో జోష్ నింపడం, బీఆర్ఎస్ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలను ఇవ్వడం కోసం ఇక్కడ సమావేశాలు పెట్టారని చర్చ జరుగుతోంది. చదవండి: నేడు సోనియా సమక్షంలో కాంగ్రెస్ గూటికి తుమ్మల శుక్రవారమే చేరుకున్న 52 మంది సీడబ్ల్యూసీలోని సాధారణ సభ్యులతోపాటు శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితులు కలిపి మొత్తం 84మంది సమావేశాలకు హాజరుకానున్నారు. శుక్రవారమే 52 మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరిలో హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్విందర్సింగ్ సుఖు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, సీడబ్ల్యూసీ సభ్యులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏకే ఆంటోనీ, రమేశ్ చెన్నితాల, కొడుక్కునిల్ సురేశ్, శశిథరూర్, రణదీప్‌సింగ్ సూర్జేవాలా, రాజీవ్‌శుక్లా, పవన్‌ఖేరా, యశోమతి ఠాకూర్, దీపేందర్ సింగ్ హుడా, ఫూలోదేవి, లాల్జీదేశాయ్, తారిఖ్ అన్వర్, మీరా కుమార్, నెట్టా డిసౌజా, అల్కా లాంబా, బీకే హరిప్రసాద్, మాణిక్యం ఠాగూర్, ఇబోబిసింగ్, ప్రతిభా సింగ్, మనీశ్ తివారీ, గౌరవ్ గొగోయ్, భక్తచరణ్‌దాస్, సుప్రియా షినాటె, దిగ్విజయ్‌సింగ్, కుమారి షెల్జా తదితరులు ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు సోనియా, రాహుల్, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అశోక్ గెహ్లాట్, సిద్ధరామయ్య, భూపేశ్ భగేల్, మరికొందరు నేతలు శనివారం రానున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సీడబ్ల్యూసీ, విజయభేరి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచి్చన కాంగ్రెస్ జాతీయ నేతలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర నేతలు స్వాగతం పలికారు. బహిరంగ సభ.. నియోజకవర్గ పర్యటనలు సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాక 17న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ శివార్లలోని తుక్కుగూడలో కాంగ్రెస్ ‘విజయభేరి’ బహిరంగ సభ జరగనుంది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు ఈ సభలో పాల్గొననున్నారు. ఆ సభా వేదికపై నుంచి కాంగ్రెస్ ఎన్నికల హామీలుగా గ్యారంటీ కార్డు స్కీంలను సోనియాగాంధీ ప్రకటించనున్నారు. ఇక ఈ నెల 18న రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు జాతీయ స్థాయి నేతలు వెళ్లి.. స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు. బొట్టు పెట్టి.. మంగళ హారతి పట్టి.. సీడబ్ల్యూసీ, విజయభేరి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన కాంగ్రెస్ జాతీయ నేతలకు టీపీసీసీ ఘనంగా స్వాగతం పలికింది. కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఇతర నేతలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి జాతీయ నేతలు తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుకోగా.. మహిళా నేత కత్తి కార్తీకగౌడ్ వారందరికీ బొట్టు పెట్టి, మంగళ హారతి ఇచ్చి ఆహ్వానించారు. ఇది కూడా చదవండి: డేంజర్ జోన్లో భారత్, తీవ్రవైన కరువు దేశంగా.. -
ఘనంగా మంత్రి విశ్వరూప్ కుమారుడి వివాహం
-
మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడి వివాహం
-
మంత్రి విశ్వరూప్ కుమారుడి వివాహం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడి వివాహం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో జరిగింది. ఆగస్టు 5, బుధవారం రాత్రి 11గంటల 49 నిమిషాలకు జరిగిన ఈ వివాహా కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వనించారు. మంత్రి విశ్వరూప్ కుమారుడు వరుడు శ్రీకాంత్, వధువు వైష్ణవికి బంధువులు, అతిథులు శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పరిమిత సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వివాహ వేడుక ఘనంగా జరిగింది. -
‘ట్రెండ్జ్స్’లో సందడే సందడి
-
డిజైర్... హుషార్
-
‘ట్రెండ్స్ లైఫ్‌స్టైల్ ’ ఎగ్జిబిషన్
-
హెచ్ లేబుల్.. ఫ్యాషన్ సొబగుల్
-
అమ్మో.. బాపుగారి బొమ్మో..
తాజ్‌కృష్ణాలో మంగళవారం ‘లవ్ ఫర్ హ్యాండ్లూమ్’ పేరుతో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. హీరోయిన్ ప్రణీత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీతారలు, మోడల్స్ హంసనడకలతో ర్యాంప్ మురిసింది. ప్రముఖ వస్త్ర షోరూం ‘త్రిష’ ఆధ్వర్యంలో ‘లవ్ ఫర్ హ్యాండ్లూమ్’ పేరుతో మంగళవారం తాజ్‌కృష్ణాలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. తారలు ప్రణీత, షామిలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బంజారాహిల్స్‌లో నూతన షోరూం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ ఫ్యాషన్ షో నిర్వహించామని డిజైనర్ అమృతా మిశ్రా చెప్పారు. – జూబ్లీహిల్స్ -
తాజ్‌కృష్ణాలో కలర్‌ఫుల్.. క్వాయిష్
-
న్యూ ట్రెండ్జ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని తాజ్ కృష్ణా హోటల్లో బుధవారం ట్రెండ్జ్ ఎక్స్పో ప్రారంభమైంది. మొత్తం 75 మంది డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని నిర్వాహకురాలు శాంతి కతిరావన్ చెప్పారు. రానున్న శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకుని అన్ని రకాల వస్త్రశ్రేణులు, ఆభరణాలు, యాక్సెసరీస్‌ను ప్రదర్శిస్తున్నామని వివరించారు. ఇది తమ 100వ ప్రదర్శన అని... మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. -
కలర్‌ఫుల్.. క్వాయిష్
బంజారాహిల్స్: అంతర్జాతీయ ప్రఖ్యాతి చెందిన డిజైనర్లు ప్రత్యేకంగా రూపొందించిన చీరలు, దుస్తుల ప్రదర్శన ‘క్వాయిష్ డిజైనరీ ఎగ్జిబిషన్’ బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణా హోటల్లో శుక్రవారం ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డిజైనర్లు నీలం ఆశ్లే, జుబిన్ తమ కొత్త ఉత్పత్తులను ఇందులో అందుబాటులో ఉంచారు. ఆర్ట్ ఆన్ది ఫ్యాబ్రిక్ పేరుతో ఉక్రెయిన్‌కు చెందిన ఉష్యవంక డిజైన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. శనివారం కూడా కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 70 మంది మాస్టర్ డిజైనర్లు కనువిందు చేసే దుస్తులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకా జ్యువెలరీ, షూస్, హోం ఫర్నిషింగ్స్, యాక్ససెరీస్, హోం డెకార్స్ కూడా ప్రదర్శనలో ఉన్నాయి. -
ఉత్సాహంగా.. ఉల్లాసంగా...
-
సొంతింటి ఎంపికకు చక్కటి వేదిక!
మార్చి 7,8న తాజ్‌కృష్ణాలో సాక్షి ప్రాపర్టీ షో సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎప్పటికైనా సొంతిల్లుండాలని కలలు కనేవారికి ‘సాక్షి’ మరోసారి చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. మార్చి 7,8 తేదీల్లో హోటల్ తాజ్‌కృష్ణాలో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. నగరానికి చెందిన పలు స్థిరాస్తి సంస్థలు పాల్గొనే ఈ షోలో.. ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండివిడ్యువల్ హోమ్స్, విల్లాలకు సంబంధించిన సమస్త సమాచారం లభిస్తుంది. మరెందుకు ఆలస్యం వెంటనే కుటుంబంతో సహా విచ్చేసి అన్ని విధాలా నచ్చిన ఇంటిని ఆనందంగా ఎంచుకోండి. ⇒ పనిచేసే ఆఫీసుకో, పిల్లాడి స్కూల్‌కో దగ్గరగా ఇల్లుండాలని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు మౌలికంగా అభివృద్ధి చెంది, చేరువలోనే షాపింగ్ మాల్, ఆసుపత్రి కూడా ఉండి, ధర కూడా అందుబాటులో ఉంటే చాలు వెంటనే నిర్ణయం తీసేసుకుంటున్నారు కొనుగోలుదారులు. ⇒ సాధారణంగా ఇళ్ల ధరలు ప్రీలాంచ్లో తక్కువగా ఉంటాయి. నిర్మాణం పూర్తయి, ఫ్లాట్లను అప్పగించే సమయంలో కాసింత ఎక్కువగా చెబుతారు. కారణాలేమైనప్పటికీ చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో నేటీకీ ఇళ్ల ధరలు తక్కువగానే ఉన్నాయి. అంతేకాదు రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోల్చుకుంటే కూడా నగరంలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వానికి కట్టే పన్నులు, ఇతరత్రా రుసుములూ రెట్టింపయ్యాయి. అయినా ఇంటి అంతిమ ధరలను మాత్రం పెంచట్లేదు నిర్మాణ సంస్థలు. రానున్న రోజుల్లో మార్కెట్ వురింత మెరుగవుతోంది కాబట్టి, ధరలు పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి, సొంతిల్లు కొనుక్కోవడానికి ఇదే మంచి తరుణం. ⇒ మెట్రో రైల్ పనులు శరవేగంగా జరుగుతుండటం, త్వరలోనే పూర్తి స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి రానుండటం, తెలంగాణ ప్రభుత్వం నగరం చుట్టూ ఫార్మా, ఫిల్మ్, హెల్త్, స్పోర్ట్స్, గేమ్, ఎడ్యుకేషన్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం వంటివి స్థిరాస్తి రంగంలో ఆశలను రేపుతోంది. ఆయా ప్రాజెక్ట్‌లతో నగరానికి లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. దీంతో అపార్ట్మెంట్ల అమ్మకాలు పెరిగి, విల్లాల జోరు అధికమై, వాణిజ్య సముదాయాలకూ గిరాకీ రెట్టింపు కానుంది. మెయిన్ స్పాన్సర్: అపర్ణా కన్స్ట్రక్షన్స్ అసోసియేట్ స్పాన్సర్: ఆదిత్యా కన్స్ట్రక్షన్స్ కో-స్పాన్సర్స్: హిల్‌కౌంటీ ప్రాపర్టీస్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సిరి సంపద ఫామ్స్ అండ్ ఎస్టేట్స్ పాల్గొనే సంస్థలు: సత్వా గ్రూప్, మంజీరా కన్స్ట్రక్షన్స్, ఎస్ఎంఆర్ బిల్డర్స్, శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్, జనప్రియ ఇంజనీర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రణీత్ గ్రూప్, నార్త్ స్టార్ హోమ్స్, సాకేత్ ఇంజనీర్స్, ఆక్సాన్ హౌజింగ్ సొల్యూషన్స్, ఫార్చూన్ ఇన్ఫ్రా డెవలపర్స్, గ్రీన్ హోమ్, ఎస్ఎల్ గ్రూప్, బీఆర్సీ ఇన్ఫ్రా, శతాబ్ధి టౌన్‌షిప్స్ ప్రై.లి., స్వర్ణ విహార్ ఇన్ఫ్రా, వర్ధన్ డెవలపర్స్, స్పేస్ విజన్, మ్యాక్ ప్రాజెక్ట్స్. -
మధువొలకబోసి
సిటీలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కేక్ మిక్సింగ్ సెరిమనీతో ఈ పండుగకు వెల్కమ్ చెప్తున్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోట ల్లో శనివారం కేక్ మిక్సింగ్ సందడిగా సాగింది. డ్రైఫ్రూట్స్‌లో వైన్ పోసి.. మిక్స్ చేశారు. ఈ కార్యక్రమంలో తాజ్ కృష్ణ సిబ్బంది.. హోటల్‌కు వచ్చిన అతిథులు ఇందులో ఉల్లాసంగా పాల్గొన్నారు. -
నమ్మితే ఏదైనా చేస్తా: అనుష్క
చిట్‌చాట్: తాను నమ్మితే ఏదైనా చేసేస్తానంటోంది అందాల తార అనుష్క. సినిమా విషయంలో ఎలాగైతే కథ, కథనాలు విని నచ్చితేనే ఓకే చేస్తానో.. కెమెరా బాగుందంటేనే మొబైల్స్‌కు ఓకే చెప్తానంటోంది. ఫీచర్స్ నచ్చి తనకు నమ్మకం కుదిరితేనే.. ఆ సెల్‌ఫోన్ కొంటానని తెలిపింది ఈ అభినవ రుద్రవుదేవి. ఇంటెక్స్ మొబైల్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న అనుష్క శెట్టి శనివారం నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్లో జరిగిన ఆక్వా స్టైల్ ప్రోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనుష్క ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. టాలీవుడ్ ముచ్చట్లు చెప్పడానికి నో అన్న ఈ అమ్మడు.. ఒక కంపెనీ ప్రొడక్ట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం ఇదేం తొలిసారి కాదని చెప్పుకొచ్చింది. ‘నా వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఇష్టపడతా. నాకు అన్నివిధాలా ఆ కంపెనీ ప్రొడక్ట్స్ నచ్చితేనే అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు ఓకే చెబుతా’నని అంటోంది. అభిమానుల ఆదరణతోనే తను టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకోగలిగానని ముసిముసినవ్వులు చిందించింది. - వాంకె శ్రీనివాస్ -
ధగధగలాడే నగలు.. నిగనిగలాడే భామలు
ధగధగలాడే నగలతో నిగనిగలాడే భామలు బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో సందడి చేశారు. జ్యువెల్స్ ఆఫ్ ఏషియా ప్రదర్శన శుక్రవారం ఇక్కడ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సినీ తారలు మీనాక్షి దీక్షిత్, నేహాలుల్లా, మిసెస్ ప్లానెట్ మెహక్ మూర్తి ప్రత్యేకంగా రూపొందించిన నగలు ధరించి వేదికపై కనువిందు చేశారు. ఆభరణాల ప్రదర్శనలో దేశంలోనే అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందిన ‘క్రివిష్ విజన్’ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆదివారం వరకు ప్రదర్శన ఉంటుంది. అలాగే ఆర్టీసీ క్రాస్‌రోడ్‌సలో నూతనంగా ఏర్పాటు చేసిన తబలా రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో కూడా మీనాక్షిదీక్షిత్ తళుక్కుమంది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, నటుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు. - ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్ -
హెల్త్‌కేర్ సమ్మిట్ అదిరింది
తాజ్‌కృష్ణాలో ప్రారంభమైన సదస్సు 20 దేశాల నుంచి హాజరైన ప్రతినిధులు మరో రెండు రోజులపాటు కొనసాగనున్న ఎగ్జిబిషన్ సాక్షి, సిటీబ్యూరో: ఇండో గ్లోబల్ హెల్త్‌కేర్ సమ్మిట్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇందులో భాగంగా పలు పరికరాలు, ఉత్పత్తులను ఎగ్జిబిట్లో ప్రదర్శనకు ఉంచారు. ఫ్యాఫ్సీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఫార్మాసూటికల్స్ అసోసియేషన్, ఇండస్ ఫౌండేషన్, ఓమిక్స్ సంయుక్తాధ్వర్యంలో హోటల్ తాజ్‌కృష్ణలో ఏర్పాటు చేసిన ఈ సదస్సును తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి టి.తారకరామారావు శుక్రవారం ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల నుంచి సుమారు రెండు వేలమంది ప్రతినిధులు హాజరయ్యారు. మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో 60 మంది నిపుణులు, 200పైగా అంశాలపై చర్చించనున్నారు. వివిధ ఫార్మాసూటికల్ కంపెనీలకు చెందిన ఉత్పత్తులు, వైద్య పరికరాలను ఎగ్జిబిషన్లో ఉంచారు. ఇండస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సీడీ అర్హ, ఓమిక్స్ గ్రూప్ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనిబాబు గేదెల, ఇండస్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ అనుమోలు, ఫ్యాఫ్సీ అధ్యక్షుడు రూంగ్టా తదితరులు పాల్గొన్నారు. జీవిత సాఫల్య పురస్కారాలు ప్రదానం.. వైద్య రంగంలో విశిష్ట సేవలందించిన పలువురు వైద్యులకు ఈ సందర్భంగా జీవిత సాఫల్య పురస్కారాలను అందజేశారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డెరైక్టర్ జనరల్ డాక్టర్ వీఎం కతోచ్, నిమ్స్ మాజీ డెరైక్టర్ కాకర్ల సుబ్బారావు, ఈఎన్టీ సర్జన్ డాక్టర్ టీవీ కృష్ణారావు, ఐఎంఏ చైర్మన్ డాక్టర్ ఎన్.అప్పారావు, అపోలో హాస్పిటల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ మాజీ డీన్ డాక్టర్ ఎం.హబీబ్, క్లినికల్ ల్యాబోరేటీస్ డెరైక్టర్ డాక్టర్ అనిల్కౌల్, డాక్టర్ ఇందిరాశర్మ, డాక్టర్ సంజయ్ పి.సింగ్, డాక్టర్ ముజఫర్ అహ్మద్, ప్రొఫెసర్ వి.విక్రమ్కుమార్లను మంత్రి కేటీఆర్ సత్కరించారు. -
ఐడియా స్టూడెంట్స్ అవార్స్ లో మహేష్ బాబు