
సాక్షి, వైఎస్సార్ కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత మాజీ ఎంపీ హర్షకుమార్‌కు లేదని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారంనాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హర్షకుమార్ చెల్లని నాణేమని విమర్శించారు. ప్రజలు తిరస్కరించినా అతనిలో మార్పు లేదన్నారు. 48 రోజులు జైలు జీవితం గడిపాక హర్షకుమార్ చిన్న మెదడు చిట్లినట్లుందని ఎద్దేవా చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే నాలుక కోస్తామని హెచ్చరించారు. చంద్రబాబు దృష్టిలో పడటానికి టీడీపీ నేతల మద్దతు కోసం హర్షకుమార్ ప్రాకులాడుతున్నాడన్నారు. ఎప్పుడో జరిగిన ఘటన గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని విశ్వరూప్ పేర్కొన్నారు.