సాక్షి, హైదరాబాద్: త్వరలో తెలంగాణతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో హైదరాబాద్‌లోనే సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపింది. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయని.. ఈ క్రమంలో రాష్ట్ర కేడర్‌లో జోష్ నింపడం, బీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొంటామనే సంకేతాలను ఇవ్వడం కోసం ఇక్కడ సమావేశాలు పెట్టారని చర్చ జరుగుతోంది.
అతిథుల కోసం 78 రకాల వంటకాలు
ఇక సీడబ్ల్యూసీ భేటీలకు వచ్చే నేత లకు తెలంగాణ ప్రత్యేక వంటకాలతోపాటు హైదరాబాదీ దమ్ బిర్యానీని వడ్డించనున్నారు. మొత్తంగా 78 రకాల వంటకాలను వడ్డించేలా పీసీసీ ఏర్పా ట్లు చేసింది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు అన్నిరకాల వంటలు, రుచులు ఉండేలా మెనూ సిద్ధం చేసింది. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, వివిధ రాష్ట్రాల ఇతర సీనియర్లు వస్తున్న నేపథ్యంలో.. ప్రత్యేక వంటకాల కోసం వివిధ ప్రాంతాల నుంచి వంట మనుషులను రప్పించింది.
►అల్పాహారంలో ఇడ్లీ, వడ, దోశ, పెసరట్టు, ఉగ్గాని, కిచిడీ, ఉప్మా, రాగి, జొన్న సంగటి, పాయ సూప్, ఖీమా రోటీ, మిల్లెట్ ఉప్మా, మిల్లెట్ వడ, ప్రూట్ సలాడ్ వంటివి వడ్డించనున్నారు.
►మధ్యాహ్నం భోజనంలో హైదరాబాదీ దమ్ బిర్యానీ, హలీమ్, బగారా రైస్, కుర్మా, దాల్చా మటన్, స్పెషల్ చికెన్, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, తలకాయ కూర, లివర్ ఫ్రై, తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ, చింతచిగురు మటన్, గోంగూర మటన్, చేపలు వడ్డిస్తారు.
►శాకాహారుల కోసం పచ్చిపులుసు, గోంగూర చట్నీ, గుత్తి వంకాయ, కొబ్బరి చట్నీ, అంబలి, దాల్చా, రోటి పచ్చళ్లు ఉండనున్నాయి.
►స్నాక్స్ ఐటమ్స్‌గా ఇరానీ చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, సర్వపిండి, వివిధ రకాల సమోసాలు, కుడుములు, మురుకులు, ఉడికించిన మొక్కజొన్న, సకినాలు, గారెలు రుచి చూపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment