న్యూ ట్రెండ్జ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని తాజ్ కృష్ణా హోటల్‌లో బుధవారం ట్రెండ్జ్ ఎక్స్‌పో ప్రారంభమైంది. మొత్తం 75 మంది డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారని నిర్వాహకురాలు శాంతి కతిరావన్ చెప్పారు. రానున్న శ్రావణమాసం, పెళ్లిళ్ల సీజన్‌ను పురస్కరించుకుని అన్ని రకాల వస్త్రశ్రేణులు, ఆభరణాలు, యాక్సెసరీస్‌ను ప్రదర్శిస్తున్నామని వివరించారు. ఇది తమ 100వ ప్రదర్శన అని... మరో 2 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు.