సొంతింటి ఎంపికకు చక్కటి వేదిక! | Taj Krishna Hotel on March 7,8 In the Saskhi Property show | Sakshi
Sakshi News home page

సొంతింటి ఎంపికకు చక్కటి వేదిక!

Published Sat, Feb 28 2015 3:37 AM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM

సొంతింటి ఎంపికకు చక్కటి వేదిక! - Sakshi

సొంతింటి ఎంపికకు చక్కటి వేదిక!

మార్చి 7,8న తాజ్‌కృష్ణాలో సాక్షి ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎప్పటికైనా సొంతిల్లుండాలని కలలు కనేవారికి ‘సాక్షి’ మరోసారి చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది. మార్చి 7,8 తేదీల్లో హోటల్ తాజ్‌కృష్ణాలో ప్రాపర్టీ షో నిర్వహించనుంది. నగరానికి చెందిన పలు స్థిరాస్తి సంస్థలు పాల్గొనే ఈ షోలో.. ప్లాట్లు, ఫ్లాట్లు, ఇండివిడ్యువల్ హోమ్స్, విల్లాలకు సంబంధించిన సమస్త సమాచారం లభిస్తుంది. మరెందుకు ఆలస్యం వెంటనే కుటుంబంతో సహా విచ్చేసి అన్ని విధాలా నచ్చిన ఇంటిని ఆనందంగా ఎంచుకోండి.
 
పనిచేసే ఆఫీసుకో, పిల్లాడి స్కూల్‌కో దగ్గరగా ఇల్లుండాలని కోరుకునే వారి సంఖ్య పెరిగింది. అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలు మౌలికంగా అభివృద్ధి చెంది, చేరువలోనే షాపింగ్ మాల్, ఆసుపత్రి కూడా ఉండి, ధర కూడా అందుబాటులో ఉంటే చాలు వెంటనే నిర్ణయం తీసేసుకుంటున్నారు కొనుగోలుదారులు.
సాధారణంగా ఇళ్ల ధరలు ప్రీలాంచ్‌లో తక్కువగా ఉంటాయి. నిర్మాణం పూర్తయి, ఫ్లాట్లను అప్పగించే సమయంలో కాసింత ఎక్కువగా చెబుతారు. కారణాలేమైనప్పటికీ చెన్నై, బెంగళూరు, ముంబై వంటి నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో నేటీకీ ఇళ్ల ధరలు తక్కువగానే ఉన్నాయి. అంతేకాదు రాష్ట్రంలోని ఇతర నగరాలతో పోల్చుకుంటే కూడా నగరంలోనే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది. ప్రభుత్వానికి కట్టే పన్నులు, ఇతరత్రా రుసుములూ రెట్టింపయ్యాయి. అయినా ఇంటి అంతిమ ధరలను మాత్రం పెంచట్లేదు నిర్మాణ సంస్థలు. రానున్న రోజుల్లో మార్కెట్ వురింత మెరుగవుతోంది కాబట్టి, ధరలు పెరిగినా ఆశ్చర్యపడక్కర్లేదు. కాబట్టి, సొంతిల్లు కొనుక్కోవడానికి ఇదే మంచి తరుణం.
మెట్రో రైల్ పనులు శరవేగంగా జరుగుతుండటం, త్వరలోనే పూర్తి స్థాయిలో ఔటర్ రింగ్ రోడ్ అందుబాటులోకి రానుండటం, తెలంగాణ ప్రభుత్వం నగరం చుట్టూ ఫార్మా, ఫిల్మ్, హెల్త్, స్పోర్ట్స్, గేమ్, ఎడ్యుకేషన్ సిటీల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుండటం వంటివి స్థిరాస్తి రంగంలో ఆశలను రేపుతోంది. ఆయా ప్రాజెక్ట్‌లతో నగరానికి లక్షల కోట్ల పెట్టుబడులతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయి. దీంతో అపార్ట్‌మెంట్ల అమ్మకాలు పెరిగి, విల్లాల జోరు అధికమై, వాణిజ్య సముదాయాలకూ గిరాకీ రెట్టింపు కానుంది.
 
మెయిన్ స్పాన్సర్:
అపర్ణా కన్‌స్ట్రక్షన్స్
అసోసియేట్ స్పాన్సర్: ఆదిత్యా కన్‌స్ట్రక్షన్స్
కో-స్పాన్సర్స్: హిల్‌కౌంటీ ప్రాపర్టీస్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సిరి సంపద ఫామ్స్ అండ్ ఎస్టేట్స్
పాల్గొనే సంస్థలు: సత్వా గ్రూప్, మంజీరా కన్‌స్ట్రక్షన్స్, ఎస్‌ఎంఆర్ బిల్డర్స్, శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్, జనప్రియ ఇంజనీర్స్, రాజపుష్ప ప్రాపర్టీస్, ప్రణీత్ గ్రూప్, నార్త్ స్టార్ హోమ్స్, సాకేత్ ఇంజనీర్స్, ఆక్సాన్ హౌజింగ్ సొల్యూషన్స్, ఫార్చూన్ ఇన్‌ఫ్రా డెవలపర్స్, గ్రీన్ హోమ్, ఎస్‌ఎల్ గ్రూప్, బీఆర్సీ ఇన్‌ఫ్రా, శతాబ్ధి టౌన్‌షిప్స్ ప్రై.లి., స్వర్ణ విహార్ ఇన్‌ఫ్రా, వర్ధన్ డెవలపర్స్, స్పేస్ విజన్, మ్యాక్ ప్రాజెక్ట్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement