Vishwaroop
-
సీఎం జగన్ కు ఆసరా లబ్ధిదారుల కృతజ్ఞతలు
-
అంతు చూస్తారట!
75 ఏళ్ల ముసలాయన, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు మాట్లాడుతున్న మాటలు వినండి. అధికారం ఇస్తే ఏం చేస్తారో వీళ్ల నోటితో వీళ్లే చెప్పారు. తనకు అధికారం ఇస్తే ఎవరినీ వదలడట.. తనకు గిట్టని వారి అంతు చూస్తాడట.. మట్టుబెడతాడట.. ఉగ్రరూపం చూపిస్తాడట.. ఏకంగా నరకం చూపిస్తాడట.. ఇందుకోసం ఆయనకు అధికారం ఇవ్వాలట! ఇదీ ఈ పెద్దమనిషి నైజం. ఇలాంటి ఆయన కోసం ఆయన దత్తపుత్రుడు పరుగెడుతున్నాడు. ఈ పెద్దమనిషికి ఏనాడైనా ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఉందా? ఫలానా పని చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేకే రెచ్చగొట్టి గొడవలు సృష్టించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఇదేం రాజకీయం? – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, అమలాపురం: ‘చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఎక్కడా చెప్పడం లేదు. అలా చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అందుకే గొడవలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. యాత్రలు, సభల పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నారు’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. అమలాపురంలో వైఎస్సార్ సున్నా వడ్డీ నాలుగో విడత నిధుల విడుదల సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు నిజంగా వీళ్లందరి ఆలోచన ఏ స్థాయిలో ఉందో ప్రజలు గమనించాలని కోరారు. ‘వారు మంచి చేస్తామంటే ప్రజలు నమ్మరని వాళ్లకు తెలుసు. కాబట్టే ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అబద్ధాలు చెబుతున్నారు. ప్రతి రోజూ మోసాలు చేస్తారు. మీటింగులు పెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చివరకు 47 మంది పోలీసులపై దాడి చేశారు. ఇలాంటి రాక్షసులకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలని అనిపించింది. ఎక్కడికక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టిస్తున్న వారి పట్ల మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. శవ రాజకీయాలు చేస్తున్నారు. ♦ మొన్న అంగళ్లులో చంద్రబాబు తానే స్వయంగా రెచ్చగొట్టి గొడవలు చేయించారు. మళ్లీ పుంగనూరులో ఒక రూటుకు అనుమతి తీసుకొని ఆ రూట్లో పోకుండా పుంగనూరుకు వచ్చి వేరే రూట్లో పోవాలని ప్రయత్నించారు. అప్పుడే పోలీసులు మీకు అనుమతి లేదని, అక్కడ అధికార పార్టీవాళ్లు నిరసన కార్యక్రమం చేసుకుంటున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని చెప్పారు. ♦ దీంతో చంద్రబాబు వారిని ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. వాళ్ల క్యాడర్‌ను రెచ్చగొట్టి 47 మంది పోలీసులను గాయపరిచారు. ఒక పోలీసు సోదరుడికి కన్ను కూడా పోగొట్టాడు. కారణం గొడవలు జరగాలి. శవ రాజకీయాలు చేయాలన్నదే ఆలోచన. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 వాళ్లదే. వాళ్లు ఏం చెబితే అది రాస్తారు. మైకులు పట్టుకొని దత్తపుత్రుడు రెడీగా ఉన్నాడు కాబట్టి శవ రాజకీయాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చులకన ♦ ఈ పెద్దమనిషి చంద్రబాబు మనస్తత్వం చూడండి. దళితులను చీల్చి వారికి నరకం చూపించాడు. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అని చెప్పి వారిని నానా ఇబ్బందులకు గురిచేశాడు. బీసీల తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా, తాట తీస్తా అని బెదిరించాడు. బీసీలకు 143 వాగ్దానాలిచ్చి వెన్నుపోటు పొడిచి మరీ వాళ్లకు నిలువునా దగా చేశాడు. ♦ మైనార్టీలకు, ఎస్టీలకు కనీసం ఒక్కటంటే ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మైనార్టీ ఓటు బ్యాంకుతో చెలగాటం ఆడటాన్ని అదే పనిగా పెట్టుకొన్న విషయం గుర్తుకు తెస్తున్నా. ఎస్టీలకు ఏనాడూ న్యాయం చేయకుండా కనీసం ఒక్క ఎకరా ఆర్వోఎఫ్ఆర్ పట్టా ఏ రోజు ఇవ్వకుండా తన పెత్తందార్లకు మన్యాన్ని అప్పగించి మోసం చేశాడు. ♦ అక్కచెల్లెమ్మలను సైతం మోసం చేశాడు. కోడలు మగ పిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా అని అగౌరవ పరిచాడు. ఇటువంటి పెద్ద మనిషి ఈరోజు మైకు పట్టకుని ఊదరగొడుతున్నాడు. నోరు తెరిస్తే అబద్ధాలే ♦ 2014కు ముందు ఈయన మాట్లాడిన మాటలు గుర్తుకు తెచ్చుకోండి. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు రావాలి అన్నారు. రైతుల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలట. అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల రుణాలు మాఫీ కావాలంటే బాబు రావాలట. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే బాబు రావాలంటూ మోసం చేశాడు. రూ.85,712 కోట్ల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి, చేయకుండా రైతులను నిలువునా మోసం చేశాడు. ♦ రూ.14,207 కోట్ల పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. చివరకు చదువుకుంటున్న పిల్లలనూ వదల్లేదు. ఉద్యోగం ఇస్తాను లేదా ఉపాధి కల్పిస్తాను అని నిస్సిగ్గుగా అబద్ధాల వాగ్దానాలు చేశాడు. లేదంటే ఇంటింటికీ రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. ప్రతి ఇంటికీ రూ.2 వేలు అంటే ప్రతి పిల్లాడికీ ఏటా రూ.24 వేలు అలా ఐదేళ్లలో రూ.లక్షా 20 వేలు మోసం చేశాడు. ♦ మాటంటే విలువ లేదు. విశ్వసనీయత లేదు. ఎన్నికలు అయ్యాక ప్రజల్ని గాలికి వదిలేయాలి అనే తలంపుతో పరుగెత్తుతున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీళ్లందరూ దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే అధికారం కావాలి. జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడితో ఎండ్ అవుతుంది. నాడు, నేడు అదే బడ్జెట్.. ♦ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే బడ్జెట్, ఇదే రాష్ట్రం. అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. కేవలం ముఖ్యమంత్రి మారాడు. మీ బిడ్డకు ఓటు వేయకపోయినా ఫర్వాలేదు.. కచ్చితంగా వారికి రావాల్సినవి రావాలని ప్రయత్నం చేశాడు. మీ బిడ్డ ఎలా చేయగలుగుతున్నాడు. అప్పట్లో ఇదే చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడని ఆలోచించండి. ♦ మీ బిడ్డ మీ కోసం ఎక్కడా లంచాలు, వివక్ష లేకుండా రూ.2.31 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి మీ అకౌంట్లలోకి పంపించాడు. ఈ నాలుగేళ్లలో ఇంతటి సంక్షేమాభివృద్ధిని ఏనాడైనా చూశామా? చంద్రబాబు హయాంలో సామాజిక న్యాయం ఉందా? నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా ఇన్ని పదవులు ఏనాడైనా ఇచ్చారా? ఏనాడైనా మీ బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచన చేశాడా? చివరకు పేదింటి పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవాలంటే కూడా వద్దన్న చరిత్ర ఆయనది. వాళ్ల పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లకు మాత్రం ఇంగ్లిష్ మీడియం కావాలి. ♦ చంద్రబాబు అధికారంలో ఉండగా ఇలా 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి.. ఇళ్లు కట్టించడం ఎప్పుడైనా చేశారా? ఇలా చేయలేకపోయిన ఈ 75 ఏళ్ల ముసలాయన వాటిని అడ్డుకోవడంలో మాత్రం ముందుంటారు. దత్తపుత్రులు ఎందుకిలా పరుగెడుతున్నాడంటే ఆయన సీఎం కావడానికి కాదట. ఈ ముసలాయన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడానికట. ఇలాంటి వ్యక్తి సీఎం అయితే మనకు మంచి జరుగుతుందా? ♦ మీకు మంచి చేయడానికి వస్తున్న వలంటీర్లను కూడా వదలకుండా ఎంత దారుణంగా మాట్లాడారు. రాబోయే రోజుల్లో వీళ్ల నీచ రాజకీయాలు, అబద్ధాలు ఇంకా ఎక్కువ అవుతాయి. మీ బిడ్డ నమ్ముకున్నది దేవుడి దయ, మీ దీవెనలనే. మీకు మంచి జరిగి ఉంటే నాకు మద్దతివ్వండి. అమలాపురంలో మూడు వంతెనలకు రూ.10 కోట్లు అమలాపురంలో మూడు పాత బ్రిడ్జిలు ఉన్నాయి. వాటిని పునర్ నిర్మించాలని మంత్రి విశ్వరూప్ అడిగారు. ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయిస్తున్నాను. మా దగ్గర 84 సచివాలయాలున్నాయి. మాది ఇబ్బందికర ప్రాంతం.. వర్షాలు వస్తే ఇబ్బంది పడతాం.. అని విశ్వరూప్ చెప్పారు. అందుకు మంత్రి విశ్వరూప్‌ను, లేదా అతని కుమారుడు డాక్టర్ శ్రీకాంత్‌ను బాగా తిరిగి ఏం పనులు కావాలో చెప్పాలన్నాను. ప్రతి సచివాలయానికి జీజీఎంపీ కింద రూ.40 లక్షలు మంజూరు చేస్తానని చెప్పాను. మీ గ్రామాలను అభివృద్ధి చేయడానికి మీ బిడ్డ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. -
‘బాబు కాళ్లు పట్టుకున్న నేతకు ఆ అర్హత లేదు’
సాక్షి, తాడేపల్లి: దళితులపై దాడుల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించినంత వేగంగా ఏ సీఎం స్పందించలేదని మంత్రి విశ్వరూప్ అన్నారు. దళితులపై దాడులు చేసిన వారిపై తమ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందన్నారు. బుధవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... దళితులపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించామని తెలిపారు. అత్యాచార ఘటనల్లో నిర్భయ, ఎస్సి ఎస్టీ కేసులు నమోదు చేసి నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దిశ చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు. టీడీపీ నేత హర్షకుమార్ దళితుల బాగుకోసం చేసిందేమీ లేదని అన్నారు. హర్షకుమార్ ఎంపీగా పోటీ చేస్తే పది వేల ఓట్లు కూడా రాలేదని, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన కుమారుడికి 600 ఓట్లు మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. హర్షకుమార్‌ది దళిత ఎజెండా కాదని... చంద్రబాబు, అమరావతి ఎజెండా అన్నారు. దళిత యువకుడు ప్రసాద్ రాష్ట్రపతికి రాసిన లేఖ వెనుక హర్ష కుమార్ ఉన్నారని మంత్రి విశ్వరూప్ ఆరోపించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి దయవల్ల హర్షకుమార్ ఎంపీ అయ్యారని, దళితులను మాస్క్‌లా హర్షకుమార్ వాడుకుంటున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ హయాంలో దళిత నేతలు అంబేద్కర్ విగ్రహాలను తొలగిస్తే నోరు మెదపని టీడీపీకి ఇప్పుడు వారి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దళితుల అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, అమరావతికి దళిత సమస్యలకు సంబంధం ఏమిటన్నారు. దళితులను ప్రభుత్వానికి దూరం చేయాలనే కుట్రతోను చంద్రబాబుతో కలిసి హర్షకుమార్ పని చేస్తున్నారని మంత్రి విశ్వరూప్ మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల కోసం చంద్రబాబు కాళ్లు పట్టుకున్న వ్యక్తి హర్షకుమార్ అని పేర్కొన్నారు. బ్లాక్ మెయిల్ చేసి ఎన్నికల్లో పది వేల ఓట్లు తెచుకున్న చరిత్ర హర్షకుమార్‌ది అని మంత్రి విమర్శించారు. అలాంటి వ్యక్తి సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రభుత్వంపై బురద జల్లడమే హర్షకుమార్ పనిగా పెట్టుకున్నారని, టీడీపీ హయాంలో చాలా సందర్భాల్లో దళితులపై దాడులు జరిగాయని మంత్రి గుర్తు చేశారు. టీడీపీ హయాంలో దళితులపై జరిగిన దాడుల సమయంలో ఎందుకు వర్ల రామయ్య నోరు మెదపలేదని ప్రశ్నించారు. సీఎం జగన్మోహన్రెడ్డి దళిత పక్షపాతి అని.. దళితులకు ఒక ఉపముఖ్యమంత్రి, ఐదు మంత్రి పదవులు ఇచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు. వైస్సార్ చేయూత ద్వారా బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ ఎంతో మేలు చేస్తున్నారని కొనియాడారు. హర్షకుమార్‌ను ప్రజలు జోకర్‌గా చూస్తున్నారని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. -
మంత్రి విశ్వరూప్ కుమారుడి వివాహం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ కుమారుడి వివాహం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్‌కృష్ణలో జరిగింది. ఆగస్టు 5, బుధవారం రాత్రి 11గంటల 49 నిమిషాలకు జరిగిన ఈ వివాహా కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులను ఆహ్వనించారు. మంత్రి విశ్వరూప్ కుమారుడు వరుడు శ్రీకాంత్, వధువు వైష్ణవికి బంధువులు, అతిథులు శుభాభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రెండు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు పరిమిత సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం వివాహ వేడుక ఘనంగా జరిగింది. -
మాజీ ఎంపీ హర్షకుమార్ చెల్లని నాణెం: విశ్వరూప్
-
హర్షకుమార్కు ఆ అర్హత లేదు : పినిపె విశ్వరూప్
సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత మాజీ ఎంపీ హర్షకుమార్కు లేదని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హర్షకుమార్ చెల్లని నాణేమని విమర్శించారు. ప్రజలు తిరస్కరించినా అతనిలో మార్పు లేదన్నారు. 48 రోజులు జైలు జీవితం గడిపాక హర్షకుమార్ చిన్న మెదడు చిట్లినట్లుందని ఎద్దేవా చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే నాలుక కోస్తామని హెచ్చరించారు. చంద్రబాబు దృష్టిలో పడటానికి టీడీపీ నేతల మద్దతు కోసం హర్షకుమార్ ప్రాకులాడుతున్నాడన్నారు. ఎప్పుడో జరిగిన ఘటన గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని విశ్వరూప్ పేర్కొన్నారు. -
విమర్శించేవారి బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు?
సాక్షి, ఒంగోలు : ప్రతి పేదవాడి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి.. వారికి మంచి భవిష్యత్తు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సాంఘీక సంక్షేమ మంత్రి విశ్వరూప్ అన్నారు.నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలలో సమూలమైన మార్పులను తీసుకొస్తామని చెప్పారు. మంగళవారం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ.. మూడు దశల్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్క పేదవాడు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజకీయాల కోసమే టీడీపీ అనవసరమైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. భాష వేరు బోధనా మాద్యమం వేరు ఐదేళ్ల కాలంలో దశల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశ పెడుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఇంగ్లీషు మీడియంపై విమర్శలు చేస్తున్నవారు తమ బిడ్డలను ఎక్కడ చదివిస్తున్నారో తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. భాష వేరు బోధనా మాద్యమం వేరని తెలిపారు. రాజకీయాల కోసమే టీడీపీ చౌకబారు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని వదిలివేసి కమీషన్ల కోసం పని చేశారని ఆరోపించారు. మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారన్నారు. నాడు నేడు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని కోరారు. -
మాట తప్పని మిత్రుడు
సాక్షి, బాలాజీచెరువు (కాకినాడ సిటీ): మాట తప్పం మడప తిప్పం అనే సిద్ధాంతం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. సొంతంగా ఆటో, క్యాబ్, మ్యాక్సీ నడుపుకొనే యాజమానుల కోసం ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకాన్ని ఆయన కాకినాడ అంబేద్కర్ భవన్లో శుక్రవారం ప్రారంభించారు. ముందుగా సభాధ్యక్షుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ముఖ్యమంత్రి జగన్ సందేశాన్ని చదివి వినిపించారు. ఏలూరులో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగాన్ని ఎల్ఈడీ స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆర్భాటం, ప్రచారం తప్ప ఏమీ చేయలేదని, అలాగే ఏ పథకం ప్రవేశపెట్టినా గ్రామానికి పట్టుమని పది మందికి కూడా ఇచ్చేవారు కాదని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందాలనేది ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి లక్ష్యమని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉభయ రాష్ట్రాల్లో ఉన్న పెన్షన్ల సంఖ్యను 14 లక్షల నుంచి ఒక్కసారిగా 73 లక్షలకు పెంచి పేదల పాలిట కల్పతరువుగా నిలిచారన్నారు. మ్యానిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో లోకేష్‌కు తప్ప ఎవ్వరికీ జాబు రాలేదని గుర్తు చేశారు. నాలుగు నెలలో కాలంలో నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించామని, వాటిలో లక్షా 27 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి దేశ చరిత్రలో నిలిచామని అన్నారు. సభలో పాల్గొన్న శాసన మండలి సభ్యుడు చిక్కాల రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో దాదాపుగా 60 వేల వాహన యాజమానులు ఉంటే వారిలో 19వేల మందికి మాత్రమే ఇచ్చారని సభలో అన్నారు. దానికి మంత్రి విశ్వరూప్ సవాల్ విసిరి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకం అమలు చేశామని, అవసరమైతే చర్చకు సిద్ధమని అన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తిగా ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డిని చూశామని, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని చూస్తున్నామని అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నా వైఎస్సార్ వాహన మిత్ర, రైతు భరోసా, జనవరిలో అమ్మ ఒడి వంటి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించారన్నారు. ఆటో యూనియన్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పారు. అర్హులైన వారికి ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు. నగర మేయర్ సుంకర పావని, శాసన మండలి సభ్యుడు చిక్కాల రామచంద్రరావు వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్ని స్వాగతిస్తూ ఇది మంచి పథకమని వాహనదారులందరూ వీటిని వాహనం నిమిత్తం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి మాట్లాడుతూ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపజేయాల్సిందిగా ముఖ్యమంత్రి అదేశించారని, అలాగే లైసెన్స్ వేరే ప్రాంతంలో ఉన్నప్పటికీ, చిరునామా ఈ జిల్లాలో ఉంటే వారికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని తెలిపారన్నారు. డీటీసీ సీహెచ్ ప్రతాప్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈ పథకానికి 19,209 మంది అర్హత సాధించారని, వీరందరికీ నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెప్పారు. ఒక వ్యక్తి పేరుతో ఎన్ని వాహనాలు ఉన్నా ఒక్క వాహనానికి మాత్రమే అర్హులు అవుతారని, అలాగే వాహనానికి సంబంధించి ఆర్సీ, లైసెన్స్ వంటివి సక్రమంగా ఉంటే ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అర్హులేనని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రి విశ్వరూప్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి ఆర్థిక సాయం, సందేశాత్మక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లంకే హేమతల, ఆర్టీఓ రామప్రసాద్, రవాణా శాఖ అధికారులు యడ్ల సురేష్, కళాజ్యోతి, సురేష్‌కుమార్, లక్ష్మీకిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రమాదాల నివారణపై డాక్యుమెంటరీ ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ప్రారంభానికి ముందు వాహన ప్రమాదాల నివారణపై ప్రదర్శించిన డాక్యుమెంటరీ సభికులను ఆలోచింపజేసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పినిపే విశ్వరూప్, సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖరరెడ్డి, కలెక్టర్ మురళీధరరెడ్డి ఆ డాక్యుమెంటరీని తిలకించి అభినందించారు. రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కళాజ్యోతి స్కిట్ రచనతో పాటు దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన డాక్యుమెంటరీ ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ఆటో యజమానులను ఆకట్టుకుంది. ముఖ్య కూడళ్లలో, అలాగే జాతీయ రహదారి, డ్రంక్ అండ్ డ్రైవ్, సీటు బెల్టు డ్రైవింగ్, అధిక బరువు వాహనాల వంటి ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలో వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఈ డాక్యుమెంటరీలో ఎంవీఐ నరసింహారావు, ఏఎంవీఐ యడ్ల సురేష్‌బాబు, బుక్కా శ్రీనివాసరావులతో పాటు అన్ని క్యాడర్ల సిబ్బంది నటించడం విశేషం. డాక్యుమెంటరీ వీక్షించిన వారందరిలో కాసేపు వాహన ప్రమాదాలతో పాటు వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగింది. ఇటువంటి వాటిని ముఖ్యమైన కూడళ్లతో పాటు సినిమా హాళ్లలో ప్రత్యేకంగా ప్రదర్శిస్తే అవగాహన కలుగుతుందని జిల్లా అధికారులు సూచించారు. తండ్రికి తగ్గ తనయుడి పాలన.. తండ్రికి తగ్గ తనయుడి పాలనలా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలన ఉంది. పాదయాత్రలో భాగంగా ఏలూరులో ఆటో డ్రైవర్లకు ప్రకటించిన ఆర్థిక సాయం ప్రభుత్వం వచ్చిన నాలుగునెలల కాలంలో ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఏ నాయకుడికీ రాని ఆలోచన వచ్చి మా లాంటి వారిని ఆదుకున్నారు. – జి.వేంకటేశ్వరరావు, పి.గన్నవరం ఆటో యూనియన్ అధ్యక్షుడు ముఖ్యమంత్రికి అండగా ఉంటాం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఆటో కార్మికులందరమూ అండగా ఉంటాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో, మళ్లీ ఇప్పుడు ఆయన తనయుడి హయాంలో సమర్థవంతమైన పాలన చూస్తున్నాం. అన్న మాట ప్రకారం వాహన యాజమానులకు సహకారం అందజేశారు. – ఎం.శ్రీనివాసరావు, ఆటో యజమాని, గన్నవరం -
చివరి మృతదేహం దొరికే వరకూ గాలింపు చర్యలు
సాక్షి, తూర్పు గోదావరి : గోదావరిలో ప్రమాదానికి గురైన లాంచీలో గల్లంతైన వారి సంఖ్య పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సంఘటన స్థలంలో చర్యలను బుధవారం సాయంత్రం మంత్రులు కురసాల కన్నబాబు, విశ్వరూప్ పరిశీలిస్తున్నారు. తాజా సమాచారం మేరకు లాంచీలో ప్రయాణించిన 73 మందిని గుర్తించినట్లు వారిలో 26 మంది సురక్షితంగా బయటపడగా.. 34 మృతదేహాలను గుర్తించారని తెలిపారు. కాగా ఈ రోజు మరో ఐదుగురు కనిపించడం లేదని వారి బంధువులు రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చారని అన్నారు. దీనిని బట్టి చూస్తే బోటులో ఇంకా 18 మంది గల్లంతైన వారి ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి తెలిపారు. లాంచీ మునిగిన ప్రాంతంలో గోదావరి ప్రమాదకరంగా ఉందని, బురద ఉండడంతో సైడ్ సోనార్ స్కానర్ పంపించినా లాంచీ చిత్రాలు లభించలేదని అన్నారు. కచ్చులూరు నుంచి సముద్ర మొగ వరకు మిగిలిన 13 మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని, ఘటన జరిగిన ప్రాంతం నుంచి లాంచీ ఎలా తీయలనే దానిపై నిపుణులు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు. దీని కోసం ముంబై, జార్ఖండ్, విశాఖ, కాకినాడ నుంచి పలు బృందాలు లాంచీ వెలికితీసేందుకు పనిచేస్తున్నాయన్నారు. లాంచీలో ఏ ఒక్క మృతదేహం లభించినా తమకు ముఖ్యమేనని, చివరి మృతదేహం దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. సంఘటన ప్రాంతంలో కొనసాగుతున్న చర్యలపై ఇరు రాష్టాల ముఖ్యమంత్రులు అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. -
గత ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమాన్ని మరిచింది
-
కేటాయించిన పనిని బధ్యతయుతంగా నిర్వహిస్తా : విశ్వరూప్
-
పట్టిసీమతో సీమకు నీరివ్వడం ఎలా సాధ్యం
-
'పట్టిసీమతో సీమకు నీరివ్వడం ఎలా సాధ్యం'
హైదరాబాద్ : ధవళేశ్వరంలో సరిపాడా నీటిమట్టం లేకుండా పట్టిసీమ ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని వైఎస్ఆర్ సీపీ నేత విశ్వరూప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టిసీమ నిర్మాణం వల్ల కృష్ణా డెల్టాలో 35 టీఎంసీల నీరు కోల్పోతామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీరివ్వడం ఎలా సాధ్యమవుతుందున్నారు. పట్టిసీమ నిర్మాణం ఇంకా పూర్తికాలేదని, ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ నాశిరకంగా ఉన్నాయంటూ విశ్వరూప్ ఆరోపించారు. -
రాష్ట్ర చరిత్రలో డిసెంబర్ 5 బ్లాక్ డే: విశ్వరూప్
రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుందని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ముఖ్యమంత్రి తెలివితక్కువతనంతో వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే డిసెంబర్ 5 బ్లాక్ డే అని విశ్వరూప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఆందోళనలో పాల్గొనడం హాస్యాస్పదమని విశ్వరూప్ అన్నారు. -
విశ్వరూప్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం
-
విశ్వరూప్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం
మంత్రిపదవికి పినిపే విశ్వరూప్ చేసిన రాజీనామాను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం ఆమోదించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించిన విశ్వరూప్, ఆ మేరకు నేరుగా గవర్నర్ వద్దకు కూడా వెళ్లి రాజీనామా లేఖను ఆయనకే అందించిన విషయం తెలిసిందే. ఆయన విజ్ఞప్తి మేరకు విశ్వరూప్ రాజీనామాను గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పంపారు. రాష్ట్ర విభజనను ఉప సంహరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటన విడుదల చేయాలని సెప్టెంబర్ 7 తేదిన భీమవరంలో పినిపే విశ్వరూప్ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమ నేతల నుంచి రాజీనామాకు ఒత్తిడి పెరగడం, విభజనకే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతోందనే వార్తల నేపథ్యంలో మంత్రి విశ్వరూప్ రాజీనామా తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.