
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడి వివాహం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో జరిగింది. ఆగస్టు 5, బుధవారం రాత్రి 11గంటల 49 నిమిషాలకు జరిగిన ఈ వివాహా కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వనించారు. మంత్రి విశ్వరూప్ కుమారుడు వరుడు శ్రీకాంత్, వధువు వైష్ణవికి బంధువులు, అతిథులు శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పరిమిత సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వివాహ వేడుక ఘనంగా జరిగింది.